Oshane Thomas : సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడు ఏ ఆటగాడు విజృంభిస్తాడో ఊహించడం ఇప్పుడు కష్టంగా మారింది. ముఖ్యంగా ఎప్పుడూ ఏ బ్యాట్స్ మెన్ రెచ్చి పోతున్నాడో తెలియడం లేదు. ఈ మధ్య కాలంలో కేవలం ఒకే ఒక్క ఒక్క బంతికి 13, 15, 22 పరుగులు కూడా చేశారు. అలా చేయడానికి బౌలర్లు కూడా ఒక కారణం అనే చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో నోబాల్స్, వైడ్, నోబాల్స్ వేయడంతో ఒక్క బంతికే ఎక్స్ ట్రా పరుగుతు తెగ వచ్చేస్తున్నాయి. సెయింట్ లూసియా కింగ్స్ వర్సెస్ గయానా అమెజాన్ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే.. అంతకంటే ముందు 2024 లో థామస్ ఒక్క బంతికే 15 పరుగులు సమర్పించుకున్నాడు.
Also Read : Virender Sehwag son : సెహ్వాగ్ కుమారుడి బ్యాటింగ్ చూశారా.. తండ్రిని మించిపోయి ఆడుతున్నాడుగా.. ఇదిగో వీడియో
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) లో సెయింట్ లూసియా టీమ్ బౌలర్ థామస్ నోబాల్స్ వేయడంతో గయానా అమెజాన్ వారియర్స్ బ్యాటర్ షెఫర్డ్ సిక్స్ లుగా మలిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కి ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ తొలి టైటిల్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా SLKకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒషానే థామస్ ఇన్నింగ్స్ 15వ ఓవర్ లో తన లయను పూర్తిగా కోల్పోయాడు. క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఓవర్లలో ఒక్క బంతిని డెలివరీ చేయడానికి ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్నాడు. వెస్టిండీస్ ఆల్ రౌండర్ షెఫర్డ్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో అద్భుతమైన ప్రదర్శన చేసాడు. గయానా అమెజాన్ వారియర్స్ జట్టు తరపున సత్తా చాటాడు. సెయింట్ లూసియా జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఈ భారీ హిట్టర్ ఒక్క బంతికే 22 పరుగులు చేయడం విశేషం. వాస్తవానికి 15వ ఓవర్ లో థామస్ వేసిన మూడో బంతి నోబాల్ అయింది. ఈ బంతికి షెఫర్డ్ పరుగులు చేయలేదు. ఆ తరువాత ఫ్రీ హిట్ వైడ్ గా వెళ్లింది. తరువాత వేసిన ఫ్రీ హిట్ ను కూడా భారీ సిక్స్ గా మలిచాడు. దరిద్రం ఏంటంటే..? అది కూడా నో బాలే కావడం గమనార్హం.
చరిత్రలో నిలిచిన థామస్-షెఫర్డ్..
ఇక ఆ తరువాత బంతిని కూడా బౌండరీ బయటికి తరలించాడు. కానీ అక్కడ దురదృష్టం మరోసారి బౌలర్ ని వెంటాడింది. అది కూడా నోబాల్ కావడంతో మూడో ఫ్రీ హిట్ ను షెఫర్డ్ ఉపయోగించుకొని సునాయసంగా సిక్స్ కొట్టాడు. దీంతో ఒక్క లీగల్ డెలివరీకి మొత్తం 22 పరుగులు వచ్చాయి. ఇక ఆ ఓవర్ ముగిసే సమయానికి థామస్ 33 పరుగులను సమర్పించుకున్నాడు. ఇప్తికర్ అహ్మద్ చివరి బంతికి సిక్సర్ కూడా కొట్టాడు. టీ-20 చరిత్రలో ఒకే డెలివరీలో 20కి పైగా పరుగులు ఇచ్చిన బౌలర్ గా థామస్.. ఒక లీగల్ బాల్ లో మూడు సిక్సర్లు కొట్టిన తొలి బ్యాటర్ గా షెఫర్డ్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ మ్యాచ్ లో షెఫర్డ్ 34 బంతుల్లో 73 పరుగులు చేయడంతో గయానా అమెజాన్ వారియర్స్ 202 పరుగులు చేసింది. అనంతరం 203 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన లూసియా కింగ్స్ జట్టు 18.5 ఓవర్లలోనే ఛేదించింది. అఖీమ్ అగస్టీ 35 బంతుల్లో 75 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. థామస్ వేసిన బంతి చరిత్రలో మిగిలిపోయేలా చేసింది.
Oshane Thomas, who conceded 15 runs off a single legal delivery in the BPL 2024, has once again conceded 22 runs off one ball in the CPL 2025.
📸: FanCode pic.twitter.com/nohx4FxywG
— CricTracker (@Cricketracker) August 28, 2025