E-Paper
Advertisement

Ganja Gang Attack: హైదరాబాద్ శివార్లలో రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్.. మార్నింగ్ వాకర్స్‌పై దాడి

Ganja Gang Attack: హైదరాబాద్ శివార్లలో రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్.. మార్నింగ్ వాకర్స్‌పై దాడి
Advertisement

Ganja Gang Attack: హైదరాబాద్ శివారులో గంజాయ్ గ్యాంగ్ రెచ్చిపోతోంది. తాగిన మత్తులో విధ్వంసానికి పాల్పడుతోంది. లేటెస్ట్‌గా రాజేంద్రనగర్ ప్రాంతంలో అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

ఎర్రబోడ ప్రాంతంలో వాకింగ్ చేసి ఇంటికి వస్తున్న వారిపై దాడికి పాల్పడింది. కర్రలతో దాడి చేసింది గంజాయి గ్యాంగ్. అడ్డు వచ్చిన వారిని చావబాదింది… పట్టరాని కోపంతో పార్కింగ్ చేసిన కారు అద్దాలు ధ్వంసం చేసింది. దీంతో షాకవ్వడం ఆ ప్రాంత వాసుల వంతైంది.

Advertisement

ఈ ప్రాంతంలో కొద్దిరోజులుగా గంజాయి జోరుగా అమ్మకాలు సాగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గంజాయి సేవించి వచ్చి పోయే వారిపై దాడికి పాల్పడుతున్నారు కొందరు పోకిరీలు. సాయంత్రం అయితే చాలు.. నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లి గంజాయి సేవిస్తున్నారు. ఈ తతంగాన్ని స్థానికులు చూసినా తమ జోలికి రాలేదని భావించారు.

ఆదివారం తెల్లవారుజామున బూతులు తిడుతూ వాకర్స్‌పై దాడికి తెగబడ్డారు ఐదుగురు సభ్యుల గల గ్యాంగ్. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు, స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఆ వ్యక్తులు ఎక్కడున్నారు? ఈ ప్రాంతంలో ఎవరైనా ఉన్నారా? అనేదానిపై ఆధారాలు సేకరించినట్టు సమాచారం.

Advertisement

ALSO READ: మాంసప్రియులకు పండుగ పూట బిగ్ షాక్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కేజీ ఎంతంటే?

గంజాయ్ బ్యాచ్‌పై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అంటున్నారు బస్తీ వాసులు. చీకటి పడితేచాలు రోడ్ల‌పై తిరగాలంటే భయం వేస్తుందని వాపోతున్నారు. గంజాయి గ్యాంగ్ ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×