BigTV English
Advertisement

Bigg Boss 8 Day 42 Promo1: దసరా సంబరాలు.. బతుకమ్మలతో చిందాడిన కంటెస్టెంట్స్..!

Bigg Boss 8 Day 42 Promo1: దసరా సంబరాలు.. బతుకమ్మలతో చిందాడిన కంటెస్టెంట్స్..!

Bigg Boss 8 Day 42 Promo1.. విజయదశమి సందర్భంగా బిగ్ బాస్ సీజన్ 8 లో సంబరాలు ఆకాశాన్నంటాయని చెప్పాలి. రంగురంగుల దుస్తులలో అద్భుతంగా, సాంప్రదాయంగా కంటెస్టెంట్స్ కనిపించారు ముఖ్యంగా లేడీ కంటెస్టెంట్స్ కలర్ఫుల్ పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి వారు పోటీపడుతూ ఇక్కడ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కామెడీ స్కిట్లు చేస్తూ.. డాన్సులు చేస్తూ.. గేమ్స్ ఆడుతూ.. దసరా పండుగను మరింత సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పవచ్చు. ఇకపోతే 42వ రోజుకు సంబంధించి విజయదశమి గ్రాండ్ సెలబ్రేషన్స్ పేరిట ఒక ప్రోమోని విడుదల చేశారు నిర్వాహకులు. ఈ ప్రోమోను ఇప్పుడు చూద్దాం.


ప్రోమో వైరల్..

ప్రోమో విషయానికొస్తే ప్రింటెడ్ కుర్తా ధరించి అసలైన పండుగను హౌస్ కి తీసుకొచ్చారు హోస్ట్ నాగార్జున. ఇక సెలబ్రిటీస్ అంతా కూడా సంబరాలలో మునిగిపోయారు. బతుకమ్మలతో చిందాడారు. అనంతరం విశ్వం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీను వైట్ల సెట్ పై సందడి చేశారు. ఇక కంటెస్టెంట్ మధ్య సరదా పోటీ అందరినీ నవ్వించింది. ఇకపోతే నాగార్జున అమ్మ అనూ అవినాష్ ఎలా ఆట ఆడుతున్నాడు అని చెప్పగానే.. ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. ఎందుకు సైలెంట్ అయ్యావ్ .. నోట్లో గులాబ్ జామ్ ఉందా..ఏదైనా మాట్లాడు.. ఏమైంది అవినాష్ అని నాగార్జున అడగగానే.. అను అనగానే అను వచ్చిందా అని ఆశ్చర్యపోయాను సార్ అంటూ అవినాష్ చెప్పగా.. పక్కనుండి నయని పావని భయమేసింది సార్ అంటూ కామెంట్లు చేసింది. ఆ తర్వాత నయని పావని మాట్లాడుతూ.. అనుతో ఉండే ఫోటో ఎప్పుడూ మూసి ఉంది సార్ అంటూ కామెంట్ చేసింది. దానితో అవినాష్ మాట్లాడుతూ.. అమ్మాయిలు దగ్గరకు రాగానే అను తో ఉన్న ఫోటోని కింద పెట్టేస్తున్నాను. ఆ తర్వాత అమ్మాయిలతో ఎటువంటి రిలేషన్ పెట్టుకోకుండా మళ్లీ ఫోటోని పైకి పెడుతున్నాను అంటూ కామెంట్ చేశారు. అంతేకాదు తన భార్య తనను ఏమైనా అనుకుంటుందేమో అని అను నేను ఎవరితో ఎలాంటి రిలేషన్ లో లేను అని చెప్పి అందరిని సరదాగా నవ్వించారు ముక్కు అవినాష్.


డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన బ్యూటీస్..

ఇక తర్వాత ఫరియా అబ్దుల్లా క్యాచ్ మీ అంటూ తన పర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది. అక్కడ పెట్టిన కుండలను ఉద్దేశించి.. ఏ క్లాన్ లో ఎవరు గెలిస్తే.. ఆపోజిట్ వాళ్ళ క్లాన్ కి వెళ్లి వారి కుండలను పగలగొట్టాలి అంటూ కామెంట్ చేశారు నాగార్జున. ఆ తర్వాత స్పూన్ లో లడ్డు పెట్టుకొని వెళ్తూ ఆపోజిట్ లో ఉన్నవారికి తినిపించే టాస్క్ పెట్టారు నాగార్జున. రాయల్, ఓజీ నుంచి ఎవరెవరు వస్తున్నారు అని అడగ్గా విష్ణు ప్రియ మాట్లాడుతూ.. ఇద్దరి ముగ్గులు గొడవ పడుతున్నాయి అంటూ తన ముక్కు అవినాష్ ముక్కు, తన ముక్కు కలిపి చెప్పింది. నీతో ఏమనాలో తెలియట్లేదు అంటూ నాగార్జున నవ్వేశారు. మంగ్లీ తన పాటతో అందరినీ అలరించి హౌస్ లోకి వెళ్లి కంటెస్టెంట్స్ తో బతుకమ్మ లో ఆడి పాడింది. ఆ తర్వాత డింపుల్ హయతి పెర్ఫార్మెన్స్ అన్నీ కూడా ప్రోమోకి కొత్త హంగులు తీసుకొచ్చాయి. మొత్తానికైతే ఈ ప్రోమో ఇప్పుడు చాలా వైరల్ గా మారుతోంది.

Related News

Bigg Boss 9 Promo: బిగ్ బాస్ మరో టాస్క్.. మరీ అంత ఆటిట్యూడ్ ఎందుకు?

Bigg Boss 9 Telugu : హీటేక్కిస్తున్న నామినేషన్స్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమె..?

Bigg Boss : బిగ్ బాస్ షోకు బిగ్ షాక్.. బ్యాన్ చెయ్యాలంటు డిమాండ్.. ఏం జరిగిందంటే..?

Bigg Boss 9 Telugu : ఇమ్మూ ఫ్యాన్స్ కు రక్తకన్నీరు… ముద్దుబిడ్డకు అడ్డు తొలగించడానికే ఈ బిగ్ ప్లానా ?

Bigg Boss 9 : పోకిరి లెవెల్ ట్విస్ట్, దివ్య కు ఇచ్చి పడేసిన భరణి, అసలైన విలనిజం

Bigg Boss 9 Telugu Day 64 : దివ్యను దులిపేసిన రీతూ… భరణి భయ్యా ఇదస్సలు ఊహించలే… కెప్టెన్ ఇమ్మూకు క్రేజీ షాక్

Bigg Boss 9: ఈవారం నామినేషన్స్ లోకి వచ్చింది ఎవరంటే?

Bigg Boss 9 Promo : ఫుడ్‌పై ఉన్న ఫోకస్ గేమ్‌పై లేదు… గౌరవ్‌ను గజగజ వణికించారు.!

Big Stories

×