E-Paper
Advertisement

Harishrao : డేంజర్‌లో కేసీఆర్.. ఆయన మరో కట్టప్ప!

Harishrao : డేంజర్‌లో కేసీఆర్.. ఆయన మరో కట్టప్ప!
Advertisement

బీఆర్ఎస్ పార్టీలో మరోసారి కట్టప్ప అంశం తెరమీదకు వచ్చింది. రాబోయే రోజుల్లో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు వెన్నుపోటు తప్పదని అధికార పార్టీకి చెందిన కీలక నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, కల్వకుంట్ల కవితను ఇంట్లో నుంచి గెంటివేశారని.. ఇక కేటీఆర్, హరీశ్ రావుల మధ్యే తీవ్ర పోటీ నెలకొందని.. అధికారం, ఆధిపత్యం కోసం హరీశ్ రావు గులాబీ అధినేతకు వెన్నుపోటు పొడిచేందుకు పావులు కదుపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2029 ఎన్నికల నాటికి పార్టీ రెండు ముక్కలు అవ్వడం ఖాయమనే ప్రచారం కూడా ఊపందుకున్నది.

సీఎం కుర్చీ కోసం ఆరాటం..

బీఆర్ఎస్ పార్టీలో సీఎం కుర్చీ కోసం పాకులాట ఇప్పుడే ప్రారంభమైంది కాదు. 2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాక బంపర్ మెజార్టీతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అప్పటి టీఆర్ఎస్ సీనియర్లు ఈటల రాజేందర్, హరీశ్ రావులకు మంత్రి పదవులు దక్కలేదు. చాలా ఆలస్యంగా వీరికి పదవులు దక్కాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కుర్చీ కోసం పార్టీని రెండుగా చీల్చే ప్రయత్నాలు జరిగాయి.ఎమ్మెల్యేలతో ప్రైవేటుగా చర్చలు జరుపుతున్నారనే విషయం గులాబీ బాస్‌కు తెలియడంతో ఈటలను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారనే అప్పుడు జోరుగా ప్రచారం జరిగింది. అందులో హరీశ్ రావు ఇన్వాల్వ్ మెంట్ కూడా ఉందని వార్తలు వచ్చాయి.

మొన్న కవిత.. నేడు అధికార పార్టీ నేతలు..

Advertisement

హరీశ్ రావుతో కేసీఆర్‌‌కు ముప్పు ఉన్నదని కల్వకుంట్ల కవిత పలుమార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. కేసీఆర్ కుర్చీ కోసం ఆయన వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నాడని, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపేందుకు చేసిన కుట్రల్లో ఆయన హస్తం కూడా ఉందని.. దాన్ని వ్యతిరేకించడం, ఆయన ప్రయత్నాలకు అడ్డుతగులుతున్నానని కుట్రలు పన్ని తనను పార్టీ నుంచి వెళ్లగొట్టారని కవిత ఆరోపించారు. అందుకే ఇటీవలి రోజుల్లో కవిత హరీశ్ రావే టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు.కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి కేసీఆర్‌కు ప్రమేయం లేదని.. మొత్తం హరీశ్ రావు హస్తమే ఉందని, కావాలని కేసీఆర్‌కు అవినీతి మరక అంటించారని విమర్శించిన విషయం తెలిసిందే.

 

Advertisement

తాజాగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సైతం హరీశ్ రావుతో కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఏ క్షణంలో అయినా ఆయన వెన్నుపోటు పొడిచే అవకాశం ఉందన్నారు. మరో కాంగ్రెస్ కీలక నేత జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ‘నేను డైరెక్ట్ రాజకీయం చేస్తా.. హరీశ్ రావు వెనక నుండి పొడుస్తడు..నా రాజకీయం వేరు, హరీశ్ రావు రాజకీయం వేరు’ అని అన్నారు. హరీశ్ రావు, తాను జిల్లాల రాజకీయం చేస్తామని చెప్పుకొచ్చారు. మొన్నటివరకు కవిత.. తాజాగా అధికార పార్టీలోని కీలక నేతల వ్యాఖ్యల నేపథ్యంలో హరీశ్ రావుతో కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలని కొందరు విమర్శలు చేస్తుండగా.. మరోవైపు ఇవన్నీ ప్రజలను డైవర్ట్ చేసే రాజకీయాలేనని.. కాంగ్రెస్ అడుగు జాడల్లో కల్వకుంట్ల కవిత నడుస్తున్నారని బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.

 

 

 

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×