E-Paper
Advertisement

కాశ్మీర్‌ను తలపించేలా.. హైదరాబాద్ శివార్లలో రోడ్లపై మంచు, ఎంజాయ్ చేసిన ప్రజలు

కాశ్మీర్‌ను తలపించేలా.. హైదరాబాద్ శివార్లలో రోడ్లపై మంచు, ఎంజాయ్ చేసిన ప్రజలు
Advertisement

Hyderabad:  ఎండాకాలంలో మంచు వర్షం పడితే ఆ ప్రాంతాల ప్రజలు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. అలాంటి సన్నివేశాన్ని అస్సలు ఊహించలేము. ‌తాజాగా కాశ్మీర్‌ను మరపించేలా హైదరాబాద్ శివారులోని రోడ్లపై మంచు దర్శనమిస్తోంది. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా, ముమ్మాటికీ నిజం. అసలు మేటరేంటి?

కాశ్మీర్‌ను తలపించేలా.. హైదరాబాద్ శివార్లలో రోడ్లపై మంచు

Advertisement

వేసవికాలం వచ్చిందంటే ఎక్కువగా వడగళ్ల వాన బీభత్సం చేస్తుంది. ఎవరూ ఊహించని విధంగా ఆ రేంజ్‌లో వర్షం పడుతుంది. అసలే వేడితో అల్లాడుతున్న ప్రజలకు అలాంటి వర్షం కాస్త ఉపశమనమే. కాకపోతే రోడ్లపై భారీ ఎత్తున వడగళ్లు పడితే హిమాలయాలను తలపిస్తోంది. సోమవారం రాత్రి హైదరాబాద్ శివారులో అదే జరిగింది.

సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వడగళ్ల వర్షం పడింది. శంషాబాద్-నాదర్‌గుల్ మధ్య ఓఆర్ఆర్ మార్గం వడగళ్లతో నిండిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ సన్నివేశం కాశ్మీర్‌ను తలపించింది.

Advertisement

పుల్‌గా ఎంజాయ్ చేసిన ప్రజలు, వాహనదారులు

మంచు కురిసిన భ్రమ అక్కడి ప్రజలకు కలిగింది. ఈ అరుదైన దృశ్యాలను నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హైదరాబాద్ హిమాలయాలు అంటూ చిన్న క్యాప్షన్ పెట్టారు. వీటికి సంబంధించి దృశ్యాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. రోడ్లన్నీ తెల్లటి మంచు ముక్కలతో నిండిపోయింది.

ఆ సన్నివేశాన్ని వాహనదారులు ఓ వైపు ఆనందం వ్యక్తం చేస్తూనే మరోవైపు విస్మయానికి గురయ్యారు. ఆ ప్రాంతంలో స్థానికులు ఫోటోలు దిగుతూ చిల్ అవుతున్నారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసి రీల్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ వీడియోపై ఓ లుక్కేద్దాం.

ALSO READ: కాళేశ్వరంపై సీబీఐ విచారణకు రంగం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

 

Related News

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

Big Stories

Advertisement
×