BigTV English

Local Body Elections: పంచాయతీ ఎన్నికలకు డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

Local Body Elections: పంచాయతీ ఎన్నికలకు డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అడుగులు పడుతున్నాయ్. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ దిశగా పని షురూ చేసింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నోటిఫై చేసిన అన్ని గ్రామ పంచాయతీల్లోని ఫోటో ఓటర్ల జాబితాను తయారు చేసి ప్రచురించాలని పంచాయతీ అధికారులను ఆదేశించింది. సో లోకల్ ఫైటింగ్ లో భాగంగా మొదటి ఘట్టం రెడీ అవుతోంది. మరి పార్టీల మధ్య సవాళ్లు ఎలా ఉన్నాయ్? లోకల్ సమరం చుట్టూ మ్యాటర్ హీటెక్కుతోందా?


పంచాయతీ ఎన్నికల చుట్టూ పొలిటికల్ హీట్

తెలంగాణలో లోకల్ బాడీ ఫైటింగ్ కు రంగం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగకపోయినా తమ సానుభూతి పరుల్ని గెలిపించుకోవడం ద్వారా పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అనుకుంటున్నాయి. అందుకే పొలిటికల్ గేమ్ షురువైంది. ప్రజలకు మీరేం చేశారుంటే మీరేం చేశారన్న డైలాగులు పేలుతున్నాయ్. ఛలో పల్లెల్లోనే తేల్చుకుందాం అంటూ సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అలా పంచాయతీ ఎన్నికలపై కసరత్తు షురూ చేసిందో లేదో.. ఇలా పొలిటికల్ గేమ్ మొదలైపోయింది.


జనవరి 31తో ముగిసిన సర్పంచ్‌ల పదవీకాలం

2024 జనవరి 31వ తేదీ నాటికి తెలంగాణ సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసింది. ఆరు నెలలైనా ఎన్నికలు జరగకపోవడంతో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం లేదంటూ దాదాపు ఆరు పిటిషన్లు నమోదయ్యాయి. వాటిపై వాద ప్రతివాదాలు హైకోర్టులో నడిచాయి. చివరికి సెప్టెంబర్‌ 30వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో చాలా వాదోపవాదాలు నడిచాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల ప్రక్రియ చేపట్టాల్సి ఉందని నాడు ప్రభుత్వం జవాబు చెప్పింది. అదే సమయంలో ప్రభుత్వం లోకల్ బాడీ ఎన్నికలకు అంగీకారం తెలిపి ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత సర్కారుపైనే ఉంటుందని, అందుకే సమయం అవసరమని నాడు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్నది. ఫైనల్ గా బీసీ రిజర్వేషన్ల వ్యవహారం కేంద్రం దగ్గర, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది. దీంతో పార్టీపరంగా బీసీలకు 42 శాతం టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ అనుకుంటోంది.

ఓటర్ లిస్ట్ జాబితాపై ఈసీ షెడ్యూల్ ఖరారు

మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ విషయంలో మరింత అలర్ట్ అవుతోంది. హైకోర్ట్ విధించిన డెడ్ లైన్ సమీపిస్తుండడంతో కసరత్తు స్పీడ్ చేసింది. ఆగస్ట్ 28వ తేదీ లోపు గ్రామ పంచాయతీల ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ చేసి గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శించాలని జారీ చేసిన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఇక ఆ మరునాడే.. అంటే ఆగస్టు 29వ తేదీన ఎంపీడీవోల ద్వారా మండల స్థాయిలో వివిధ పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఆగస్ట్ 30వ తేదీన ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరించనుంది ఈసీ. అలాగే ఆగస్టు 31న జిల్లా పంచాయతీ అధికారి గ్రామ పంచాయతీల వార్డుల వారీగా ఫొటో ఓటర్ ఫైనల్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికలు రెండు లేదా మూడు దశల్లో నిర్వహించే అవకాశం ఉంది.

సెల్ఫీ పాయింట్ తో కేటీఆర్ సెల్ఫ్ డబ్బా: చామల

ఒకవైపు లోకల్ బాడీ పోల్స్ పై వేగం పెరుగుతుంటే.. ఇటు రాష్ట్రంలోని పొలిటికల్ పార్టీల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని కేటీఆర్ అంటున్నారు. అధికారంలోకి వచ్చి 20 నెలలైనా ఏమీ చేయలేకపోయారని, వాటికి ఓటు రూపంలో బదులు ఇవ్వాలంటున్నారు. కేటీఆర్ కామెంట్స్ పై కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దుర్గం చెరువు దగ్గర కేబుల్ బ్రిడ్జి ఒకటి కట్టి.. అక్కడ సెల్ఫీ పాయింట్ పెట్టి… కేటీఆర్ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడంటూ ఫైర్ అయ్యారు ఎంపీ చామల. సో ఇది ఇక్కడితో ఆగేది కాదు. పొలిటికల్ డైలాగ్ వార్ ఇంకా కొనసాగడం ఖాయమే. మరి లోకల్ ఫైటింగ్ లో జనం మూడ్ ఎలా ఉందో తెలిసి పోతుందా??

