E-Paper
Advertisement

Komatireddy: CWC ఇస్తే ఓకే.. లేదంటే రాజీనామే!.. కోమటిరెడ్డి క్లారిటీ

Komatireddy: CWC ఇస్తే ఓకే.. లేదంటే రాజీనామే!.. కోమటిరెడ్డి క్లారిటీ
Advertisement
Komatireddy

Komatireddy: కోమటిరెడ్డి కాంగ్రెస్‌ను వీడుతున్నారు.. బీజేపీలో చేరుతున్నారు.. ఇన్నాళ్లూ జరిగిన ప్రచారం ఇది. లేటెస్ట్‌గా మరో కొత్త టాక్. ఆయనే సొంతంగా పార్టీ పెడుతున్నారట. ఓ మీడియాలో బాగా ప్రమోట్ అవుతోంది ఆ విషయం.

కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలుస్తోంది. పీసీసీ చీఫ్ పదవి తనకు ఇవ్వనందున.. సీడబ్ల్యూసీ సభ్యత్వమైనా ఇవ్వాలంటూ హైకమాండ్ ముందు డిమాండ్ పెట్టారని అంటున్నారు. CWC ఇస్తే కాంగ్రెస్‌లో కంటిన్యూ అవుతా.. లేదంటే పార్టీకి రాజీనామా చేస్తానంటూ లీకులు ఇస్తున్నారని మీడియాలో ప్రచారం జరుగుతోంది. విషయం కోమటిరెడ్డి గురించి కావడంతో.. అయితే అయ్యుంటుందనే అనుకుంటున్నారు కాంగ్రెస్ వాదులు.

Advertisement

అయితే, ఎప్పటిలానే ఈ వార్తలను ఖండించారు ఎంపీ. తాను కాంగ్రెస్‌ను వీడటం లేదని.. కొత్త పార్టీ కూడా పెట్టట్లేదని ఢిల్లీలో స్పష్టం చేశారు. పార్టీ మారే ఉద్దేశముంటే పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వనప్పుడే మారే వాడినన్నారు. కార్యకర్తలను అయోమయానికి గురిచేసేలా కొందరు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

కేంద్ర పెద్దలను కలవడంపైనా వివరణ ఇచ్చారు కోమటిరెడ్డి. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే కేంద్ర మంత్రులను కలుస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆదేశిస్తే మళ్లీ ఎమ్మెల్యే, ఎంపీ.. దేనికి పోటీ చేయమంటే దానికి పోటీ చేస్తానని చెప్పారు.

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×