E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode April 28th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచనకు నిజం చెప్పబోయిన కార్తీక్  

Karthika Deepam 2 Serial Today Episode April 28th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచనకు నిజం చెప్పబోయిన కార్తీక్  
Advertisement

Karthika Deepam 2  serial today Episode: కార్తీక్‌, దీప ఇద్దరూ కలిసి కాంచన వద్దన్నా శివనారాయణ ఇంటికి వెళ్లిపోతారు. దీంతో కాంచన కోపంగా శ్రీధర్‌తో వాళ్ల ఇద్దరి గురించి బాధపడుతుంది. దీప మీద తనకు అనుమానంగా ఉందని ఆగ్రిమెంట్ కాకుండా ఇంకా ఏదో ఉందని చెప్పగానే.. శ్రీధర్‌ షాక్‌ అవుతాడు. అయితే ఓకే నేను వెళ్లి వస్తాను అని చెప్పగానే.. మీరు ఈ మధ్య ఎందుకో కొంచెం నీరసంగా కనిపిస్తున్నారు. ముందు వెళ్లి డాక్టర్‌ను కలవండి అని చెప్తుంది. శ్రీధర్‌ సరే వెళ్తాను అంటూ వెళ్లిపోతాడు. కాంచన మాత్రం మీలాగే మీ కొడుకు కూడా మొండోడు అసలు ఏం చేస్తున్నాడో ఏంటో అనుకుంటూ కోప్పడుతుంది.

మరోవైపు పంతులు జ్యోత్స్న జాతకం పరిశీలన చేస్తుంటాడు. శివనారాయణ ఏం పంతులు గారు జాతకం చెప్పమంటే అలాగే చూస్తుండిపోయారేంటి..? జాతకంలో ఏమైనా పెద్ద పెద్ద దోషాలు ఉన్నాయా ఏంటి..? అని అడగ్గానే.. లేదండి ఈ జాతకం ప్రకారం అమ్మాయికి ఈపాటికే పెళ్లి అయిపోయింది అని చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో పారిజాతం అయ్యో అది జ్యోత్స్న జాతకం కాదు నాది అని చెప్పగానే.. శివనారాయణ కోపంగా తిడతాడు. నీ జాతకం ఎందుకు ఇచ్చావు అని అడగ్గానే.. లేదు పంతులు గారు ఎలా చెప్తారో పరీక్షిద్దామని ఇచ్చాను అంటాడు. అంటూ జ్యోత్స్న జాతకం ఇది అంటూ ఇంకో పేపర్‌ ఇస్తుంది. ఆ జాతకం చూసిన పంతులు.. ఈవిడకు ఒక నెల రోజుల్లో పెళ్లి అవుతుంది. నెల రోజుల్ల ఈవిడకు పెళ్లి జరగకపోతే జీవితాంతం కుమారిగానే మిగిలిపోతుంది అని చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు.

Advertisement

జ్యోత్స్న మాత్రం నెల రోజుల్లో పెళ్లి అవుతుంది అంటారు అని అడగ్గానే.. పంతులు అవునమ్మా అంటాడు. అయితే ఆ పెళ్లి బావతోనే జరుగుతుంది అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. పారిజాతం కూడా నీ బుద్ది నాకు తెలుసే.. అడ్డుకోవడానికి నేను రెడీగా ఉంటాను కదా..? అనుకుంటూ.. పంతులు గారు కాస్త ఈ జాతకం కూడా చూడండి అంటూ ఇంకో పేపరు ఇస్తుంది. పంతులు పేపరు తీసుకుంటూ మళ్లీ ఈ జాతకం ఎవరిది అమ్మ అని అడగ్గానే.. పారిజాతం నా మనవడు కార్తీక్‌ ది అని చెప్తుంది. దీంతో జ్యోత్స్న నీది ఎంత ముందు జాగ్రత్త గ్రానీ ఎక్కడ నేను బావకు పెళ్లాన్ని అయిపోతానని బావ జాతకం చూపిస్తున్నావా.. అని మనసులో అనుకుంటుంది.

దశరథ ఇప్పుడు కార్తీక్‌ జాతకం ఇప్పుడు చూడటం ఎందుకు అని అడగ్గానే.. దీప కూడా చూడనివ్వండి చిన్న అయ్యగారు.. ఎలా ఉందో తెలుస్తుంది కదా అనగానే.. దీపకు కూడా అనుమానం వచ్చినట్టు ఉంది అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. ఇంతలో పంతులు కార్తీక్‌ గురించి చెప్తుంటే.. అందరూ ఎమోషనల్‌ అవుతుంటారు. పారిజాతం కూడా ఎమోషనల్ అవుతుంది. ఇంతలో జ్యోత్స్న, కార్తీక్‌కు ఒక పెళ్లి యోగమా..? లేక రెండు పెళ్లిళ్లు ఉన్నాయా  అని అడగ్గానే.. పారిజాతం తిడుతుంది. అవన్నీ నీకు ఎందుకు అనగానే.. జ్యోత్స్న లోపలికి వెళ్లిపోతుంది.

Advertisement

తర్వాత ఇంటికి వచ్చిన కార్తీక్‌, దీపలతో కాంచన ఎమోషనల్‌ అవుతుంది. భగవంతుడు ఇచ్చిన కొన్ని బంధాలు ఎప్పటికీ మనతోనే ఉండాలని కోరుకోవడం తప్పా అంటూ అడగ్గానే.. ఒక కన్నతల్లిలా నీకా హక్కు ఉంది అమ్మ అని చెప్పగానే.. అయితే నిజం చెప్తావా.. అని కాంచన అడగ్గానే… అడగమ్మా ఏంటో చెప్తాను అంటాడు కార్తీక్‌. అయితే దీపకు నీకు జ్యోత్స్నకు మధ్య మాకు తెలియంది ఏదో జరుగుతుంది ఏంటది చెప్పరా అని కాంచన అడగ్గానే.. దీప, కార్తీక్‌ షాక్‌ అవుతారు.

కార్తీక్‌ అమ్మకు అనుమానం వచ్చింది అని మనసులో అనుకుంటాడు. కాంచన మాత్రం చెప్పరా..? నాకు ప్రేమించే హక్కు ప్రశ్నించే హక్కు ఉందన్నావుగా చెప్పరా.. అగ్రిమెంట్‌ కు దీపకు ఏంటి సంబంధం అని అడగుగుతుంది కాంచన. దీంతో కార్తీక్‌ బుల్లెట్‌ కన్నా గట్టిగా తగులుతున్నాయి అమ్మ నీ మాటలు అంటాడు. దీంతో కాంచన గట్టిగా అడగ్గానే.. తన కారణంగా విడిపోయిన ఈ రెండు కుటుంబాలను కలపాలని దీప ఆరాటపడుతుంది. అందుకే ఇదంతా కొద్ది రోజులు ఒపిక పట్టమ్మా… నువ్వు అనుకున్నవన్ని జరుగుతాయి అంటూ చెప్పి వెళ్లిపోతారు.

మరోవైపు జ్యోత్స్న కోపంగా ఆలోచిస్తూ.. కార్తీక్‌, దీప చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. పంతులు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. ఇంతలో వాళ్ల ఫ్రెండ్‌ ఫోన్ చేస్తే తాను నెల రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్తుంది. ఇంతలో కార్తీకదీపం 2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆస్తుల చిట్టా బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక నెరవేర్చారా??

బిగ్ బాస్ 10 నరేష్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? వంద నుంచి లక్షల వరకూ!

దివి పెళ్లి ఆగిపోయిందా? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

Big Stories

Advertisement
×