E-Paper
Advertisement

BJP : ఆ మాజీ మంత్రికి ఈటల బుజ్జగింపులు.. బీజేపీలో ఏం జరుగుతోంది..?

BJP : ఆ మాజీ మంత్రికి ఈటల బుజ్జగింపులు.. బీజేపీలో ఏం జరుగుతోంది..?
Advertisement

Telangana BJP news today(TS politics) : ఆయన మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు. బీజేపీలో చేరి రెండున్నర ఏళ్లు అయ్యింది. కానీ ఇప్పటి వరకు ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు. పార్టీలో ప్రాధాన్యం అంతంత మాత్రమే. తాజాగా వరంగల్ లో జరిగిన మోదీ సభలో పాల్గొనేందుకు కనీసం పాస్ కూడా ఆయనకు రాలేదు. ఇది కాషాయ పార్టీలో మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్ పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది.

ఎ.చంద్రశేఖర్‌ బీజేపీకి గుడ్ బై చెబుతారన్న వార్త తెలియగానే ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ రంగంలోకి దిగారు. ఎ.చంద్రశేఖర్ నివాసానికి వెళ్లారు. ఆయనతో చాలాసేపు చర్చలు జరిపారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చంద్రేశేఖర్ కు సూచించారు.

Advertisement

బీజేపీలో తనకు ఎదురైన ఇబ్బందులను చంద్రశేఖర్ కూడా చెప్పుకున్నారని తెలుస్తోంది. పార్టీలో చేరి రెండున్నర ఏళ్లు దాటినా ఇప్పటికీ తన ఎలాంటి పదవి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం.

చంద్రశేఖర్, తాను తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేశామని ఈటల తెలిపారు. తమకు ఉమ్మడి ఎజెండా ఉందని వివరించారు. కేసీఆర్‌ను గద్దె దించడం కోసం కలిసి పనిచేస్తామని ఈటల స్పష్టం చేశారు. వరంగల్ రీజియన్ వరకే ప్రధాని మోదీ మీటింగ్‌ జరిగిందన్నారు. అందువల్లే ఎ. చంద్రశేఖర్‌కు పాస్‌ రాలేదని వివరణ ఇచ్చారు.

Advertisement

పార్టీ బలోపేతంపైనే ఈటల తాను చర్చించామని చంద్రశేఖర్ చెప్పారు. పార్టీ బలపడాలంటే ఏం చేయాలో చెప్పానన్నారు. మొత్తంమీద అలకబూనిన చంద్రశేఖర్ ను బుజ్జగించేందుకు ఈటల ప్రయత్నించారు.

Related News

సెక్రటేరియట్ భద్రత అధికారులకు మంత్రి మాస్ వార్నింగ్.. మళ్లీ రిపీట్ కావొద్దంటూ ఫైర్!

ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులకు.. తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్..!

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై కేటీఆర్ విసుర్లు, జెన్ జీ పేరు ప్రస్తావిస్తూ, ట్రోల్ చేయకుండా

తెలంగాణలో 1000 రోజుల పాలన.. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ పోస్ట్, ప్రయాణంలో తోడుగా నిలిచిన..

తెలంగాణ రాజకీయాల్లో డిజిటల్ వార్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐ పోస్టర్లు, ఇవే రాజకీయాలంటూ ప్రజల చర్చ

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

Big Stories

Advertisement
×