Special Trains: తిరుమల శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతి వెళ్లే ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా వరుస సెలవులు వస్తుండడంతో తిరుపతి వెళ్లేవారికి కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. హైదరాబాద్ నుంచి నిత్యం వేల సంఖ్యలో తిరుపతికి వెళ్తుంటారు. దీంతో తిరుపతి వెళ్లే రైళ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. పండుగల నేపథ్యంలో రైల్వే శాఖ ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.
చర్లపల్లి-తిరుపతి(07031) మధ్య డిసెంబర్ 19 నుంచి జనవరి 2 ప్రత్యేక రైలు నడపనున్నారు. ఈ రైలు చర్లపల్లిలో సాయంత్రం 3.30 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 6.40 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి-చర్లపల్లి (రైలు నెంబర్ :07000) ఈ నెల 16 నుంచి 30 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతీ మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు తిరుపతిలో ఈ రైలు బయల్దేరి ఆ తర్వాతి రోజు ఉదయం 8.15 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
పంధర్‌పూర్-తిరుపతి (07032) రైలు డిసెంబర్ 21 నుంచి జనవరి 4 వరకు నడపనున్నారు. ఈ రైలు పంధర్‌పూర్‌లో రాత్రి 8.00 గంటలకు బయల్దేరి తర్వాత రోజు రాత్రి 10.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైళ్లు దాదాపు అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి.
న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. డిసెంబర్ 24 నుంచి 30 వరకు చర్లపల్లి-కాకినాడ(07196) మధ్య మంగళ, బుధవారాల్లో ఈ సర్వీస్ అందుబాటోలు ఉంటుంది. ఈ నెల 28 నుంచి 31 వరకు కాకినాడ టౌన్-చర్లపల్లి (07195) రైలు ఆది, బుధవారాల్లో సాయంత్రం 7.30 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయి. ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్ల మీదగా రాకపోకలు సాగిస్తాయి.
Also Read: IndiGo voucher: ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వారికి రూ.10 వేల వోచర్
న్యూ ఇయర్,సంక్రాంతి పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్ల రాకపోకలను పొడిగించింది.