E-Paper
Advertisement

Telangana Sarpanch Election: సర్పంచ్ ఎన్నికల వేళ.. పదవి కోసం లక్షల్లో వేలం పాటలు

Telangana Sarpanch Election: సర్పంచ్ ఎన్నికల వేళ..  పదవి కోసం లక్షల్లో వేలం పాటలు
Advertisement

Telangana Sarpanch Election: ఎన్నికల వేల పలుచోట్ల వేలంపాట హల్ చల్ చేస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిబంధనలకు విరుద్దంగా వేలంపాట జరుగుతున్నాయి. సర్పంచ్ పదవుల కోసం ఉమ్మడి జిల్లాలో పలు గ్రామాలలో వేలంపాట నిర్వహించారు. అభివృద్ధి పేరుతో లక్షల్లో భేరాలు, పంట పొలాల వరకు హామీలు ఇస్తున్నారు.

జోగులాంబ గద్వాల్ జిల్లా గొర్లఖాన్ దొడ్డిగ్రామపంచాయితీ సర్పంచ్ స్థానానికి.. ఒక వ్యక్తి రూ.57 లక్షల వేలంపాట పాడి దక్కించుకున్నట్లు సమాచారం. కొండపల్లి గ్రామంలో ఆలయ అభివృద్ధికి ఎవరైనా డబ్బులు ఇస్తే ఏకగ్రీవంగా సర్పంచ్ కావొచ్చని ప్రకటన రావడంతో ఆర్గనైజర్ దాదాపు రూ. 60 లక్షలు ఇస్తానని ప్రకటించినట్లు సమాచారం.

Advertisement

ఆయన ఒక్కరే నామినేషన్ల వేసేలా కండీషన్లు పెట్టారు. అలాగే గొల్లఖాన్ దొడ్డిలో సర్పంచ్ పదవి రూ.53 లక్షలు పలికినట్లు తెలుస్తోంది. అందుపల్లి గ్రామంలో ఓ నాయకుడు రూ.23 లక్షలు ఇస్తానని ప్రకటించినట్లు సమాచారం. ఆయన ఒక్కరే నామినేషన్లు వేసేలా కండీషన్లు పెట్టారు. జాంపల్లి గ్రామంలో కూడా వేలంపాట జరిగినట్లు తెలుస్తోంది. కేతిదొడ్డి మండలం చింతలకుంట గ్రామంలో 38.50 లక్షల వేలంపాటకు పదవి దక్కింది.

Also Read: రాష్ట్రా అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ: సీఎం రేవంత్‌రెడ్డి

Advertisement

మద్దూరు మండలంలో ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తనను సర్పంచ్‌గా ఏకగ్రీవం చేస్తే.. పాఠశాల అభివృద్ధికి అరెకరం పొలం ఇస్తానంటూ రాసిచ్చిన బాండు కాగితం వైరల్ అవుతుంది. ఇక మహబూబ్ జిల్లా మర్చెల మండలంలో ఓ నాయకుడు తనకు సర్పంచ్‌గా అవకాశం ఇస్తే.. గ్రామాభివృద్ధికి లక్షలు ఇస్తానంటూ హామీ ఇచ్చారు.

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×