Ghaati Sensor Review :హిస్టారికల్ మూవీలకు పెట్టింది పేరుగా పేరు సొంతం చేసుకన్నారు క్రిష్ జాగర్లమూడి (Krish jagarlamudi) నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకొని చిత్రాలు తెరకెక్కించడంలో దిట్ట అని నిరూపించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ ‘ఘాటీ’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 5వ తేదీన తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో విడుదల కాబోతోంది.
సెన్సార్ పూర్తి చేసుకున్న అనుష్క ఘాటీ..
విడుదలకు వారం రోజులు మాత్రమే సమయం ఉండడంతో తాజాగా ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. 2 గంటల 35 నిమిషాల రన్ టైంతో రానున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం. ఇక పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరు చూడదగిన చిత్రంగా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంతో అనుష్కకు, అటు క్రిష్ కు ఈ సినిమా పెద్ద బ్రేక్ ఇవ్వబోతుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ తో పాటు సినిమా రివ్యూ కూడా సెన్సార్ బోర్డు ఇచ్చేసింది.
సెన్సార్ బోర్డు రివ్యూ..
సెన్సార్ బోర్డు ఇచ్చిన రివ్యూ ప్రకారం.. ఈ సినిమా మొదటి భాగం మొత్తం ఎమోషనల్ జర్నీతో సాగుతుందని.. ఇంటర్వెల్ లో ఊహించని బిగ్ ట్విస్ట్ ఉండబోతుందని స్పష్టం చేసింది. సెకండ్ హాఫ్ లో పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని సమాచారం. జగపతిబాబు, విక్రమ్ ప్రభు , రవీంద్రనాథ్ విజయ్, చైతన్యరావు తదితరులు పవర్ఫుల్ పాత్రలతో తమ పాత్రలకు పూర్తిస్థాయి న్యాయం చేశారట. ముఖ్యంగా అనుష్క శత్రువులను ఊచకోత కోస్తూ తన వీరత్వాన్ని ప్రదర్శించిందని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. మొత్తానికి అయితే ఫస్ట్ హాఫ్ ఎమోషనల్.. సెకండ్ ఆఫ్ యాక్షన్ మోడ్ తో.. సీట్ చివరంచున ప్రేక్షకుడిని కూర్చునేలా ఈ సినిమా చేస్తుందని సెన్సార్ రిపోర్ట్ చెబుతోంది. దీనికి తోడు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు అనుష్క కూడా తన అద్భుతమైన నటనతో జీవించేసింది. ఇప్పుడు సెన్సార్ కూడా పాజిటివ్ రివ్యూ ఇవ్వడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
ప్రమోషన్స్ జోరు పెంచిన క్రిష్ జాగర్లమూడి..
ఈ సినిమా ప్రమోషన్స్ కి అనుష్క దూరంగా ఉన్న విషయం తెలిసిందే.కానీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి మాత్రం తన సినిమాను ప్రజలలోకి తీసుకెళ్లడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోకి కూడా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా క్రిష్ సందడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సెన్సార్ రిపోర్టు కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది.
ALSO READ:Maniratnam: అప్పుల బాధతో మణిరత్నం సోదరుడు మృతి.. 23 ఏళ్ల తర్వాత తీర్పునిచ్చిన హైకోర్టు