BigTV English

Oyo Hotel: ఓయో హోటల్ రూమ్‌.. సీక్రెట్ కెమెరాలు.. జంట ఏకాంత వీడియోలు తీసి..

Oyo Hotel: ఓయో హోటల్ రూమ్‌.. సీక్రెట్ కెమెరాలు.. జంట ఏకాంత వీడియోలు తీసి..

Oyo Hotel: హోటల్‌కు వచ్చే కస్టమర్లను ఆకట్టుకోవాల్సిన నిర్వాహకులు ఓ జంట ఏకాంత వీడియోలు తీశారు. వాటిని చూపించి డబ్బులు గుంజేందుకు ప్రయత్నించారు. చివరకు ఆ జంట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు యవ్వారం బయటపడింది. సంచలనం రేపిన ఈ వ్యవహారం హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.


మెట్రోపాలిటిన్ సిటీల్లో హైదరాబాద్ ఒకటి. ఇక్కడకు వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది వస్తుంటారు. అందులో పర్యాటకులు ఎక్కువ భాగం. టూరిస్టులు ట్రాన్స్‌ఫోర్టుకు అనువుగా ఉండే ప్రాంతాల్లోని హోటల్స్‌లో దిగుతారు. ఓ జంట కూడా అదే చేసింది.

హైదరాబాద్‌ని చూడటానికి ఓ జంట వచ్చింది. శంషాబాద్ వద్ద ఓయో హోటల్‌లో రూమ్‌ తీసుకుంది. గదిలో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయన్న విషయం ఆ జంటకు తెలియలేదు. ఏకంతంగా ఉన్న సమయంలో వారి వీడియోలు తీశారు నిర్వాహకులు. ఏకాంత వీడియోలు చూపించి వారిని వేధింపులకు గురి చేశారు.


Also read: సంచలన నిర్ణయం.. హైడ్రా పేరిట కొత్త చట్టం

చివరకు ఆ జంట పోలీసులను ఆశ్రయించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. వేర్వేరు రూముల్లో ఫిక్స్ చేసిన హిడెన్ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. చివరకు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి నుంచి రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఫోన్‌లో ఇంకెన్ని జంటలకు సంబంధించిన వీడియోలు ఉన్నాయో తెలీదు. ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. తీగలాగితే ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

 

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×