Rain update: తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అల్పపీడనం ఏర్పడిన కారణంగా రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి, మెదక్ జిల్లాలు ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. కామారెడ్డి పట్టణం జలదిగ్భందంలో చిక్కుకుంది. ఎటుచూసినా పట్టణంలో వరద నీరు కనిపిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. వాగులు, వంకలు పొంగి పొంగిపొర్లుతున్నాయి. పంట పొలాలు, నివాస ప్రాంతాలు చెరువులను తలపించే కనిపించాయి. ఒకవిధంగా చెప్పాలంటే నీటిలో కామారెడ్డి పట్టణం విలవిలలాడుతోంది. కామారెడ్డి – భిక్కనూర్ మార్గంలో రైలు పట్టాల కింద వరద పోటెత్తింది. ఫలితంగా భారీగా గండి పడింది. పరిస్థితి గమనించిన అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలను మరోసారి అలర్ట్ చేసింది.
తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయని హెచ్చరించింది. తెలంగాణలో 20 సెంటీ మీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నాలుగు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.స
ALSO READ: PGCIL Notification: పీజీసీఐఎల్‌లో 1543 ఉద్యోగాలు.. లక్షకు పైగా జీతం, ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు..!
వికారాబాద్, ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. పశువుల కాపరులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా తెలంగాణ, మహారాష్ట్రకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు రెంజల్ రోడ్డు మార్గాన్ని నిలిపివేశారు. నిర్మల్ జిల్లా భైంసాలో కుండపోత వర్షం పడుతోంది. ఇప్పటికే భైంసా పట్టణం నీటమునిగింది. బస్టాండ్ తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వరద నీరు వచ్చి చేరింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.
ALSO READ: BOM Jobs: ఇది అద్భుతమైన అవకాశం.. డిగ్రీతో భారీగా ఉద్యోగాలు.. డోంట్ మిస్
తెలంగాణలో భారీ వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో 17.1 సెంటీ మీటర్ల వర్షపాతం, నిజామాబాద్ జిల్లా తూంపల్లిలో 16.2 సెంటీ మీటర్ల వర్షపాతం, కల్దుర్కిలో 15, కరీంనగర్ జిల్లా పోచంపల్లిలో 13.7 సెంటిమీటర్ల వర్షపాతం, నిజామాబాద్ జిల్లా చిమన్ పల్లిలో 13.2, నిజామాబాద్ జిల్లా మదనపల్లెలో 11.7 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
డ్రోన్ విజువల్స్
భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలమైన కామారెడ్డి జిల్లా pic.twitter.com/Zvt7D7pkTq
— BIG TV Breaking News (@bigtvtelugu) August 28, 2025