BigTV English

GHMC Employee Harassment: కామాంధకారి.. మాట వినకపోతే జాబ్ పోతుందని బెదిరించి.. లైంగిక వేధింపులు..!

GHMC Employee Harassment: కామాంధకారి.. మాట వినకపోతే జాబ్ పోతుందని బెదిరించి.. లైంగిక వేధింపులు..!

GHMC Employee Physically Harassed Woman Worker: అతనొక GHMC ఉద్యోగి. తన కింద పనిచేసే కార్మికురాలిపై కన్ను వేశాడు. ఎలాగైనా ఆమెను శారీరకంగా అనుభవించాలని అనుకున్నాడు. అంతే కాదు.. ఆ దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించుకుని.. కావలసినప్పుడల్లా చూసుకోవాలని అనుకున్నాడు. కానీ ఆ వీడియోలే అతని పాపం పండేలా చేశాయి. ఆమెతో బలవంతంగా చేస్తున్న రాసలీలల వీడియో ఒకటి బయటకు వచ్చింది.


కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం 25 సర్కిల్ పరిధిలో GHMC పరిధిలో SFAగా విధులు నిర్వహిస్తున్న కిషన్ అనే అధికారి.. తన కింద పనిచేసే ఓ కార్మికుకురాలిని బలవంతం చేశాడు. తాను చెప్పినట్లు వినాలని.. లేదంటే విధి నిర్వహణలో ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టాడు. అధికారి వేధింపులకు తాళలేక ఎవరికి చెప్పలేక ఆ బాధితురాలు నరకయాతన అనుభవిస్తోంది. చివరకు అతని చెరలో పడక తప్పలేదు. రోజూ పనికి వచ్చిన ఆమెను గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వాడుకోవటం మొదలుపెట్టిన ఆ అధికారి.. ఈ తతంగాన్ని ఫోన్‌లో రికార్డు చేసి.. నేత్రానందం పొందుతున్నాడు. అవి బయటకు రావటంతో కిషన్ రాసలీలలు బయటపడ్డాయి.

పాపం పండిందో లేక అతని నిర్లక్ష్యం వల్లో కానీ.. తన ఫోన్‌లో ఉన్న సెక్స్‌ వీడియోలు.. తోటికార్మికుల చేతుల్లోకి వెళ్లాయి. వాటిని చూసి వారంతా అవాక్కయ్యారు. ఇదేంటి సార్ అని ప్రశ్నించటంతో.. ఎవరికీ చెప్పకండి అంటూ ఒక్కొక్కరికీ 10 వేలు చొప్పున 14 మందికి డబ్బులు కూడా సమర్పించుకున్నాడు. పారిశుధ్య కార్మికురాలిపై ఇంత దారుణం జరుగుతున్నా.. ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహిళా ఉన్నతాధికారులు ఉన్న చోట కూడా మహిళా కార్మికులకు రక్షణ లేకపోవటం ఏమిటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.


Also Read: Srikalahasti Politics: బొజ్జల హవా వైసీపీకి ఎదురు దెబ్బ?

Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×