E-Paper
Advertisement

Prabhakar Rao Surrender: ఫోన్ ట్యాపింగ్ కేసులో.. ప్రభాకర్ రావు సరెండర్

Prabhakar Rao Surrender: ఫోన్ ట్యాపింగ్ కేసులో.. ప్రభాకర్ రావు సరెండర్
Advertisement

Prabhakar Rao Surrender: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరిగింది. మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావు ఈరోజే సిట్ ముందు సరెండర్ కానున్నారు. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో.. ఈ కేసు వేగంగా కీలక దశలోకి అడుగుపెట్టింది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ.. ప్రభాకర్ రావు గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ధర్మాసనం ఆయన అభ్యర్థనను పరిశీలించిన తర్వాత ముందస్తు బెయిల్ నిరాకరించి, ఆయన తప్పనిసరిగా దర్యాప్తు అధికారుల ముందు హాజరుకావాలని ఆదేశించింది.

Advertisement

ప్రభాకర్ రావు నేడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లోని ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణాధికారి, ఏసీపీ వెంకటగిరి ఎదుట హాజరవుతారని సమాచారం. సరెండింగ్ అనంతరం ఆయనను సిట్ అధికారికంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

తాజా పరిణామాలతో ప్రభాకర్ రావు అరెస్టు ఇప్పుడు దాదాపు ఖాయమే అనే అభిప్రాయం న్యాయవర్గాల్లో వినిపిస్తోంది. ఈ కేసులో ప్రభాకర్ రావును సిట్ ప్రధాన సూత్రధారిగా పరిగణిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వివాదం బయటపడిన తరువాత, ఆయన పాత్రపై సిట్ అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. ఖచ్చితమైన ఆధారాలను సేకరించేందుకు గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ, గతంలో ట్యాపింగ్ విచారణలో ప్రభాకర్ రావు సిట్‌కు.. సరైన సమాధానాలు వెల్లడించడం లేదని అధికారులు తెలిపారు. అతడి ఐ ఫోన్ డేటా సైతం డిలిట్ చేశారని సిట్ అధికారులు తెలిపారు.

Advertisement

ఈ కేసులో గతంలో అరెస్ట్ అయ్యి బెయిల్ పై బయటికి వచ్చిన వారు.. మాజీ టాస్క్‌ఫోర్స్ DCP రాధాకిషన్ రావు, తిరుపతన్న, ప్రణీత్ రావుఈ ముగ్గురినీ సిట్ అనేకసార్లు ప్రశ్నించింది. కాగా సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన నేపధ్యంలో, సిట్ ఇప్పుడు ప్రభాకర్ రావుపై కస్టోడియల్ దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఆ విచారణలో ఏమైనా కొత్త వివరాలు వెలికి తీయగలదా? ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి?
ఎవరెవరికి ఈ వ్యవహారంపై స్పష్టమైన సమాచారం ఉంది? అన్న అంశాలు బయటపడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

 

Related News

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

Big Stories

Advertisement
×