Big Stories

PM Modi on Health Scheme: 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత వైద్యం: ప్రధాని మోదీ

70 Years Crossed People will Free Health Said By Prime Minister Modi: దేశ భవిష్యత్తు కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. మోదీ గ్యారంటీ అంటే ప్రపంచంలో భారత గుర్తింపునకు గ్యారెంటీ అని.. మోదీ గ్యారెంటీ అంటే అభివృద్ధికి గ్యారెంటీ అని హామీ ఇచ్చారు. మోదీ గ్యారెంటీ అంటే అందరి ఆరోగ్యానికి గ్యారెంటీ అని తెలిపారు. 70ఏళ్లు పైహబడిన వృద్ధులకు ఉచిత వైద్యం అందించే గ్యారెంటీ అని హామీ ఇచ్చారు.

- Advertisement -

‘కాంగ్రెస్ చాలా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది.. కానీ బీఆర్ఎస్ కు కాపీలా తయారైంది. బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ తెలంగాణను దోచుకుంటోంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేయడం షురూ అయ్యింది. ఆర్ఆర్ ట్యాక్స్ విషయంలో నేను ఏ పేరు చెప్పకున్నా రేవంత్ రెడ్డి భుజాలు తడుముకుంటున్నారు. కాంగ్రెస్ పాలమురు జిల్లాకు నమ్మక ద్రోహం చేసింది. కాంగ్రెస్ దేశాన్ని విభజించే కుట్ర చేస్తోంది. కాంగ్రెస్ ఫేక్ వీడియోల పరిశ్రమ షురూ చేసింది.

- Advertisement -

కాంగ్రెస్ లోని యువరాజు ఎన్నికల ముందు ప్రేమ దుకాణం తెరుస్తాడు. కాంగ్రెస్ కూటమి అబద్ధపు హామీలిస్తోంది. తెలంగాణకు లక్షకోట్లు ఇచ్చాం. ఆ డబ్బును కాంగ్రెస్, బీఆర్ఎస్ లూటీ చేస్తున్నాయి. అంటే ఆ డబ్బు ఎవరి జోబుల్లోకి వెళ్లిందే మీరే అర్థం చేసుకోండి. 2014లో కేసీఆర్ కు అధికారం ఇచ్చారు.. కానీ ప్రజలను ఆయన మరచిపోయారు’ అని ప్రధాని మోదీ అన్నారు.

Also Read: బీజేపీ ఎంపీ నవనీత్ రాణాపై కేసు నమోదు..

‘కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు తమ స్వార్థానికి మహబూబ్ నగర్ ప్రాంతాన్ని వాడుకున్నారు. ఈ ప్రాంతానికి కృష్ణా, తుంగభద్ర నదుల ఆశీర్వాదం ఉంది. నీటి ప్రాజెక్ట్ ల కోసం వేల కోట్లు రాష్ట్రానికి ఇస్తున్నాసరే.. వాటిని సద్వినియోగం చేసుకోలేదు. ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.

కాంగ్రెస్ యువరాజు రాజగురువు ప్రజల్ని రంగుల ఆధారంగా విభజిస్తున్నారు. శరీర రంగు ఆధారంగా దక్షిణాది వారిని ఆఫ్రికన్లు అంటున్నారు. కాంగ్రెస్ కు హిందువులు అన్నా.. వారు చేసుకునే పండుగలు అన్నా ఇష్టం లేదు. అంబేద్కర్ కూడా మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకించారు. కాంగ్రెస్ కులాలు, మతాల పేరిట దేశాన్ని విభజించాలని చూస్తోంది’ అని మోదీ కాంగ్రెస్ పార్టీపై పలు విమర్శలు చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News