E-Paper
Advertisement

Jagityal News: హెల్మెట్ లేక ఫ్రెండ్ చనిపోవడంతో.. ఫ్రీగా హెల్మెట్లు పంచుతున్న ప్రాణస్నేహితుడు

Jagityal News: హెల్మెట్ లేక ఫ్రెండ్  చనిపోవడంతో.. ఫ్రీగా హెల్మెట్లు పంచుతున్న ప్రాణస్నేహితుడు
Advertisement

Jagityal News: తన ప్రాణ స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రగాయమై.. మరణించిన సంఘటన ఆ యువకుడిని కలచివేసింది. తలకు హెల్మెట్ పెట్టుకుంటే స్నేహితుడు బతికుండేవాడని ఎంతో బాధపడ్డా ఆ యువకుడు.. ఇతరులకు కూడా ఇలాంటి ప్రమాదాలు జరగవద్దని ఆలోచనతో వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. సొంత డబ్బులతో ఏడాది నుంచి హెల్మెట్లు కొనుగోలు చేసి వాహనదారులకు ఉచితంగా అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఆదర్శ స్నేహితునిపై బిగ్ టీవీ కథనం.

జగిత్యాల జిల్లా మెట్ పల్లి కళానగర్ కి చెందిన ఆడెపు సన్నీ అనే యువకుడు.. వాహనాలు నడిపే యువతకు హెల్మెట్లపై అవగాహన కల్పిస్తూ ఉచితంగా అందిస్తూ, ప్రాణం విలువ తెలుపుతూ, వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. పట్టణంలోని జాతీయ రహదారిపై ఓ వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. తన ప్రాణ స్నేహితులు ఏడాదిన్నర క్రితం ద్విచక్ర వాహనం నడుపుతూ.. రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై మరణించాడు. ఆ సమయంలో సన్నీ ఆలోచించి హెల్మెట్ ఉంటే స్నేహితుడు బతికుండే వాడని ఎంతో బాధపడ్డాడు. ఇలాంటి సమస్య మరొకరికి రా వద్దంటూ ఒక అడుగు ముందుకేసిన ఆ యువకుడు అప్పటి నుంచి నేటి వరకు ఊరూరా తిరుగుతూ హెల్మెట్ల రక్షణ పై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాడు.

Advertisement

వస్త్రాలు కొనుగోలు చేసేందుకు తన దుకాణానికి వచ్చే యువతకు హెల్మెట్ల పై.. అవగాహన కల్పించి ఉచితంగా అందిస్తూ అందరికీ ఆరోప్రాణాన్ని అందిస్తున్నాడు. ఇప్పటివరకు సుమారు 500 పైనే హెల్మెట్లను యువతకు ఉచితంగా అందించాడు. వాహనాలు నడిపే మహిళలకు సైతం హెల్మెట్లను అందించి వాటి రక్షణ గురించి అవగాహన కల్పిస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడే వాహనం నడపాలని, మన మీద ఆధారపడి ఉన్న మన కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని.. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని చెబుతున్నాడు.

కేవలం ఇంతవరకు ఆగకుండా లఘు చిత్రాలు , రీల్స్ చేస్తూ వాటిని వాట్సాప్ ఇంస్టాగ్రామ్ ఫేస్‌బుక్ తదితర వాటిలో పోస్ట్ చేస్తూ ప్రచారం చేస్తున్నాడు. ఈ యువకుడు చేస్తున్న ఉచిత సేవను పలువురు ప్రశంసిస్తూ అభినందిస్తున్నారు. హెల్మెట్ ధరించి వాహనాన్ని నడిపి ప్రాణాలు రక్షించుకొని కుటుంబాన్ని ఆనందంగా ఉంచాలనేది నా లక్ష్యం అంటూ యువకుడు సన్నీ అందరికీ సూచనలు ఇస్తున్నారు.

Related News

బర్తరఫ్ తర్వాత తొలిసారి నోరు విప్పిన కొండా సురేఖ..సీయం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

Big Stories

Advertisement
×