E-Paper
Advertisement

MPDO Promotions: ఏడాదిగా ప్రమోషన్స్ కోసం ప్రభుత్వానికి ఫైల్.. ఆశతో ఎదురుచూస్తున్న ఉద్యోగులు

MPDO Promotions: ఏడాదిగా ప్రమోషన్స్ కోసం ప్రభుత్వానికి ఫైల్.. ఆశతో ఎదురుచూస్తున్న ఉద్యోగులు
Advertisement

MPDO Promotions: స్వేఛ్చ బ్యూరో: మండల పరిషత్ అభివృద్ధి అధికారులు(ఎంపీడీఓ)లు ఏళ్లుగా ప్రమోషన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకు సంబంధించిన ఫైల్ జీఏడీకి చేరి ఏడాది గడుస్తుంది. అయినప్పటికీ ఆ ఫైల్ కదలిక లేకపోవడంతో ఎంపీడీఓలు నైరాశ్యానికి గురవుతున్నారు. అర్హతలు ఉండి.. అనుభవం ఉన్నప్పటికీ పదోన్నతులు రావడం లేదని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పైల్ కు మోక్షం కలుగకపోవడం ఇప్పుడు చర్చకుదారితీసింది.

10 మంది డిప్యూటీ సీఈవోలకు..

రాష్ట్ర ప్రభుత్వం ఎంపీడీవోల ప్రమోషన్స్​ కోసం కసరత్తు చేస్తున్నది. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా 48 మంది ఎంపీడీఓలు సీనియర్లుగా ఉన్నారని పంచాయతీరాజ్ శాఖ లిస్టును రూపొందించింది. ఎంపీడీలకు డిప్యూటీ సీఈఓలుగా పదోన్నతిరానుంది. అదే విధంగా 10 మంది డిప్యూటీ సీఈవోలకు సీఈవోలుగా ప్రమోషన్స్​ వచ్చే అవకాశం ఉన్నది. 2019 నుంచి 2022 వరకు ఎంపీడీవోలకు ప్రమోషన్​ ప్రక్రియ కొనసాగింది. ఆ తర్వాత నుంచి ప్రమోషన్స్​ ఊసేలేకుండా పోయిందని అధికారులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమోషన్స్​ కు సంబంధించిన ఫైల్​ లో కదలిక వచ్చింది. ప్రభుత్వ ఆదేశాలమేరకు ఉద్యోగుల వివరాలను పంచాయతీరాజ్ శాఖ సిద్ధం చేసింది నివేదికను సమర్పించింది.

Advertisement

Also Read: Congress : రెబల్స్ కోసం నామినేటెడ్ అస్త్రం..?

ఫైల్ కు ఏడాది?

పంచాయతీరాజ్ లో పనిచేస్తున్న ఎంపీడీఓల వివరాలను ప్రభుత్వానికి ఆ శాఖ అధికారులు అందజేశారు. ఆ సీనియర్ లిస్టు ఫైల్ ను అందజేసి ఏడాది కంప్లీట్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. అయినప్పటికీ ఇప్పటివరకు ఆ ఫైల్ లో కదలిక రాలేదు. జీఏడీలోనే నిలిచినట్లు సమాచారం. పలుమార్లు అధికారులు సైతం ప్రభుత్వానికి విజ్ఞప్తు లు సైతం చేసినట్లు తెలిసింది. ప్రమోషన్ల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. కొంతమంది నైరాశ్యానికి గురవుతున్నారు. ఇంకొంతమంది చేసే పనులపై కాన్సంట్రేషన్ పెట్టలేకపోతున్నట్లు సమాచారం.

సీఎం రేవంత్ రెడ్డి జోక్యం

Advertisement

ఇదెలా ఉంటే ఏడాదిగా ప్రమోషన్ల పెండింగ్ లో ఉండటానికి కారణాలు ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. గ్రామపంచాయతీ ఎన్నికలురావడంతో పెండింగ్ లో పెట్టారా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా? అనేది ఇప్పుడు ఉద్యోగుల్లోనే చర్చకు దారితీసింది. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటే తప్ప ప్రమోషన్ల ఫైల్ కదిలే అవకాశం లేదనేది పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు సీఎం దృష్టికి తీసుకెళ్లేదెవరు? ఫైల్ కదిలేదెప్పుడు అనేది ఇప్పుడు చర్చజరుగుతుంది.

Also Read: Ram Charan Twins: క్లింకార బాటలోనే కవలలు.. ఆ ‘మేజిక్ నంబర్’ వెనుక ఉన్న రహస్యం ఇదే..

Related News

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

Big Stories

Advertisement
×