E-Paper
Advertisement

స‌వాల్ విస‌ర‌నేలా.. మాదే గెలుప‌ని దొంగ‌ స‌ర్వేలతో చంక‌లు గుద్దుకోనేలా?

స‌వాల్ విస‌ర‌నేలా.. మాదే గెలుప‌ని దొంగ‌ స‌ర్వేలతో చంక‌లు గుద్దుకోనేలా?
Advertisement

క‌విత ఎన్నో సార్లు స‌వాలు విస‌రింది హ‌రీశ్‌పై. తుక్కు తుక్కుగా తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిడుతూనే ఉన్న‌ది రోజు. సిద్దిపేట నుంచి పోటీ చేస్తాన‌ని ప‌లుమార్లు ప్ర‌క‌టించింది కూడా. గుంట‌న‌క్క కాస్కో అని నేరుగా డేర్‌గానే తిట్ల దండ‌కం అందుకున్నా.. హ‌రీశుడు ఆయ‌న టీము కిమ్మ‌న‌లేదు ఇప్ప‌టి వ‌ర‌కు. తేలు కుట్టిన దొంగ‌ల్లా గ‌ప్‌చుప్‌గానే ఉన్నారు. క‌విత‌కు కౌంట‌ర్‌గా ప‌ల్లెత్తు మాట అన‌డానికి, ఆమెను తిట్ట‌డానికి జంకుతున్నారు. కానీ తాజాగా హ‌రీశుడు కొత్త జ‌పం అందుకున్నాడు.

సీఎం రేవంత్‌రెడ్డిని సిద్దిపేట నుంచి పోటీ చేస్తావా..? రా …! ద‌మ్ముందే అని అసంద‌ర్భ ప్రేలాప‌నొక‌టి అందుకున్నాడు. పనిలో ప‌నిగా త‌న‌కు ఇప్ప‌టి వ‌ర‌కు జ‌నం ఇచ్చిన మెజారిటీని కూడా త‌నే గుర్తు చేసుకున్నాడు కూడా. ఇప్ప‌డ‌ది జ‌నానికీ అవ‌స‌రం లేదు. హ‌రీశ్ స‌వాలుకూ అర్థం లేదు. కానీ ఇంకా దీన్ని హైప్ చేసేక్ర‌మంలో గుమ్మ‌డికాయ దొంగ‌ల్లా … ఇద్ద‌రు పోటీ చేస్తే ఎవ‌రు గెలుస్తారు.. ఎవ‌రు ఓడుతారు అనే ఓ ఫేక్ స‌ర్వేను కూడా ఒక‌టి ర‌న్ చేస్తున్నారు హ‌రీశ్ సోష‌ల్ మీడియా. ఆ స‌ర్వేలో తామె గెలిచిన‌ట్టు త‌మ‌కు తామే స‌ర్టిఫికెట్ ఇచ్చుకుని త‌మ జ‌బ్బ‌లు తామే చ‌రుచుకుని… గుమ్మ‌డి కాయ దొంగ‌ల్లా భుజాలు కూడా త‌డుముకొని చంక‌లు గుద్దుకుంటున్నారు.

Advertisement

ఇప్పుడు ఈ పోటీ గోల మాకెందుక‌ని ఆ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లే విస్తుపోయేలా చేసుకుంటున్నారు. క‌విత .. హ‌రీశ్‌రావుపై చేసిన ఆరోప‌ణ‌ల‌కు స‌మాధానాల్లేవు… గుంట‌న‌క్క అని ఎడాపెడా తిట్టి.. కేసీఆర్ ద‌గ్గ‌ర‌ నెంబ‌ర్ వ‌న్ దెయ్యం నువ్వేన‌ని కితాబునిచ్చినా కుయ్యులేదు.. క‌య్యులేదు. సిద్దిపేట నుంచి పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించినా.. రా చూసుకుందామ‌నే ద‌మ్ము తెగువా లేదు.. కానీ ఉట్టికెక్క‌లేన‌మ్మా.. స్వ‌ర్గానికి ఎగిరింద‌న్న‌ట్టు.. రేవంత్‌రెడ్డిని సిద్దిపేట‌కు ర‌మ్మంటున్నాడీ హ‌రీశుడు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×