E-Paper
Advertisement

Jagityal Politics: ఎంతకీ తెగని జగిత్యాల కాంగ్రెస్ రచ్చ

Jagityal Politics: ఎంతకీ తెగని జగిత్యాల కాంగ్రెస్ రచ్చ

Jagityal Politics: అవకాశం దొరికితే చాలు అల్లుకుపోవాలని ఆశగా ఎదురుచూస్తుంటాడు ఆయన. తన పనేదో తాను చేసుకుంటున్న ప్రత్యర్ధిని కవ్వించడానికి ఆ పెద్దాయన చేయని ప్రయత్నాలు లేవు. రాజకీయాల్లో తలపండిపోయిన సదరు లీడర్ సాబ్ అటు ప్రత్యర్ధిని.. ఇటు సొంత పార్టీని ఇరుకున పెడుతూ అక్కడి పాలిటిక్స్‌ను హీటెక్కిస్తున్నారు. ఆయన రాజేస్తున్న రాజకీయ వేడి ప్రభావం ఏంత..? ఇంతకీ ఆ మోస్ట్ సీనియర్ లీడర్ పాచికలు పనిచేస్తున్నాయా ..? లేదంటే బూమరాంగ్ అవుతున్నాయా..? ఇంతకీ ఎవరా లీడర్…? ఎక్కడుందా నియోజకవర్గం.. ఓసారి చూసొద్దాం పదండీ..

జగిత్యాల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంటిపోరు రోజురోజుకు బజారున పడుతుంది. ఇంటిలోని పోరు ఇంతింత కాదయా అన్నట్టుగా మారిందట అధికార పార్టీ పరిస్థితి. జగిత్యాల నియోజకవర్గంలో సొంత పార్టీని పదే పదే ఇరుకున పెడుతున్నారు సీనియర్ నాయకుడు జీవన్‌ రెడ్డి. అక్కడ వరుసగా జీవన్‌రెడ్డిని రెండుసార్లు ఓడించిన సంజయ్ ఇప్పుడు హస్తం పార్టీకి దగ్గరవడంతో రగిలిపోతున్నారట పెద్దలు జీవన్ సారు. దాదాపు పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తరుణంలో సీనియర్‌గా తనకు ప్రాధాన్యత లభిస్తుందని ఆశించిన ఆయనకు అడియాశే ఎదురవడంతో అగ్గిమీద గుగ్గిలంలా మారారట. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సీఎం రేవంత్‌కి దగ్గరవడం నుంచి స్టార్టయిన ఈ జగడం.. రోజుకో అంశం చుట్టూ తిరుగుతోంది. ఏదో ఒక హాట్ టాపిక్‌ తీసుకోవడం.. అటు ప్రభుత్వాన్ని ఇటు సంజయ్‌ని టార్గెట్ చేసేలా మాట్లాతున్నారట మాజీ మంత్రి జీవన్‌.. తొలుత తన అనుచరుడి మర్డర్ విషయంలో ఆయన రొడ్డెక్కిన తీరు.. ఎమ్మెల్యే సంజయ్ లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు ఆయనకు పెద్దగా ఉపయోగపడలేదట.

సానుభూతి అస్త్రం సరిగ్గా వర్కౌట్ కాకపోవడంతో.. పార్టీని వీడుతానంటు పదే పదే అలక పాన్పు ఎక్కడం చేశారు. మొదట్లో కాస్త ప్రయారిటీ ఇచ్చి జగిత్యాలకు వచ్చి మరీ మంత్రులు బుజ్జగింపులు చేయడంతో మరింత స్పీడ్ పెంచారట. ఆ నేపథ్యంలోనే ఎంపీగా పోటీ చేయడం, ఓడిపోవడం.. ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసిపోవడం.. తిరిగి రెన్యూవల్ కాకపోవడం.. పార్టీ పవర్‌లో ఉన్న నేపథ్యంలో క్యాబినెట్‌లో ఉండాలనే కోరిక అలాగే ఉండిపోవడంతో.. ఆయన ప్రస్టేషన్ పీక్స్‌కి వెళ్లిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జగిత్యాల పొలిటికల్ సర్కిల్స్‌లో.. పదే పదే అదే పనిగా అలుగుతుండటంతో పార్టీ పెద్దలు.. ప్రభుత్వ ముఖ్యులు పట్టించుకోవడం మానేసారట. అయినా తన పట్టు నిరూపించుకునేందుకు ఏదో ఒక వివాదస్పద అంశంతో తెరపైకి రావడం మాత్రం ఆపడం లేదట పెద్దాయన.

