IRCTC Faster Ticket Booking| రైలు ప్రయాణం కోసం టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ప్రయాణీకులకు ఎదురయ్యే సమస్యలను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) త్వరలోనే పరిష్కరించబోతోంది. ఇకపై ఆన్ లైన్ లో ట్రైన్ టికెట్ బుకింగ్ కోసం గంటల సమయం పట్టదు.
ఆన్ లైన్ లో ట్రైన్ టికెట్ బుకింగ్ కోసం ఐఆర్‌సిటిసి కొత్త బుకింగ్ సిస్టమ్ తీసుకురానుంది. ఈ కొత్త సిస్టమ్ తో టికెట్ బుకింగ్ ఇన్సటంట్ గా ప్రారంభమవుతుంది, ప్రయాణీకుడికి టికెట్ వెంటనే లభిస్తుంది. పైగా టికెట్ బుకింగ్ జరగకుండానే పేమెంట్ జరిగిపోవడం.. ఆ తరువాత టికెట్లు లభించకపోవడం అనేది ఇకపై జరగదు.
రైలు ప్రయాణం కోసం టికెట్లు బుక్ చేసుకునేవారు బుకింగ్ కోసం ఎదురు చూడాల్సి వస్తోందని, టికెట్ బుకింగ్ జరగకుండా పేమెంట్ జరిపోవడం, చాలా సార్లు కన్‌ఫర్మ్ టికెట్ల కోసం వెయిటింగ్ టైమ్ పెరిగిపోయి.. బుకింగ్ మధ్యలో పేమెంట్ ఫెయిల్ అవడం లాంటి సమస్యలు ఎక్కువగా కావడంతో కొత్త సిస్టమ్ తీసుకొస్తామని ఐఆర్‌సిటిసి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ జైన్ ఇటీవలే తెలిపారు.
రైలు టికెట్ల బుకింగ్ లో ఎక్కువ సార్లు ఆలస్యం కావడానికి ముఖ్య కారణం.. బుకింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ మంది ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సంజయ్ జైన్ చెప్పారు.
రైల్వే శాఖ రిపోర్ట్స్ ప్రకారం.. ప్యాసెంజర్లు, ఏజెంట్లు టికెట్ బుకింగ్స్ కలిపి ప్రతిరోజు తొమ్మిది లక్షల టికెట్లు ఆన్ లైన్ ద్వారా బుకింగ్ జరుగుతున్నాయి. నిత్యం దేశంలో రెండు కోట్ల మంది రైలు ప్రయాణం చేస్తున్నారు.
Also Read: ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. ఈపీఎఫ్ పరిమితి పెంపు యోచనలో కేంద్రం!
అయితే 2023లో ఇండియన్ రైల్వేస్ టికెట్ బుకింగ్ కెపాసిటీని నిమిషానికి 25 వేల టికెట్లు నుంచి 2.25 లక్షలకు పెంచాలని నిర్ణయించింది. ప్యాసెంజర్ రిజర్వేషన్ సిస్టమ్ ని మరింత అభిృద్ధి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణో టికెట్ బుకింగ్ సిస్టమ్ సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ ని ప్రయాణీకుల సౌకర్యం కోసం రైల్వే శాఖ అప్ గ్రేడ్ చేయబోతున్నట్లు తెలిపారు. టికెట్ బుకింగ్ అప్ గ్రేడ్ వివరాలు ఆర్థిక మంత్రిత్వ శాఖ కు అందించామని అందుకోసమే కేంద్ర ప్రభుత్వం రైల్వే బడ్జెట్ కేటాయింపులను పెంచిందని ఆయన వివరించారు.
మరోవైపు రైలు ప్యాసింజర్లకు ప్రయాణ సమయంలో భోజన విషయంలో ఎదురవుతున్న సమస్యలపై రైల్వే శాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇటీవల ఒక ప్రయాణీకుడి ఆహారంలో ప్లాస్టిక్ వైర్, పురుగులు వచ్చాయని ఫిర్యాదులు అందడంతో క్యాటరింగ్ కాంట్రాక్టర్ కు రూ.10 లక్షల జరిమానా విధించింది. ముఖ్యంగా దెహ్రాదూన్ శతాబ్ది ట్రైన్ లో ప్రయాణికుడికి పరోటా లో ప్లాస్టిక్ వైర్ వచ్చిన ఘటనలో కాంట్రాక్టర్ బేస్ కిచెన్ కు మూతపడింది.
Also Read: మీ IRCTC అకౌంట్ ద్వారా ఫ్రెండ్స్, ఫ్యామిలీకి టికెట్స్ బుక్ చేస్తే జైలుకు వెళ్తారా? నిజం ఏమిటి?