BigTV English

MallaReddy: డీజే టిల్లుతో మంత్రి మల్లారెడ్డి నాటు నాటు..

MallaReddy: డీజే టిల్లుతో మంత్రి మల్లారెడ్డి నాటు నాటు..

MallaReddy: మంత్రి మల్లారెడ్డి. మాస్ లీడర్. ఫైర్ బ్రాండ్ మినిస్టర్. ఆయన భాష.. భావం.. అంతా పక్కా తెలంగాణ స్టైల్. మల్లన్న ముచ్చట్లు, చేష్టలు.. అంతా డిఫరెంట్. మంత్రిననే బిల్డప్ కనిపించదు. మాటలు పక్కా లోకల్. డైలాగులు, డ్యాన్సులతో ఇరగదీస్తుంటారు. లేటెస్ట్ గా.. డీజే టిల్లుతో కలిసి అదే సాంగ్ కు మాస్ స్టెప్పులు వేశారు.


హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. మంత్రి మల్లారెడ్డి వేడుకలను నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ వచ్చారు. కాసేపు విద్యార్థులతో మాట్లాడారు. పలు ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత అస్సలు సీన్ మొదలైంది.

డయాస్ మీద డీజే టిల్లు సాంగ్ ప్లే చేశారు. హీరో సిద్ధు.. మంత్రి మల్లారెడ్డిని ఆహ్వానించారు. ఇద్దరూ కలిసి టైటిల్ సాంగ్ కు స్టెప్పులేశారు. ఆ స్టెప్స్ వేసేందుకు మల్లారెడ్డి ఇబ్బందిపడుతుంటే.. సిద్దూనే ఆయనకు డ్యాన్స్ చేసి చూపించారు. తాను చేసినట్టే చేయండంటూ ఎంకరేజ్ చేస్తూ.. ఇద్దరూ కలిసి మాస్ సాంగ్ కు మాంచి స్టెప్పులతో ఇరగదీశారు.


హీరో సిద్దు.. మంత్రి మల్లారెడ్డి.. వారిద్దరూ అలా స్టెప్పులేస్తూ.. కేక పెట్టించారు. స్టూడెంట్స్ గోలగోల చేశారు. విజిల్స్, అరుపులతో హంగామా చేశారు. మల్లన్న, టిల్లన్న స్టెప్పులతో మల్లారెడ్డి యూనివర్సిటీ హోరెత్తింది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మల్లన్న డ్యాన్స్ మీరూ చూసేయండి…

Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×