E-Paper
Advertisement

Praja Darbar : ప్రజా దర్బార్‌ ప్రారంభం.. ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరిస్తున్న సీఎం..

Praja Darbar : ప్రజా దర్బార్‌ ప్రారంభం.. ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరిస్తున్న సీఎం..
Praja darbar telangana

Praja darbar telangana(TS news updates):

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన క్షణం నుంచే ఎన్నికల హామీలపై ఫోకస్‌ పెట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ మేరకు హామీలలో భాగమైన ప్రజా దర్బార్‌ను ప్రజా భవన్‌లో నిర్వహిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ వైఫల్యాలను టార్గెట్ చేసిన రేవంత్‌ ఆ దిశగానే ముందుకు సాగుతున్నారు. కేసీఆర్‌ ప్రజల గోడు వినరని.. ప్రజంటే పట్టదని విమర్శలు గుప్పించిన రేవంత్‌.. తాను ప్రజాపాలన చేసి చూపిస్తానని జనానికి భరోసా ఇచ్చారు. ఈ మేరకు ప్రగతిభవన్‌ను జ్యోతిరావ్‌పూలే ప్రజా భవన్‌గా పేరు మార్చిన ఆయన.. ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్‌ పేరుతో ప్రజా సమస్యలను స్వయంగా వినడమే కాదు.. పరిష్కార దిశగా చర్యలు తీసుకోనున్నారు. ప్రజా దర్బార్‌ నిర్వహణ సందర్భంగా నేరుగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు సీఎం రేవంత్‌. రేవంత్‌తోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ప్రజల గోడును తెలుసుకుంటున్నారు.

సీఎం హోదాలో కేసీఆర్‌ అధికారిక నివాసంగా ఉన్న ప్రగతిభవన్‌.. ఇప్పుడు ప్రజాభవన్‌గా మారింది. బీఆర్‌ఎస్‌ హాయంలో 2017 నవంబర్ 23 నుంచి 2023 డిసెంబర్ 3 వరకూ ఇక్కడి నుంచే పాలన సాగించారు కేసీఆర్‌. అయితే,.. ఆయన ఉన్న సమయంలో ప్రగతి భవన్‌కి భారీ ఉక్కు కంచెను ఏర్పాటు చేయించారు. దాంతో అందులోకి వెళ్లేందుకు సామాన్యులకు అనుమతి ఉండేది కాదు. ఇందుకోసం ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. అయితే,.. కేసీఆర్‌కు భిన్నంగా రేవంత్‌ ప్రగతిభవన్‌కు ప్రజా భవన్‌గా మార్చారు. ఇక నుంచి ఎవరైనా ఇక్కడి రావొచ్చని.. స్పెషల్‌గా అనుమతులేమీ అవసరం లేదన్నారు. ఇదిలా ఉంటే సీఎంగా రేవంత్ ప్రమాణస్వీకార కార్యక్రమం కొనసాగుతుండగానే ప్రగతి భవన్‌ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగిస్తూ ప్రజా పాలనను కొనసాగిస్తానంటూ సంకేతాలు పంపారు రేవంత్‌. దీంతో ఈ అంశంపై పెద్ద టాక్‌ నడిచింది.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×