E-Paper
Advertisement

KTR On Press Meet: మీడియాతో కేటీఆర్.. తప్పుడు పనులు చేయలేదు, హీరోయిన్లతో సంబంధాలు అంటగట్టారు

KTR On Press Meet: మీడియాతో కేటీఆర్.. తప్పుడు పనులు చేయలేదు, హీరోయిన్లతో సంబంధాలు అంటగట్టారు
Advertisement

KTR On Press Meet: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యే ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కీలక ప్రశ్నలు సంధించారు. పుట్టిన మట్టి సాక్షిగా ఎలాంటి అక్రమ పనులు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. పదేళ్లు కేసీఆర్ నాయకత్వంలో వివిధ హోదాల్లో ప్రజల కోసం పని చేశానని తెలిపారు.

విచారణకు ముందు మీడియాతో కేటీఆర్

Advertisement

శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆయన పార్టీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. తాను ఎన్నడూ ప్రత్యర్థుల కుటుంబాలను రాజకీయాల్లోకి లాగి టైంపాస్ కార్యక్రమాలు చేయలేదన్నారు. మేనిఫెస్టోలో ఇవ్వని వాగ్దానాలను కేసీఆర్ నెరవేర్చారని గుర్తు చేశారు. రెండేళ్ల నుంచి తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఆరోపించారు. తాను డ్రగ్స్ తీసుకుంటానని,హీరోయిన్లతో సంబంధం ఉందని వార్తలు రాయించారని ఆందోళన వ్యక్తం చేశారు.

రెండేళ్ల నుంచి తన పరువుకు బాధ్యుడు ఎవరో సమాధానం చెప్పాలన్నారు. సిట్ విచారణలో ఇదే విషయాన్ని అధికారులను అడుగుతానని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ డ్రామా ఆడుతోందని ఆరోపించారు. కేసీఆర్ సైనికులుగా ఉద్యమం నుంచే ఉద్భవించారన్నారు. ఆనాడు కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రత్యేక రాష్ట్రం కోసం సుదీర్ఘంగా కొట్లాట చేశామన్నారు.

Advertisement

నా పరువుకు బాధ్యులెవరంటూ కేటీఆర్ ప్రశ్న

రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని, తాను మంత్రి అయ్యానని తెలిపారు. గడిచిన పదేళ్లులో రాష్ట్రం కోసం ఎంతో చేశామన్నారు. ఇవాళ జరుగుతున్న పరిణామాలు బాధగా ఉందన్నారు. అలాగని విచారణకు తాము భయపడమన్నారు. పిచ్చోడి చేతిలో రాయిలా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. ఒక్కో రోజు ఒక్కో డ్రామా పేరుతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని, హామీలు పక్కకు వెళ్ళిపోయాయని అన్నారు.

మా ఎమ్మెల్యేలను కొనేందుకు 50 లక్షలతో దొరికారని వివరించారు. ఆ విషయం మాకేం తెలుస్తుందన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మాపై ఇలాంటి దాష్టీకానికి పాలపడుతున్నాడని మండిపడ్డారు. సింగరేణిలో అతి పెద్ద కుంభకోణాన్ని హరీష్‌రావు బయట పెట్టారన్నారు. ఈ కుంభకోణం గురించి ఆయన మాట్లాడగానే సాయంత్రం సిట్ నోటీసులు ఇచ్చిందన్నారు. సిట్ విచారణకు హాజరైన ఆయన, అధికారులకు ప్రశ్నలు వేశారన్నారు.

ALSO READ: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు ముందు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు, వీహెచ్ కౌంటర్

ఫోన్ ట్యాపింగ్ కేసుని టీవీలో సీరియల్ మాదిరిగా నడిపిస్తున్నారని విమర్శించారు. రెండేళ్ల నుంచి దొంగ పనులు చేసుకుంటూ దొరికిపోతున్నారని అన్నారు. దండు పాళ్యం ముఠా అక్రమాలు బయట పెడుతున్నందుకు మాపై కేసులు, విచారణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇదే క్రమంలో కొందరి పోలీసు అధికారులను బెదిరించే ప్రయత్నం చేశారాయన. తాము అధికారంలోకి రాగానే వారిని వదిలి పెట్టేది లేదన్నారు. అర్జునుడి కన్ను పక్షి మీద ఉన్నట్లు, తాము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై పోరాడుతూనే ఉంటామన్నారు.

 

Related News

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

Big Stories

Advertisement
×