Pocharam Dam: అనుకున్నదే జరిగింది. భారీ వరదలు, ఎగువన కురుస్తున్న వర్షాలకు.. పోచారం ప్రాజెక్టు ప్రమాదపు అంచునకు చేరుకుంది. ప్రాజెక్టు ఓవర్‌హెడ్ వద్ద భారీ గండి పడినట్లు సమాచారం. దీంతో పోచారం ప్రాజెక్టు డేంజర్ జోన్‌లో పడింది. గంటగంటకు పెరుగుతున్న వరదతో.. పోచారం ప్రాజెక్టు పైనుండి 10 అడుగుల మేర వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇక పోచారం ప్రాజెక్టుకు ప్రమాదం జరిగితే.. 10 గ్రామాలకు పెను ప్రమాదమే అంటున్నారు అధికారులు. దీంతో తీర ప్రాంత ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో లక్షా 50వేల క్యూసెక్కులుండగా.. మంజీరా నదిలో లక్షా 30వేల వరద నీరు కలుస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 1.82 టీఎంసీలని అధికారులు చెబుతున్నారు.
గంటగంటకు పెరిగిన వరద ఉదృతి.
అయితే నిన్న రాత్రి వరకూ ప్రాజెక్టు పరిసరాల్లో వరద బీభత్సం సృష్టించింది. గంట గంటకూ వరద పెరుగుతోంది. వృధాగా పోతున్న నీరు, ఏ క్షణమైనా కట్ట తెగే అవకాశం ఉందని ప్రజలు చెబుతున్నారు. దీంతో అక్కడి ప్రాజెక్టు పరిసర గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ భయపడుతున్నారు.
పలు గ్రామాలకు ముప్పు..
పోచారం, మాల్ తుమ్మెద, గోల్ లింగల్, చినూర్, వాడి, లింగంపల్లి, వెంగంపల్లి, తాండూర్, మాటూరు, మాసన్ పల్లి, ఆత్మకూర్ గ్రామాలకు ముప్పు నుంచి సేఫ్ అయినట్టు చెబుతున్నారు. ఇక కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీల్లో వరద ఇబ్బందులు కొనసాగుతూనే ఉంది. నిన్న కామారెడ్డి- హైదరాబాద్ వెళ్లే నేషనల్ హైవేని అధికారులు క్లియర్ చేసినా.. రాక పోకలకు ఇంకా సమయం పట్టేలా కనిపిస్తోంది. ఇంకా మరమ్మతులు కొనసాగుతూనే ఉన్నాయి.
కనీవినీ ఎరుగని రీతిలో వర్ష బీభత్సం..
103 ఏళ్ల పురాతన ప్రాజెక్ట్ పోచారం. లక్షా 82 వేల క్యూసెక్కులు భారీ వరద ప్రవాహాన్ని ధైర్యంగా తట్టుకుంది. ఇది దాని MFD 70వేల క్యూసెక్కుల కంటే చాలా ఎక్కువ. నిన్నటి ఉద్రిక్త క్షణాల తర్వాత ప్రాజెక్టు ఇంత స్ట్రాంగా నిలబడ్డం.. గొప్ప ఉపశమనం కలిగించిందని.. ఇది నిజంగా గర్వించదగిన భావేద్వేగ క్షణం అన్నారు నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో కుండపోత వర్షాలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో కుండపోత వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. వాగులు, వంకలు డేంజర్ లెవల్లో పొంగిపొర్లుతున్నాయి. చాలా ఏరియాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి.
Also Read: సినిమాలకు గుడ్ భై..! పవన్ ప్లాన్ ఇదేనా..?
నిన్న హవేలిఘనపూర్ మండలం నాగపూర్ వాగులో కొట్టుకుపోయిన కారు..
మరోవైపు నిన్న ప్రమాదవశాత్తు హవేలి ఘనపూర్ మండలం నాగపూర్ వాగులో ఒక కారు కొట్టుకుపోయింది. కారులో ఉన్న ఐదుగురు ప్రయాణికుల్లో ముగ్గురు సేఫ్‌గా బయటపడగా.. మరో ఇద్దరు గల్లంతు అయ్యారు. అయితే ఇద్దరు ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆందోళనకు గురిచేస్తోంది. కారు ఎక్కడ ఉంది.. కారు ఉన్నవారిలో ఇద్దరి స్వీచ్‌వేషన్ ఎంటన్నదే ఇక్కడ పాయింట్. ఆ ఇద్దరు సేఫ్‌గా ఉన్నారా? ఉంటే ఎక్కడ ఉన్నారు? లేకపోతే అదే వరదలో గల్లంతు అయ్యారా? అన్నదే ఇక్కడ అనుమానాలకు దారి తీస్తోంది. మరోవైపు గల్లంతైన ఇద్దరి కోసం అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
ప్రమాదం అంచున మెదక్ పోచారం ప్రాజెక్టు
ఎగువ నుంచి భారీగా వరద రావడంతో ప్రాజెక్టు అలుగు పక్కన భారీ గండి
వృధాగా పోతున్న నీరు, ఏ క్షణమైనా కట్ట తెగే అవకాశం pic.twitter.com/vpM1xzqf3U
— BIG TV Breaking News (@bigtvtelugu) August 27, 2025