BigTV English

Scorpion: తేలు విషం లీటరు రూ.80 కోట్లా? ఇంతకీ దానితో ఏం చేస్తారు?

Scorpion: తేలు విషం లీటరు రూ.80 కోట్లా? ఇంతకీ దానితో ఏం చేస్తారు?

Scorpion: మనకి తేలు కనిపిస్తే భయంతో పారిపోతాం లేదా చంపడానికి ప్రయత్నిస్తాం. చిన్నగా కనిపించే ఈ ప్రాణి విషం ప్రాణహానికే కారణమవుతుందని అందరికీ తెలుసు. కానీ అదే విషం లీటరుకు 80 కోట్లకుపైగా ధర పలుకుతుందని విన్నారా? అవును… ఒక లీటరు తేలు విషం బంగారం, వజ్రాలు, ప్లాటినం అన్నింటికి మించి విలువ కలిగి ఉంటుంది. ఆ విలువ ఎందుకు అంత ఆకాశాన్నంటుతుందో ఇప్పుడు చూద్దాం.


మొదటగా తేళ్ల రకాలను గురించి తెలుసుకుందాం

ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 రకాల తేళ్లు ఉన్నాయి. వాటిలో 30 నుంచి 40 జాతులే మనిషికి ప్రమాదకరంగా మారతాయి. అందులో ముఖ్యంగా డెల్టాకర్ జాతి తేలు విషం లీటరుకు 80 కోట్లకు పైగా ధర పలుకుతుంది. మిగతా జాతుల విషం కూడా కోట్ల రూపాయలలోనే కొనుగోలు చేస్తారు. అయితే ఇంత ఖరీదుగా ఎందుకు ఉంది? అని ప్రశ్నలు ఎదురవుతున్నాయి.


విషం తీయాలంటే చాలా కష్టం

ఒక తేలు నుంచి ఒకసారి విషం తీసుకుంటే కేవలం 2 మిల్లీగ్రాముల వరకే దొరుకుతుంది. అంటే ఒక లీటర్ సేకరించాలంటే లక్షల సార్లు తేలు నుంచి విషం తీయాల్సి ఉంటుంది. వేల రోజులు శ్రమించకపోతే అది సాధ్యం కాదు. అందువల్లే దీని విలువ ఆకాశాన్ని అంటుతోంది.

వైద్య పరిశోధనల్లో తేలు విషయం

ఈ విషం వైద్య పరిశోధనల్లో అద్భుతమైన ఫలితాలు చూపిస్తోంది. శాస్త్రవేత్తలు తేలు విషంలో ఉండే ప్రోటీన్లు, పెప్టైడ్లు ఈ రెండు ప్రోటీన్ల నిర్మాణానికి సహాయ పడతాయి. శరీరంలోని హానికర కణాలను గుర్తించి దాడి చేస్తాయని కనుగొన్నారు.

Also Read: Mobile Phones: మొబైల్‌తో ఇలా చేస్తున్నారా? మీరు రిస్క్‌లో ఉన్నట్లే!

క్యాన్సర్‌ను నివారించేందుకు

తేలు విషయం ముఖ్యంగా క్యాన్సర్ ట్యూమర్లపై ఈ విషం ప్రభావం చూపుతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. విషంలోని కొన్ని పదార్థాలు ట్యూమర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటున్నాయి. ఇదే కాదు, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధుల పరిశోధనలో కూడా ఇది ఉపయోగపడుతోంది. తేలు విషంలోని పదార్థాలు దోమల ద్వారా వ్యాపించే మలేరియా పరాన్నజీవులను అరికట్టే సామర్థ్యం కలిగి ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే డయాబెటిస్ చికిత్సలో కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుందని ప్రయోగాలు సూచిస్తున్నాయి. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడంలో సహాయపడే అవకాశాలు ఉన్నాయి.

అందుకే తేలు విషం ధర 80 కోట్లు

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, తేలు విషం నొప్పిని తగ్గించే శక్తివంతమైన పదార్థాలను కలిగి ఉంటుంది. ఇవి మానవ శరీరానికి వ్యసనాన్ని కలిగించకుండా, సహజమైన పద్ధతిలో నొప్పిని నియంత్రిస్తాయి. అంటే భవిష్యత్తులో తేలు విషం ఆధారంగా కొత్త రకాల పెయిన్ కిల్లర్లు తయారయ్యే అవకాశం ఉంది. అంతేగాక, ఈ విషం నుండి తయారయ్యే ఔషధాలు మనిషి ఆరోగ్య రంగాన్ని పూర్తిగా మార్చే స్థాయిలో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా లాబొరేటరీలు, ఔషధ సంస్థలు దీన్ని కొనేందుకు పోటీ పడుతున్నాయి. ఫలితంగా ఒక లీటరుకు ధర 80 కోట్లను దాటేస్తోంది.

భవిష్యత్తులో ప్రాణ రక్షక మందులు

కానీ సాధారణంగా మనకు తెలిసింది మాత్రం తేలు కాటు అంటే భయం. కానీ అదే విషం భవిష్యత్తులో ప్రాణరక్షక మందులుగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఇక్కడే ప్రకృతిలో దాగి ఉన్న అద్భుతం తెలుస్తుంది. మనకు హానికరమని అనుకున్నది సరైన రీతిలో ఉపయోగిస్తే మానవజాతికి వరంగా మారుతుంది. అందుకే తేలు విషం బంగారంకన్నా, వజ్రంకన్నా విలువైనది. కేవలం ప్రాణాంతకమని కాకుండా ప్రాణరక్షకమని నిరూపించుకుంటూ ప్రపంచ వైద్య రంగంలో కొత్త ఆశలను నింపుతోంది.

Related News

Rajasthan Woman: 17వ బిడ్డకు జన్మనిచ్చిన 55 ఏళ్ల మహిళ.. ఇప్పటికైనా యుద్ధం ఆపుతారా?

Monkey incident: చెట్టెక్కిన కోతి.. కింద కురిసిన నోట్ల వర్షం.. ఎంత అదృష్టమో!

Viral Video: ఇంటర్వ్యూలో అడ్డంగా బుక్కైన తెలుగు అమ్మాయి!

Viral News: ఆ చికెన్ మీద మనసు పడ్డ బ్లాక్ పింక్ లిసా, వరల్డ్ వైడ్ గా వైరల్ అంతే!

Viral News: ఒక్క రోజు రెస్టారెంట్ బిల్లు కోటి రూపాయలా? బంగారం ఏమైనా తిన్నార్రా బాబూ?

Big Stories

×