Big Stories

BJP MP Navneet Rana: బీజేపీ ఎంపీ నవనీత్ రాణాపై కేసు నమోదు..!

Case Filed on BJP MP Navneet Rana: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు లోక్‌సభ ఎంపీ, అమరావతి బీజేపీ అభ్యర్థి నవనీత్ రాణాపై షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ‘కాంగ్రెస్‌కు ఓటేయడం అంటే పాకిస్థాన్‌కు ఓటేయడం’ అన్న ఆమె వ్యాఖ్యలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బీజేపీ హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత తరఫున ఆమె ఇటీవల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో ఆమె కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యడంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

“నిబంధనలను ఉల్లంఘించినందుకు FST ఫ్లయింగ్ స్క్వాడ్, EC నుంచి మాకు ఫిర్యాదు వచ్చింది. గురువారం ఫిర్యాదు అందింది. ఎన్నికల విధుల్లో ఉన్న ఈసీ ఎఫ్‌ఎస్‌టీ కృష్ణమోహన్‌ ‘రాహుల్‌ గాంధీకి ఓటేస్తే ఆ ఓటు పాకిస్థాన్‌కు పోతుంది’ అనే వ్యాఖ్యపై ఫిర్యాదు చేశారు. IPC సెక్షన్‌ 188 కింద కేసు నమోదు చేశాం” అని పోలీసులు తెలిపారు.

- Advertisement -

అంతకుముందు గురువారం, AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, అతని సోదరుడు అక్బరుద్దీన్‌పై రానా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “పోలీసులను 15 సెకన్ల పాటు విధుల నుంచి తొలగిస్తే, సోదరులు ఎక్కడ నుంచి వచ్చారో, ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదు” అని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు. తన పేరు ప్రస్తావించకుండా ఆమె వ్యాఖ్యలను ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి, ఎన్నికల అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేయాలని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పార్లమెంటు సభ్యుని అరెస్టు చేయాలని అన్నారు.

Also Read: నవనీత్‌పై కేసు పెట్టాల్సిందే, సీఎం రేవంత్‌ డిమాండ్

AIMIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ 2013లో చేసిన వివాదాస్పద ప్రసంగానికి ప్రతిస్పందనగా రానా ఈ వ్వాఖ్యలు చేశారు. దీనిలో పోలీసులను తొలగిస్తే దేశంలో “హిందూ-ముస్లిం నిష్పత్తి”ని సమతుల్యం చేయడానికి వారికి కేవలం “15 నిమిషాలు” పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థి కె మాధవీలత, ఇతరులకు మద్దతుగా రానా ప్రచారం చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News