E-Paper
Advertisement

Hyderabad News: న్యూ ఇయర్‌-2026 సెలబ్రేషన్స్.. పోలీసుల కొత్త మార్గదర్శకాలు, కేవలం డిసెంబర్‌ 21 వరకు

Hyderabad News:  న్యూ ఇయర్‌-2026 సెలబ్రేషన్స్.. పోలీసుల కొత్త మార్గదర్శకాలు, కేవలం డిసెంబర్‌ 21 వరకు

Hyderabad News: న్యూ ఇయర్-2026 వేడుకలు కేవలం మరో నాలుగు వారాలు మాత్రమే మిగిలివుంది. చాలావరకు జీఎస్టీ పన్నులు తగ్గించడంతో ఈసారి వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించాలని భావిస్తున్నాయి ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్‌లు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు. అయితే ఇలాంటి కార్యక్రమాలకు ముందస్తుగా అనుమతులు తప్పనిసరని చెబుతున్నారు హైదరాబాద్ పోలీసులు.

న్యూ ఇయర్‌-2026 సెలబ్రేషన్స్ ముస్తాబు

న్యూ ఇయర్ వేడుకలకు సమయం దగ్గరపడుతున్న వేళ హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వేడుకలు నిర్వహించాలని భావిస్తున్నాయి పలు సంస్థలు. అందులో హోటళ్లు, పబ్‌లు, రెస్టారెంట్‌లు, రిసార్ట్‌లు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థల వంటివి ఉన్నాయి.

ఒకవేళ ఈవెంట్ల నిర్వహిస్తే కచ్చితంగా ముందస్తుగా అనుమతులు ఉండాల్సిందేనని చెబుతున్నారు పోలీసులు. న్యూ ఇయర్ నైట్‌ వేడుకలకు సంబంధించిన అనుమతుల కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది సైబరాబాద్ కమిషనరేట్. కేవలం డిసెంబర్ 21 వరకు మాత్రమే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.

సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

అనుమతి కోసం దరఖాస్తులను కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తామని చెబుతున్నారు పోలీసులు. నేరుగా ఎలాంటి అప్లికేషన్లు స్వీకరించబడని తేల్చిచెప్పారు. అందుకోసం cybpms.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అయితే టికెట్ విక్రయాలతో జరిగే న్యూ ఇయర్ ఈవెంట్లకు కమర్షియల్ /టికెటెడ్ ఫారంను ఎంచుకోవాల్సి ఉంటుంది.

టికెట్లు లేకుండా జరిగే వేడుకలకు నాన్–కమర్షియల్ దరఖాస్తులు అందుబాటులో ఉండనున్నాయి. ఏ తరహా ఈవెంట్ నిర్వహించాలన్నా అందుకు అనుగుణంగా ఎంపిక చేసి అవసరమైన పత్రాలు జత చేయాలని చెబుతున్నారు పోలీసులు.

ALSO READ: తెలంగాణలో ముగిసిన తొలి విడత పంచాయతీ నామినేషన్లు, నల్గొండ జిల్లాలో నామినేషన్ల రికార్డు

డిసెంబర్ 21 తర్వాత దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లో పరిగణలోకి తీసుకోబోమని తేల్చిచెప్పారు. ముఖ్యంగా శాంతి భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, రాత్రి వేళల్లో ప్రజల సౌకర్యార్థం దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. న్యూ ఇయర్ సంబరాలంటే చెప్పనక్కర్లేదు.

నగర ప్రజలు రోడ్లపైకి వచ్చి ఘనంగా వేడుకలు నిర్వహించి సందడి చేస్తారు. ఓవైపు డీజే సౌండ్స్‌తో సందడి మరోవైపు కేకులు కట్ చేస్తూ సంతోషాన్ని పంచుకుంటారు. వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కఠిన నియమాలను అమలు చేస్తోంది. ఈసారీ డ్రంకెన్ డ్రైవింగ్, చట్ట వ్యతిరేక వేడుకలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఈ లెక్కన ఈవెంట్ నిర్వాహకులు ముందస్తు అనుమతులు పొందడం తప్పనిసరి.

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×