Secunderabad trains: దక్షిణ మధ్య రైల్వే నుండి సికింద్రాబాద్ ప్రయాణికులకు శుభవార్త వచ్చింది. స్టేషన్ అభివృద్ధి పనుల కారణంగా తాత్కాలికంగా చర్లపల్లి, ఉందా నగర్ స్టేషన్లకు మళ్లించిన కొన్ని రైళ్లు మళ్లీ సికింద్రాబాద్ స్టేషన్ నుంచే నడుస్తున్నాయి. ఈ మార్పు సెప్టెంబర్ 10, 2025 నుండి అమల్లోకి వస్తుందని రైల్వే అధికారులు అధికారిక ప్రకటనలో తెలిపారు.
సికింద్రాబాద్ – మణుగూరు – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (12745/12746), సికింద్రాబాద్ – రేపల్లే – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (17645/17646) రైళ్లు సెప్టెంబర్ 10 నుంచి మళ్లీ సికింద్రాబాద్ నుంచే ప్రారంభం అవుతాయి. అదేవిధంగా, సికింద్రాబాద్ – పోరుబందర్ ఎక్స్‌ప్రెస్ (20967/20968) రైలు కూడా అక్టోబర్ 29, 2025 నుంచి సికింద్రాబాద్ స్టేషన్ నుంచే బయలుదేరనుంది.
సికింద్రాబాద్ – మణుగూరు ఎక్స్‌ప్రెస్ (12745/12746)
12745 సికింద్రాబాద్ నుంచి మణుగూరుకు వెళ్లే రైలు రాత్రి 11:45 గంటలకు సికింద్రాబాద్ నుండి బయలుదేరుతుంది. చర్లపల్లి స్టేషన్ వద్ద రాత్రి 11:50 – 11:51 మధ్య ఆగి, తెల్లవారుజామున 5:45 గంటలకు మణుగూరుకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 12746 మణుగూరు నుంచి సాయంత్రం 9:45 గంటలకు బయలుదేరి చర్లపల్లి వద్ద 2:49-2:50 గంటలకు ఆగి, ఉదయం 3:45 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
సికింద్రాబాద్ – రేపల్లే ఎక్స్‌ప్రెస్ (17645/17646)
17645 సికింద్రాబాద్ నుంచి రేపల్లే వెళ్ళే రైలు మధ్యాహ్నం 12:40 గంటలకు బయలుదేరుతుంది. చర్లపల్లి వద్ద 12:59-1:00 గంటలకు ఆగి, రాత్రి 9:05 గంటలకు రేపల్లే చేరుకుంటుంది. తిరుగు రైలు 17646 రేపల్లే నుంచి ఉదయం 7:10 గంటలకు బయలుదేరి చర్లపల్లి వద్ద మధ్యాహ్నం 3:04-3:05 గంటలకు ఆగి, సికింద్రాబాద్ స్టేషన్ వద్ద సాయంత్రం 3:55 గంటలకు చేరుకుంటుంది.
సికింద్రాబాద్ – పోరుబందర్ ఎక్స్‌ప్రెస్ (20967/20968)
ఈ రైలు అక్టోబర్ 29, 2025 నుండి సికింద్రాబాద్ నుంచే బయలుదేరుతుంది. 20967 సికింద్రాబాద్ – పోరుబందర్ రైలు మధ్యాహ్నం 3:10 గంటలకు బయలుదేరి, రాత్రి 9:50 గంటలకు పోర్బందర్ చేరుకుంటుంది. తిరుగు రైలు 20968 పోరుబందర్ నుంచి తెల్లవారుజామున 1:15 గంటలకు బయలుదేరి, సికింద్రాబాద్ వద్ద ఉదయం 8:00 గంటలకు చేరుకుంటుంది.
Also Read: Manwal station: హోటల్ అనుకోవద్దు.. ఇదొక రైల్వే స్టేషన్.. దీని వెనుక పెద్ద కథే ఉంది!
రైల్వే అధికారులు ఈ మార్పులు స్టేషన్ పునర్వ్యవస్థీకరణ పనులు పూర్తవడంతో అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు కొత్త టైమ్ టేబుల్‌ను అనుసరించి టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.
ప్రయాణికుల సౌలభ్యం దృష్ట్యా రైళ్ల రాకపోకలను సులభతరం చేసేందుకు రైల్వే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా రోజూ ఈ మార్గాల్లో ప్రయాణించే వందలాది మంది ఉద్యోగులు, విద్యార్థులకు ఈ నిర్ణయం ఎంతో ఉపశమనం కలిగించింది. రైళ్ల పునరుద్ధరణతో ప్రయాణ సమయం తగ్గి, సౌకర్యాలు మెరుగవుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రైల్వే అధికారులు, ప్రయాణికుల భద్రత, సౌకర్యం మా ప్రాధాన్యత. ఈ మార్పులు అందరికీ ఉపయోగపడతాయని తెలిపారు. సెప్టెంబర్ 10, అక్టోబర్ 29 నుండి అమల్లోకి వచ్చే ఈ మార్పులతో సికింద్రాబాద్ స్టేషన్ మరింత రద్దీగా మారనుంది.