E-Paper
Advertisement

CM Nitish Kumar: హిజాబ్‌ వ్యవహారం.. చిక్కుల్లో సీఎం నితీష్‌కుమార్, ఏకేస్తున్న విపక్షాలు

CM Nitish Kumar: హిజాబ్‌ వ్యవహారం.. చిక్కుల్లో సీఎం నితీష్‌కుమార్,  ఏకేస్తున్న విపక్షాలు
Advertisement

CM Nitish Kumar: ఐదోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత బీహార్ సీఎం నితీష్‌కుమార్ వార్తల్లోకి వచ్చేశారు. ఆయనపై విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఆయనకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ సీఎం నితీష్ కుమార్ ఏం చేశారు? ఎందుకు విపక్షాలు మండిపడుతున్నాయి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

చిక్కుల్లో సీఎం నితీష్‌కుమార్

Advertisement

బీహార్ ముఖ్యమంత్రి ఐదోసారి పగ్గాలు చేపట్టారు సీఎం నితీష్‌కుమార్. ఎప్పుడూ ఊహించని విధంగా భారీగా సీట్లు గెలుచుకుంది ఎన్డీయే.  ఇటీవల మంత్రి వర్గం కొలువు దీరడం,  ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై దృష్టి సారించింది ఎన్డీయే సర్కార్. ఈ క్రమంలో బీహార్‌ సీఎం నితీష్‌కుమార్ వివాదంలో చిక్కుకున్నారు.

సోమవారం పట్నాలో జరిగిన ఈవెంట్‌ అది.  కొత్తగా నియమితులైన డాక్టర్లకు ముఖ్యమంత్రి తన చేతుల మీదుగా ఉద్యోగ పత్రాలు అందజేస్తున్నారు.  ఓ యువ వైద్యురాలికి జాబ్ పత్రం అందజేశారు.  యువతికి నియామక లేఖ చేతికిచ్చిన సీఎం నితీష్..  డాక్టర్‌ ముఖంపై ఉన్న హిజాబ్‌ను కొంతమేర తొలగించే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి చర్యకు సదరు యువతి స్పందించలేదు.

Advertisement

హిజాబ్‌ వ్యవహారంపై మండిపడుతున్న విపక్షాలు

కాకపోతే అలా చూస్తూ నిశ్చేష్టురాలై ఉండిపోయింది. స్టేజీపై ఉన్న కొందరు నేతలు, అధికారులు నవ్వుతూ కనిపించారు. డిప్యూటీ సీఎం సామ్రాట్‌ చౌధరి.. ఆ సమయంలో సీఎంని ఆపే ప్రయత్నం చేయడం కనిపించింది. ఈ సన్నివేశాన్ని అక్కడే ఉన్న మీడియా కెమెరాలు బంధించాయి. ప్రస్తుతం దానికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఈ వ్యవహారంపై విపక్ష కాంగ్రెస్, ఆర్జేడీ, కమ్యూనిస్టులు ఎదురుదాడి మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి మానసిక చర్యను తెలియజేస్తోందంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. నితీష్‌కు పూర్తిగా మతి భ్రమించి నట్లు ఉందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. తక్షణమే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశాయి.

మహిళల పట్ల సంకీర్ణ ప్రభుత్వ వైఖరి ఏంటో ఈ వ్యవహారం తెలియజేస్తోందని ఆర్జేడీ పేర్కొంది. ఎన్నికల ప్రచారం సమయంలో నితీష్‌కుమార్.. ఓ మహిళ మెడలో పూలదండ వేయడం వివాదానికి కారణమైంది. ఇప్పుడు హిజాబ్ తొలగించే ప్రయత్నం చేయడంపై మండిపడుతున్నాయి.

ALSO READ:  సోనియాగాంధీ-రాహుల్ గాంధీలకు భారీ ఊరట, ఈడీకి షాకిచ్చిన ఢిల్లీ కోర్టు

కాంగ్రెస్ ఎంపీ సుఖ్‌దేవ్ భగత్ ఈ సంఘటనను ఖండించారు. ముఖ్యమంత్రి సంప్రదాయాలు, విశ్వాసాలను ఉల్లంఘించారని ఆరోపించారు. ఏ కోణం నుండి చూసినా సముచితంగా అనిపించదని, ఓ మహిళ పట్ల ఇలా ప్రవర్తించడం ఖండించదగినదన్నారు. అటు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ చర్యను తప్పుబట్టారు. వయోజన మహిళను బహిరంగంగా అవమానించడానికి తప్పుబట్టారు.

ముఖ్యమంత్రి కార్యాలయం సమాచారం మేరకు.. కొత్తగా ఉద్యోగాల్లో నియమితులైన వారిలో 685 మంది ఆయుర్వేద, 393 మంది హోమియోపతి, 205 మంది యునాని వైద్యులు ఉన్నారు. వారిలో 10 మందికి  నియామక లేఖలను సీఎం నితీష్ తన చేతులతో స్వయంగా అందజేశారు. మిగిలిన‌వారు ఆన్‌లైన్ ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్ లేఖలు అందుకున్నారు.

 

Related News

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×