ఎక్కడా తగ్గొద్దు.. కేసులు పెట్టినా బెదరొద్దు.. స్థానికంలో సత్తా చాటుదాం.. ఇదీ కేటీఆర్ డైలాగ్.. ఆల్రెడీ పార్లమెంట్ లో గుండుసున్నా.. కంటోన్మెంట్ బైపోల్ లో థర్డ్ ప్లేస్.. ఇంకా మీరు చేసేదేంటి.. ఇదీ చామల కౌంటర్. రేషన్ కార్డులు వస్తున్న జనం, రుణమాఫీ అయిన రైతులు, ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్న మహిళలు, ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు ఇలా ఊళ్లల్లో అంతా కాంగ్రెస్ వైపే ఉన్నారన్న ధీమాతో హస్తం పార్టీ నేతలు ఉన్నారు. వీటికి తోడు 42 శాతం బీసీ రిజర్వేషన్లపై తమ చిత్తశుద్ధి కలిసి వస్తుందంటున్నారు.

ఏం చేశారో జనాలకు తెలుసన్న కాంగ్రెస్

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లోనే నెగెటివిటీ బాగా పెరిగిపోయిందన్న ప్రచారం చేయడంలో బీఆర్ఎస్, బీజేపీ ఒక అడుగు ముందుకు వేశాయి. మరి గ్రౌండ్ లెవెల్ లో నిజంగానే అలా ఉందా..? కొత్త రేషన్ కార్డు లబ్దిదారులు ఎవరూ లేరా..? పునాదులు, గోడలు, స్లాబ్ లు పూర్తి చేసుకుంటున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు లేరా..? బస్సుల్లో ఉచిత ప్రయాణం జరగట్లేదా..? 2 లక్షల రూపాయల రుణమాఫీ జరిగిన రైతుల సపోర్ట్ ఉండదా.. సన్న బియ్యం రావట్లేదా.. ఇలాంటి అంశాలను కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తున్నారు. దీంతో స్థానిక సమరం చుట్టూ పొలిటికల్ హీట్ పెరుగుతోంది.

సత్తా చాటుకునే వ్యూహాల్లో బీఆర్ఎస్

పార్లమెంట్ ఎన్నికల్లో జీరో సీట్లతో డీలా పడి, కంటోన్మెంట్ బైపోల్ లో థర్డ్ ప్లేస్ తో సరిపెట్టుకున్న బీఆర్ఎస్.. స్థానికంలో తమ సత్తా చాటాలని అనుకుంటోంది. అందుకే కేటీఆర్ గ్రామీణ ప్రాంత బీఆర్ఎస్ శ్రేణులను సమాయాత్తం చేస్తున్నారు. అంతా యాక్టివేట్ కావాలని లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటుదామని పిలుపునిచ్చారు. పోలీసులు కేసులు పెట్టినా బెదిరిపోవద్దంటున్నారు. అందరి పేర్లు రాసి పెట్టాలంటున్నారు. ఓవర్ యాక్షన్ చేసినోళ్ల సంగతి చెబుదామంటూ వార్నింగ్స్ ఇస్తున్న పరిస్థితి. ప్రెస్ మీట్లు పెట్టకపోతే జనం మర్చిపోతారన్న భయంతో బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని ఎంపీ చామల ఫైర్ అయ్యారు. గత పదేళ్ల పాలన చూసుకుంటే ఏం చేశారో వారికే అర్థమవుతుందని కౌంటర్ ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఇప్పుడు మాట్లాడడమేంటని క్వశ్చన్ చేస్తున్నారు. హైదరాబాద్ లో కూర్చుని కేటీఆర్ మాట్లాడుతున్నారని, 20 నెలల్లో జరిగిన అభివృద్ధి కనిపించట్లేదా అన్నది కాంగ్రెస్ ప్రశ్న. ఎన్నికలు పెడితే కాంగ్రెస్ ఎవరికి ఏం చేసిందో తెలుస్తుందన్నారు ఎంపీ చామల.

42 శాతం కోటా అమలుకు మంత్రుల కమిటీ

అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందింది. దీన్ని కేంద్రానికి పంపించారు కూడా. అయితే కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో బిల్లును అమోదించాలంటూ తెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు ఢిల్లీ వేదికగా ఆందోళనలు చేపట్టాయి. ఫైల్ మాత్రం ముందుకు కదలట్లేదు. ఇంకోవైపు బీసీ కోటా బిల్లు ఆమోదం కోసం అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ లు ఒకదానిపై మరొకటి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించడంపై తెలంగాణ ప్రభుత్వం తాజాగా మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా సలహాలు తీసుకుంటోంది. ఇప్పటికే అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి అభిప్రాయం కోరారు. అలాగే ఢిల్లీలోనూ న్యాయకోవిదులతో చర్చలు జరుపుతున్నారు. పార్టీపరంగా 42 శాతం కోటా ఇస్తామని బీఆర్ఎస్ ఎందుకు ముందుకు రావట్లేదని కాంగ్రెస్ క్వశ్చన్ చేస్తోంది.

