E-Paper
Advertisement

అప్పుడే ప్రశాంతమైన జీవితం గడుపుతా… సంచలనంగా మారిన త్రిష పోస్ట్..

అప్పుడే ప్రశాంతమైన జీవితం గడుపుతా… సంచలనంగా మారిన త్రిష పోస్ట్..
Advertisement

Actress Trisha: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో త్రిష (Trisha) ఒకరు. ప్రస్తుతం త్రిష వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా త్రిష ఎలాంటి చిన్న పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈమె సినిమాల షూటింగ్ విషయంలో ఎదుర్కొంటున్నటువంటి ఒత్తిడి గురించి ఇంస్టాగ్రామ్ వేదికగా సరదాగా ఒక పోస్ట్ చేశారు.

రికవరీ అవ్వడానికి నాలుగు గంటలు..

ఈ నేపథ్యంలోనే త్రిష తన ఇంస్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ.. తాను రోజులో ఒక గంట నిద్రను కోల్పోతే ఆ నిద్ర నుంచి తాను రికవరీ అవ్వడానికి సుమారు నాలుగు రోజుల సమయం పడుతుందని తెలిపారు. ఈ ప్రకారం లెక్కలు వేస్తే కనుక 2062 సంవత్సరంలోనే నేను ప్రశాంతంగా జీవిస్తాననే భావన కలుగుతుంది అంటూ త్రిష చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. త్రిష ఈ పోస్ట్ చేయడంతో అభిమానులు, నెటిజన్స్ ఎన్నో రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

త్రిష ఒత్తిడికి గురవుతున్నారా?

Advertisement

త్రిష ఈ విధమైనటువంటి పోస్ట్ చేయడం వెనుక గల కారణం ఏంటి? ఏదైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? లేదంటే షూటింగ్స్ లో ఒత్తిడికి గురవుతూ నిద్రలేమి సమస్య కారణంగా బాధపడుతున్నారా? అంటూ ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో త్రిష తన సినిమాల కంటే కూడా వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నటుడు విజయ్ తో ఉన్న రిలేషన్ గురించి వార్తలు రావడంతో ఈమె తరచూ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇక త్రిష కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం తమిళ సినిమాలతో పాటు తెలుగు సినిమాలలో కూడా నటిస్తూ ఎంత బిజీగా గడుపుతున్నారు.

విడుదలకు సిద్ధమైన కరుప్పు..

Advertisement

తమిళంలో త్రిష నటుడు సూర్య(Suriya)తో జంటగా కరుప్పు(Karuppu) అనే సినిమాలో నటించారు. ఈ సినిమా మే 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా వీరభద్రుడు అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం త్రిష ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు తెలుగులో చిరంజీవి (Chiranjeevi)హీరోగా వశిష్ట దర్శకత్వంలో జరిగే విశ్వంభర(Vishwambhara) సినిమాలో కూడా నటించడం సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.

Also Read: వెనక్కి తగ్గిన సమంత మా ఇంటి బంగారం..అదే కారణమా? పెద్దితో పోటీ పడబోతుందా?

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×