పార్టీలో పెద్దలతో.. మంత్రులతో ఆయన వ్యవహరిస్తున్న తీరు కూడా హాట్ టాపిక్‌గా మారిందట. జగిత్యాల పర్యటనకు వచ్చిన మంత్రి పొంగులేటి విష్ చేయడానికి జీవన్‌రెడ్డి వద్దకు వెళితే దూరం జరిగి.. మీదే రాజ్యం మీరే ఏలుకోండి అంటూ వ్యాఖ్యానించడంతో పొంగులేటి షాక్ అయ్యారట. మంత్రితో ఆయన అన్న మాటలు అప్పట్లో హాట్ హాట్‌గా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత మంత్రి అడ్లూరి వద్దకు వెళ్లి.. చిన్న దేవస్థానం పాలక వర్గం విషయంలో పేచీ పెట్టడం.. మమ్మల్ని పార్టీలోంచి వెళ్లగొట్టండి అంటూ వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్‌ పట్టాదారులం మేము అంటూ వార్నింగ్ ఇచ్చినంత పనిచేసారు. పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా ఉన్న వ్యక్తి క్యాడర్ ముందు పట్టాదారులు, కౌలు దారులు అంటూ మాట్లాడటంతో హస్తం పార్టీకి ఇబ్బందికరంగానే మారిందట. కౌలుదారులు, పట్టాదారులు, ఓనర్లు అనే వ్యాఖ్యలకు ప్రత్యర్ధి శిబిరం నుంచి గట్టిగానే కౌంటర్లు పడ్డాయట. జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌లో పుట్టారా…? ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి నాదేండ్లతో వెళ్లి కాంగ్రెస్‌లోకి వచ్చారు.. అయన పట్టాదారు ఎలా అవుతారు..? ఎదుటివారు కౌలుదారులు ఎలా అవుతారు అంటూ చరిత్ర పాఠాలతో ట్రోల్ చేసారట ఆయన వ్యతిరేకులు.

పార్టీని సర్కారును ఇబ్బంది పెట్టడం ఎమ్మెల్యేని ఇరుకున పెట్టాలని ప్రతీ ఛాన్స్ వాడేస్తున్నారట జీవన్. గతంలో నర్సింగాపూర్ గ్రామంలో దాదాపు రెండువందల ఎకరాల ప్రభుత్వ భూమిని గత ప్రభుత్వ హయాంలో కబ్జాలు చేసారని లేఖలు రాయడం.. విచారణ జరిగేలా చేసారట జీవన్‌రెడ్డి.. ఆ ప్రభుత్వ భూముల కబ్జా అంతా అప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్‌కుమారే చేయించారని ప్రచారం జోరుగా సాగేలా జీవన్‌రెడ్డే చేసారనే టాక్ నడిచిందట. తీరా చూస్తే ఆ భూములు కబ్జాచేసిన వారిలో జీవన్‌ అనుచరులు ఉండటంతో.. ఎమ్మెల్యే సంజయ్ అటాక్ ప్రారంభించేసారు. జీవన్‌ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ వ్యవహారం అంతా సాగిందని ఆధారాలతో చెప్పడంతో సైలెంట్ అయ్యారట జీవన్… నర్సింగాపూర్ భూముల వ్యవహరాన్ని పట్టించుకోవడం ఆపేసి కొత్త లొసుగులను వెలికితీసే పనిలో పడ్డారట పెద్దాయన.. అలా చూస్తున్న ఆయనకు జగిత్యాల నడిబొడ్డున బస్టాండ్ పక్కనే ఉన్న రెండు వందల కోట్ల విలువ చేసే మున్సిపల్ ల్యాండ్ కబ్జా అంశం దొరికిందట. ఏముంది. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే సంజయ్ అనుచరుడు మంచాల కృష్ణ అనే వ్యక్తి ప్రభుత్వ భూమిని కబ్జా చేసారని ఆయన అండతోనే మున్సిపల్ ల్యాండ్ అన్యాక్రాంతం అయిందని విమర్శలు గుప్పించారు.

