E-Paper
Advertisement

Dasara: రూ.100 కోట్ల దసరా.. నాని రికార్డ్.. డైరెక్టర్‌కి BMW గిఫ్ట్.. యూనిట్‌కు గోల్డ్ కాయిన్స్

Dasara: రూ.100 కోట్ల దసరా.. నాని రికార్డ్.. డైరెక్టర్‌కి BMW గిఫ్ట్.. యూనిట్‌కు గోల్డ్ కాయిన్స్
Advertisement
dasara

Dasara: దసరా దుమ్మురేపుతోంది. థియేటర్లలో ధూంధాంగా నడుస్తోంది. నేచురల్ స్టార్ నాని.. తెలంగాణ రోల్‌లో లీనమైపోయారు. పక్కా మాస్ మసాలా క్యారెక్టర్‌తో.. ఊరమాస్ లుక్‌తో అదరగొట్టేశాడు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పనితనంకు అనేక ప్రశంసలు. కీర్తి సురేశ్ నటనకు కాంప్లిమెంట్స్. ఒక్కటేంటి.. దసరా.. అన్నిరకాలుగా పండగ చేసుకుంటోంది. ఇక కలెక్షన్ల పరంగానూ కిరాక్ లేపుతోంది. పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా రిలీజ్ అయి.. అన్ని భాషల్లోనూ అదుర్స్ అనిపిస్తోంది.

మార్చి 30న శ్రీరామనవమికి రిలీజ్ అయింది సినిమా. తొలిరోజే రూ.38 కోట్ల గ్రాస్‌ కొట్టగొట్టింది. నాని కెరీర్‌లో హైయెస్ట్‌ ఓపెనింగ్స్‌ ఇవి. సెకండ్ డే కల్లా.. 50 కోట్ల పైసా వసూల్. వారం తిరిగేసరికల్లా.. ఏకంగా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. నానికి మైలురాయి విజయంగా నిలిచింది.

Advertisement

సినిమా సక్సెస్‌తో నిర్మాత చెరుకూరి సుధాకర్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఆ సంతోషంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు ఖరీదైన BMW కార్ గిఫ్ట్‌గా ఇచ్చారు. కరీంనగర్‌లో జరిగిన దసరా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో డైరెక్టర్‌కు కారును ప్రజెంట్‌ చేశారు ప్రొడ్యూసర్. ఇక, మూవీ కోసం పనిచేసిన అందరికీ తలా 10 గ్రాముల గోల్డ్ కాయిన్స్ కూడా బహుమతిగా ఇచ్చారు. ఈ గిఫ్ట్‌లు చూస్తుంటే తెలీట్లే.. నిర్మాతకు దసరా పండుగేనని.

దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెలకు ఇదే ఫస్ట్ ఫిల్మ్. తొలి ప్రయత్నంలోనే సూపర్ సక్సెస్‌ అయ్యారు. గతంలో రంగస్థలంకు సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇప్పుడు దసరాతో ఓవర్ నైట్ టాప్ డైరెక్టర్ అయ్యారు. ఇప్పుడు గిఫ్ట్‌గా బీఎండబ్ల్యూ కారు పొందారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×