E-Paper
Advertisement

Jagan and Revanth: ఏపీ సీఎం ట్వీట్.. రిప్లై ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్

Jagan and Revanth: ఏపీ సీఎం ట్వీట్.. రిప్లై ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్
Advertisement
Jagan and Revanth news

Jagan and Revanth news(Today news paper telugu):

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి X వేదికగా రిప్లై ఇచ్చారు. తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తో పాటు పొరుగు రాష్ట్రాలతో స్నేహభావం ఉండాలని కోరుకుంటున్నట్లు రేవంత్ తెలిపారు. ఆయా రాష్ట్రాల అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ నూతన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయగా.. ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు.

“తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ ‌రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.” అని ఏపీ సీఎం చేసిన ట్వీట్ పై.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

Advertisement

“శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. సాటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తో పాటు, పొరుగు రాష్ట్రాలతో స్నేహభావం.. అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది.” అని రేవంత్ X లో రిప్లై ఇచ్చారు.

Tags

Related News

నగరి మున్సిపల్ పీఠం ఏకగ్రీవం.. హైకోర్టుకు వెళ్తానన్న రోజా!

చంద్రబాబుకు గెలుపుపై నమ్మకం లేదు.. అందుకే నామినేషన్ల అడ్డుకట్ట: సజ్జల

పశ్చాత్తాపపడినా వదిలిపెట్టం.. అధికారులకు చెవిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్!

ఏపీ మున్సిపల్ నామినేషన్ల వివాదంపై.. సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్!

మదనపల్లెలో హైటెన్షన్.. ఎన్నికల అధికారిపై టీడీపీ అభ్యర్థి దాడి!

బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు!

ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే ఊరుకునేది లేదు: పవన్ కల్యాణ్

దావూద్ ఇబ్రహీంకు జగన్ తేడా లేదు.. ఎమ్మెల్యేల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం-సీఎం చంద్రబాబు

Big Stories

Advertisement
×