రంగంలోకి దిగిన సంజయ్ గట్టిగానే కౌంటర్ వేసారట. ఆ భూ వివాదం నాలుగు దశాబ్దాలుగా సాగుతుంది. ఆ ల్యాండ్ జీవన్‌రెడ్డి మరదలు మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నప్పుడే సదరు వ్యక్తికి దక్కేలా చేసారని అటాక్ చేసారు ఎమ్మెల్యే.. కోర్టుకు వెళ్లకుండా ఏం చేసారని ప్రశ్నించారట. మంచాల కృష్ణ అనే వ్యక్తి దగ్గరకు ఎంపీగా పోటీ చేసినప్పుడు జీవన్‌రెడ్డి ఎందుకు వెళ్లాడు..? అతనికి జీవన్‌రెడ్డికి మధ్య ఏం జరిగిందో చెప్పాలని ఢిఫెన్స్‌లోకి నెట్టాడు ఎమ్మెల్యే సాబ్.. అంతటితో ఆగకుండా ఇండైరెక్టుగా జీవన్‌రెడ్డిని ఉద్దేశించి జీవితాంతం పదవి కోసం కొందరు పాకులాడుతున్నారని సెటైర్లు వేసేసారు. ఓవైపు జీవన్‌ అటాక్.. మరోవైపు ఎమ్మెల్యే కౌంటర్ అటాక్‌.. వల్ల మరోసారి జగిత్యాల రాజకీయం రచ్చరచ్చగా మారిందట.

అయితే మున్సిపల్ ల్యాండ్ కబ్జా అంశంపై రాజకీయ రగడ జరగడం ఒక ఎత్తయితే.. అత్యంత విలువైన భూమిని కాపాడాల్సిన నాయకులు కబ్జాకు పాల్పడిన వ్యక్తి నీ వాడు అంటే నీవాడు అంటూ వాదులాడుకోవడంపై జగిత్యాల ప్రజలు పెదవి విరుస్తున్నారట. పార్టీని వీడేది లేదు. పార్టీని ఖాతరు చేసేది లేదు అన్నట్టుగా మాజీ మంత్రి గారి తీరు ఉందని రుసరుసలాడుతున్నారట పార్టీ కార్యకర్తలు.. మరోవైపు ఏది ముట్టుకున్నా తిరిగి తన మెడకే చుట్టుకోవడంతో ఏం చేయాలా అంటూ ఆలోచనలో పడ్డారట జీవన్‌రెడ్డి. తన అనుభవాన్నంతా ఉపయోగించి ప్రయోగిస్తున్న అస్త్రాలు విఫలం కావడమే కాకుండా.. సాప్ట్‌ అనే పేరున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు సింపతీ గేయిన్ చేస్తుండటంతో గేర్ మార్చాలా లేదా అనే డైలామాలోకి వెళ్లారట పెద్దాయన.. మరోవైపు అభివృద్ది పేరుతో కార్‌కు దూరంగా హస్తానికి చేరువగా వెళ్లిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ జీవన్‌రెడ్డి తీరుతో నారాజ్ అవుతున్నారట. ఏడాదిన్నర కాలం నుంచి ఎప్పుడూ రగులుతూనే ఉన్న జగిత్యాల పొలిటికల్ పంచాయతీని సెటిల్‌ చేసేందుకు పార్టీ పెద్దలు పూనుకోవాలని కోరుతున్నారట హస్తం క్యాడర్.

Related News

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

Big Stories

×