E-Paper
Advertisement

Madhu Yashki Goud: నీలాగా రాజభోగాలు అనుభవించేందుకు నాకు ఫామ్ హౌస్ లేదు కేటీఆర్: మధుయాష్కీ

Madhu Yashki Goud: నీలాగా రాజభోగాలు అనుభవించేందుకు నాకు ఫామ్ హౌస్ లేదు కేటీఆర్: మధుయాష్కీ
Advertisement

Madhu Yashki Goud Comments: రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. నగరంలోని అక్రమ కట్టడాలను గుర్తించి వాటిని కూల్చివేస్తున్నది హైడ్రా. ఈ నేపథ్యంలో ఇటు ప్రతిపక్ష, అధికార పక్ష పార్టీల నేతల మధ్య రాజకీయ మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఈ క్రమంలో కేటీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నీలాగా రాజభోగాలు అనుభవించేందుకు నాకు ఫామ్ హౌస్ లేదు కేటీఆర్. వారానికి నాలుగు సార్లు వెళ్లి ఎంజాయ్ చేయడానికి నీకు జన్వాడలో ఫామ్ హౌస్ ఉంది. 111 జీవోకు వ్యతిరేకంగా నిర్మించిన నీవు.. ఆ ఫామ్ హౌస్ ను బినామీ పేర్లతో మెయింటెన్ చేస్తున్నావ్. నీలాగా నాకు అలా విలాసవంతమైన ఫామ్ హౌస్ లు లేవు కేటీఆర్.

Advertisement

Also Read: ఎన్ కన్వెన్షన్‌కు ఆ అనుమతులు లేవు.. అందుకే కూల్చేశాం: హైడ్రా కమిషనర్

నేను ప్రజల్లో ఉండేటోన్ని.. అందరిలా సాధారణ జీవితాన్ని లీడ్ చేస్తాను. మాకు గండిపేట దగ్గర మామిడి తోట, సపోటా తోట ఉన్న మాట వాస్తవం. అక్కడ వాచ్ మెన్ కుటుంబం ఉండడం కోసం పాతబడిన చిన్న నిర్మాణం తప్ప.. ఫామ్ హౌస్ లేదు. అయినా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో వ్యవసాయం, తోటల పెంపకం చేయొచ్చు అనే కనీస అవగాహన నీకు లేనట్లుంది. కానీ, నాకు ఫామ్ హౌస్ ఉన్నట్లు.. అది ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో ఉన్నట్లు కేటీఆర్ ఇటీవల పలుమార్లు ప్రస్తావించడం సిగ్గుచేటు. నాకు ఫామ్ హౌస్ ఎక్కడ ఉందో.. ఎంత విలాసంగా నిర్మించుకున్నానో కేటీఆరే చూపించాలి. అబద్దాలు, చిల్లర మాటలు మాట్లాడడం ఇకనైనా మానుకో కేటీఆర్’ అంటూ కేటీఆర్ పై మధుయాష్కీ సీరియస్ అయ్యారు.

Related News

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

Big Stories

Advertisement
×