స్థానికం నాటికి బీఆర్ఎస్ సత్తా చాటుతుందా?

సో ఇప్పుడు లోకల్ ఫైట్ నేపథ్యం, అటు జూబ్లీహిల్స్ బైపోల్ కూ టైం దగ్గరపడుతుండడంతో జరుగుతున్న చర్చ ఏంటంటే.. బీఆర్ఎస్ ఎంత వరకు పుంజుకుంటుంది? సత్తా చాటుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే రెండేళ్ల పాలనతో కాంగ్రెస్ పనితీరుపై జనం ఎలా ఆలోచిస్తున్నారన్న విషయం ఈ ఎన్నికల ద్వారానే తేలుతుంది. అదే సమయంలో బీఆర్ఎస్ పవర్ ఫుల్ ప్రతిపక్షంగా పని చేస్తోందా లేదా అన్నది కూడా తేలబోతోంది. నిజానికి బీఆర్ఎస్ కు ప్రధాన మైనస్ పాయింట్ ఏంటంటే.. కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌజ్ కే పరిమితం కావడం. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరిగి కొన్నినెలలు గడిచాయి. భారీ బహిరంగ సభలో ఇకపై జనంలోనే ఉంటానని కేసీఆర్ చెప్పారు. ఏప్రిల్ లో జరిగిన ఈ సభ తర్వాత కేసీఆర్ జనంలోకి ఎక్కడా రాలేదు. అదే సమయంలో బీఆర్ఎస్ లోనూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవితల మధ్య ఆధిపత్య పోరు జనంలో డివైడ్ టాక్ కు కారణమవుతోంది. ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటుండడం మైనస్ గా మారుతోంది. ఫ్యామిలీ గ్రూప్ వార్ నడుస్తుండడంతో క్యాడర్ కూడా నిరుత్సాహంగా కనిపిస్తున్నారు. వారిలో జోష్ రావడం లేదు. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ కారు ఎలా ముందుకు వెళ్తుందన్నది కీలకంగా మారుతోంది. స్థానిక సమస్యలను ప్రస్తావించినా కథ మారుతుందా లేదా అన్నది చూడాలి.

Also Read: రాష్ట్రంలో కుమ్మేస్తున్న వర్షం.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే ఛాన్స్!

బీజేపీ కూడా చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. పంచాయతీ లోకల్ బాడీ ఎన్నికలకు ముందు గతంలో బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న నేతలను గాలం వేస్తోంది. ఇప్పటికే గువ్వల బాలరాజు బీజేపీలో జాయిన్ అయ్యారు. అన్ని జిల్లాల్లోని బీఆర్ఎస్ నేతల్లో కొందరు బీజేపీతో టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. వారు కూడా ముహూర్తం చూసుకుని కమలం పార్టీలో జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటు లోకల్ బాడీ ఎన్నికల్లో సాధారణంగా ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఎడ్జ్ సహజంగానే ఉంటుంది. ఎందుకంటే అధికార పార్టీలో ఉంటే అభివృద్ధి పనులు, నిధుల ప్రవాహం వేగంగా ఉంటుందన్న లెక్క జనంలోనూ ఉంటుంది. అయితే ఈ కలిసి వచ్చే అంశాలను హస్తం పార్టీ ఎలా అందిపుచ్చుకుంటుందో చూడాలి.

Story By Vidya Sagar, Bigtv

Related News

Pocharam Dam: డేంజర్‌లో పోచారం డ్యామ్.. 10 ఊర్లు ఖతమ్..!

Kamareddy floods: తెలంగాణలో వర్ష బీభత్సం.. నీట మునిగిన కామారెడ్డి పట్టణం, రెసిడెన్షియల్ విద్యార్థులు సేఫ్

Schools holiday: ఆ జిల్లాలలో రేపు పాఠశాలలకు సెలవు.. బయటికి రావద్దంటూ హెచ్చరిక!

Hyderabad fire accident: హైదరాబాద్‌లో మళ్లీ అగ్ని అలజడి.. పెట్రోల్ బంక్‌లో మంటలు.. ఆ తర్వాత?

Aghapur Ganesh: గణపయ్య ఈసారి సీఎం రేవంత్ లుక్‌లో.. అఘాపూర్‌లో అలరించే విగ్రహం!

Big Stories

×