E-Paper
Advertisement

Municipality: రాష్ట్రంలో మరో కొత్త మున్సిపాలిటీకి లైన్ క్లియర్.. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే..?

Municipality: రాష్ట్రంలో మరో కొత్త మున్సిపాలిటీకి లైన్ క్లియర్.. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే..?
Advertisement

Municipality: తెలంగాణ రాష్ట్రంలో మరొక కొత్త మున్సిపాలిటీ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. వరంగల్ జిల్లాలోని నెక్కొండ మేజర్ గ్రామ పంచాయితీని మున్సిపాలిటీగా మార్చాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులోకి రానున్న నేపథ్యంలో నోటిఫికేషన్ కు ముందే నెక్కొండను మున్సిపాలిటీగా గుర్తించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

నెక్కొండ మాజీ సర్పంచ్ సొంటిరెడ్డి యమున రెడ్డి ఈ విషయంపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నెక్కొండ మేజర్ గ్రామ పంచాయితీ విస్తీర్ణం జనాభా దృష్ట్యా దీన్ని మున్సిపాలిటీగా మార్చడం అవసరం అని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు 4త్ సెషన్స్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

నెక్కొండ మున్సిపాలిటీ ఏర్పాటు కోసం ఆరు గ్రామ పంచాయితీలను కలపాలని పిటిషనర్ కోర్టుకు నివేదించారు. నెక్కొండ అమీన్ పేట, గుండ్రపల్లి, పత్తిపాక, నెక్కొండ తండా, టీ.కె తండా గ్రామ పంచాయితీ లను కలిపి కొత్త మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని కోరారు. పిటిషనర్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు నెక్కొండకు మున్సిపాలిటీగా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖను ఆదేశించింది.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ప్రభావం ఏర్పడక ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలలో ముఖ్యంగా ప్రస్తావించింది. మున్సిపాలిటీ ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్ ను వెంటనే జారీ చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. హైకోర్టు తాజా ఆదేశాలతో నెక్కొండ ప్రజల కల నెరవేరే దిశగా అడుగులు పడ్డాయి. పరిసర గ్రామాలతో కలిపి నెక్కొండ మున్సిపాలిటీగా మారడం స్థానికుల అభివృద్ధి ఆకాంక్షలకు దక్కిన విజయం అని చెప్పవచ్చు.

Advertisement

తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ హైకోర్టు ఆదేశాలను ఎంత త్వరగా అమలు చేస్తాయి అన్నది చూడాలి. ఈ చర్యతో నెక్కొండ ప్రాంతంలో పరిపాలనా సంస్కరణలు వేగవంతం అయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు స్థానిక రాజకీయాలలో ఒక కీలక పరిణామం కానుంది.

ALSO READ: Bandi Sanjay: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ.. అందులో ఏముందంటే..?

Related News

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

Big Stories

Advertisement
×