E-Paper
Advertisement

కవిత‌కు ఎన్నికల సంఘం షాక్.. ఆపై పార్టీ పేరు మార్పు, ఈసీ గ్రీన్ సిగ్నల్

కవిత‌కు ఎన్నికల సంఘం షాక్.. ఆపై పార్టీ పేరు మార్పు,  ఈసీ గ్రీన్ సిగ్నల్
Advertisement

Telangana Politics: తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవితకు ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఆమె కొత్త రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసింది. కాకపోతే పేరుని మార్చింది. తెలంగాణ రక్షణ సేన పార్టీగా పేరును ఖరారు చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు లేఖను కవిత‌కు అందజేశారు.

కవిత‌కు ఎన్నికల సంఘం షాక్.. ఆపై పార్టీ పేరు మార్పు

Advertisement

ఏప్రిల్ 25న మేడ్చల్ జిల్లా బహిరంగ సభలో తెలంగాణ జాగృతి చీఫ్ క‌విత‌ కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. సభలో పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా పార్టీ పేరు వెల్లడించారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఆ పేరుకు బదులుగా మరొక పేరు ఖరారు చేసింది. తెలంగాణ రక్షణ సేన పేరుకు ఆమోదముద్ర వేసింది.

ఆ పేరును కవిత పార్టీకి కేటాయిస్తున్నట్లు ఎన్నికల సంఘం లేఖ పంపింది. దీంతో కవిత పార్టీకి సంబంధించి కీలక ఘట్టం పూర్తయింది. ఇకపై కవిత తన రాజకీయ కార్యకలాపాలను తెలంగాణ రక్షణ సేన పేరుతో ప్రజల్లోకి వెళ్లనున్నారు. తెలుగు పేరులో చిన్న మార్పులు చేసినప్పటికీ టీఆర్ఎస్‌గా పిలుచుకునే అవకాశం కల్పించింది.

Advertisement

తెలంగాణ రక్షణ సేనగా ఖరారు చేసిన ఈసీ

తెలంగాణ ప్రజల ప్రయోజనాలను రక్షించడమే లక్ష్యంగా ఈ పేరు ఓకే చేసినట్టు ఈసీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కవిత పార్టీ ఓకే కావడంతో ప్రతీ అంశాన్ని క్షుణ్నంగా గమనిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. పార్టీ మారిందని తెలియగానే కాస్త రిలీఫ్ అయిన కీలక నేతలు, ఇంగ్లీష్ పేరు అదే కావడంతో సైలెంట్ అయ్యారు.

ఇకపై ఆమె వేసిన ప్రతీ అడుగు జాగ్రత్తగా గమనించి కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించినట్టు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.  కవిత మద్దతుదారుల వెర్షన్ మరోలా ఉంది. మా పార్టీ పేరు  టీఆర్ఎస్ అని అంటున్నారు. కాకపోతే రాష్ట్రానికి బదులు రక్షణ పేరు మార్చారని అంటున్నారు. మరోవైపు పార్టీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు కవిత. తెలంగాణ రక్షణ సేన కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలపడం సంతోషిస్తున్నామని రాసుకొచ్చారు.

ALSO READ: రైతు రుణమాఫీపై హైకోర్టుకు హరీశ్ రావు.. ధర్మాసనం సంచలన ఆదేశాలు

 

Related News

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

ఆమె మా బోధన్ కోడలు.. కవిత పై మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో ఓటర్ల వెరిఫికేషన్.. నోటీసులిచ్చినా దక్కని స్పందన!

Big Stories

Advertisement
×