E-Paper
Advertisement

Hyderabad: కేబీఆర్ పార్క్ బయట అగ్నిప్రమాదం.. షాకైన వాకర్స్, ఏం జరిగింది?

Hyderabad: కేబీఆర్ పార్క్ బయట అగ్నిప్రమాదం.. షాకైన వాకర్స్, ఏం జరిగింది?
Advertisement

Hyderabad: హైదరాబాద్ సిటీ నడిబొడ్డున ఉన్న కేబీఆర్ పార్క్ బయట భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పార్క్ ఆవరణలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ రోడ్డు మీదుగా వెళ్తున్న వాహనదారులు, వాకర్స్ ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటన గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు.

కేబీఆర్ పార్క్ బయట అగ్నిప్రమాదం

Advertisement

చివరకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అటు వైపు వెళ్తున్న కొందరు మంటలను తమ ఫోన్ షూట్ చేసి సోషల్‌మీడియాలో సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేశారు. వీటికి సంబంధించి ద‌ృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్‌లోని కెబిఆర్ పార్క్ వాక్ వే వద్ద శనివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. జీహెచ్‌ఎంసీ కార్మికులు చెత్త ఊడ్చి చోట చేర్చిన ఎండుటాకుల కుప్పకు మంటలు అంటుకున్నాయి. రాత్రి వేళ ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతం మీదుగా వెళ్తున్న ప్రజలు, వాకర్స్ షాకయ్యారు. వెంటనే అక్కడున్న తోటమాలిని అప్రమత్తం చేశారు.

Advertisement

సకాలంలో స్పందించడంతో తప్పిన ముప్పు

మంటలు పార్క్ లోపలికి వ్యాపించక ముందే వాటిని అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. కేబిఆర్ పార్క్ చుట్టూ కారిడార్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి పని చేసేవారు చెత్తపై సిగరెట్టు కాల్చి వేశారా? అనే అనుమానాలు లేకపోలేదు. ఇటీవల కేబిఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అంతలో పార్కు బయట అగ్నిప్రమాదం జరగడం అనేక అనుమానాలు లేకపోలేదు.

 

 

Related News

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. చివరి తేది..?

రాజ్యాంగానికి తీవ్ర ముప్పు..13 కోట్ల ఓట్లు మాయం.. కేంద్రంపై విరుచుకుపడ్డ మధుయాష్కి!

‘కేసీఆర్ ఫామ్ హౌస్ నీళ్లను రైతులకు ఇస్తాం’.. ఎంపీ చామల సంచలన హామీ!

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

Big Stories

Advertisement
×