BigTV English

KTR Bandi Sanjay Meet: బండి సంజయ్, కేటీఆర్‌లను కలిపిన వరద.. ఇద్దరి మాటలు వింటే నవ్వులే నవ్వుల్

KTR Bandi Sanjay Meet: బండి సంజయ్, కేటీఆర్‌లను కలిపిన వరద.. ఇద్దరి మాటలు వింటే నవ్వులే నవ్వుల్

KTR Bandi Sanjay Meet: ప్రస్తుత రాజకీయాల్లో ఒక పార్టీ నేతలు, మరో పార్టీ నేతలు తిట్టుకోవడం కామన్ అయిపోయింది. నోటికి వచ్చినట్టు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే స్థాయికి సైతం వెళ్తున్నారు. వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన పదాలను కూడా అప్పుడప్పుడు మన వింటుంటాం. ఇది ప్రజల్లో రాజకీయాలపై ప్రజలకు విశ్వాసం కోల్పోయేలా చేస్తోంది. రాజకీయం అంటేనే అసహ్యానానికి గురయ్యేలా చేస్తోంది. గతంలో రాజకీయం సమాజ నిర్మాణానికి తోడ్పేడేది.. నాయకులు ఒకరినొకరు దూషించడంలో, బూతులు తిట్టడంలో పోటీపడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ప్రజలకు సమస్యలపై చర్చల కంటే వివాదాలనే ముందుకు తెస్తోంది. ఈ దుర్భాషలు రాజకీయ సంస్కృతిని దిగజార్చడమే కాక, యువతకు తప్పుడు సందేశాన్ని ఇస్తున్నాయి. అయితే కొందరు రాజకీయ నాయకులు అప్పటి వరకు ఒకరిపై మరొకరు దారుణంగా విమర్శలు చేసుకుంటారు. అంతలోనే ఎక్కడైనా పరస్పరం ఎదురైతే ఆలింగనం చేసుకుని ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నారు. తాజాగా సిరిసిల్ల పర్యటనల్లో భాగంగా బండి సంజయ్, కేటీఆర్ ఒకరినొకరు కలుసుకున్నారు. అంతేగాక నవ్వుకుంటూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు.


ఎగువ మానేను జలాశయం వద్ద కేటీఆర్, బండి..

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వీరిద్దరు ఎప్పుడూ ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటారు. అయితే ఈ నేతలను వరద కలిపింది. అవును నిజమే.. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ లు ఇద్దరు వరద ప్రాంతాల పర్యటనలో అనుకోకుండా కలుసుకున్నారు. సిరిసిల్ల జిల్లాలో ఎగువ మానేరు జలాశయం వద్ద వరద బాధిత ప్రాంతాల్లో బండి పర్యటిస్తున్నారు. అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ కూడా అక్కడకు చేరుకున్నారు.

ALSO READ: PGCIL Notification: పీజీసీఐఎల్‌లో 1543 ఉద్యోగాలు.. లక్షకు పైగా జీతం, ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు..!

ఎందన్నా గ్లామర్ తగ్గింది..! నవ్వులే – నవ్వుల్

ఇద్దరు నేతలు అనుకోకుండా ఒకరినొకరు ఎదురు పడడంతో మర్యాద పూర్వకంగా కలుసుకుని పరస్పరం షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. అనంతర బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘ఎందన్నా గ్లామర్ తగ్గింది.. సన్నబడ్డావు’ అని వ్యాఖ్యానించారు. దీనికి బదులుగా కేటీఆర్ నవ్వుకుంటూ.. ‘జుట్టు కూడా రాలిపోతుంది’ అని అన్నారు. అనంతరం ఇద్దరు కీలక నేతలు వరద సహాయ కార్యక్రమాలపై కాసేపు మాట్లాడారు.

ALSO READ: BOM Jobs: ఇది అద్భుతమైన అవకాశం.. డిగ్రీతో భారీగా ఉద్యోగాలు.. డోంట్ మిస్

అందుకే బండి సిరిసిల్లకు వెళ్లారా..?

రెండు పార్టీల కీలక నేతలు కలుసుకున్న క్రమంలో ఇరు పార్టీల నాయకులు ఈ ఆకస్మిక పరిణామాన్ని ఆస్వాదిస్తూ కేరింతలు కొట్టారు. బండి సంజయ్, కేటీఆర్ ల నాయకత్వం వర్ధిల్లాలంటూ పోటాపోటీగా నినాదాలు సైతం చేశారు. మరోవైపు కామారెడ్డి, మెదక్ జిల్లాలు వదిలి బండి సంజయ్ సిరిసిల్ల జిల్లాలో పర్యటించడం కేవలం రాజకీయం కోసమేనన్న ప్రచారం కూడా గట్టిగా వినిపిస్తోంది..

Related News

Rain update: అత్యంత భారీ వర్షాలు.. ఈ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్.. అప్రమత్తంగా ఉండండి..!

Pocharam Dam: డేంజర్‌లో పోచారం డ్యామ్.. 10 ఊర్లు ఖతమ్..!

Local Body Elections: పంచాయతీ ఎన్నికలకు డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

Kamareddy floods: తెలంగాణలో వర్ష బీభత్సం.. నీట మునిగిన కామారెడ్డి పట్టణం, రెసిడెన్షియల్ విద్యార్థులు సేఫ్

Schools holiday: ఆ జిల్లాలలో రేపు పాఠశాలలకు సెలవు.. బయటికి రావద్దంటూ హెచ్చరిక!

Big Stories

×