E-Paper
Advertisement

Kavitha: ‘కవిత అంటే పద్యం అనుకున్నారా, కాదు మద్యం’.. పోస్టర్ల కలకలం..

Kavitha: ‘కవిత అంటే పద్యం అనుకున్నారా, కాదు మద్యం’.. పోస్టర్ల కలకలం..
Advertisement

Kavitha: ముల్లును ముల్లుతోనే తీయాలి. పోస్టర్ల అటాక్‌కు పోస్టర్లతోనే కౌంటర్ ఇవ్వాలి.. ఇలా సాగుతోంది బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పొలిటికల్ వార్. ఈమధ్య అధికార బీఆర్ఎస్.. వాల్ పోస్టర్ల స్ట్రాటజీని బాగా అప్లై చేస్తోంది. హైదరాబాద్‌కు మోదీ, అమిత్‌షాలు వచ్చినప్పుడల్లా నగరంలో బీజేపీ వ్యతిరేక పోస్టర్లు ప్రత్యక్షమవుతున్నాయి. కేంద్రం తెలంగాణకు ఏం చేసింది? అంటూ మోదీ టార్గెట్‌గా పోస్టర్లు వెలుస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ సమన్లు ఇవ్వగా.. ‘పాస్ట్ బ్రిటీష్ రూల్.. ప్రెజెంట్ బీజేపీ రూల్’ అంటూ ‘బై బై మోడీ’ హ్యాష్ ట్యాగ్‌తో పోస్టర్లు వెలిశాయి. బీఎల్ సంతోష్ టార్గెట్‌గానూ పోస్టర్లు వేశారు. బీఎల్ సంతోష్‌ను పట్టిస్తే ప్రధాని మోడీ చెప్పిన నల్లధనంలోని రూ.15 లక్షల కోట్లు ఇస్తామంటూ.. ‘మోస్ట్ వాంటెడ్’ టైటిల్‌తో సిటీలోని బస్ స్టాప్‌ల్లో అతికించారు.

ఊరు, పేరు లేకుండా ఈ పోస్టర్లు వేసినా.. వేయించింది మాత్రం బీఆర్ఎసే అనేది ఓపెన్ సీక్రెట్. ఇలా వరుసగా వేస్తున్న పోస్టర్లతో చిర్రెత్తుకొచ్చిన కమలనాథులు.. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్‌లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. లేటెస్ట్‌గా కవిత టార్గెట్‌గా హైదరాబాద్‌లో వాల్ పోస్టర్లు కనిపించడం కలకలం రేపుతోంది.

Advertisement

పుష్ప మూవీలో అల్లు అర్జున్ డైలాగ్‌ను కవితకు అప్లై చేశారు. బన్నీ ఫోటోను కవిత ఇమేజ్‌తో మార్ఫింగ్ చేసి.. ఓ కొటేషన్ యాడ్ చేశారు. ‘కవిత అంటే పద్యం అనుకుంటున్నారు.. కాదు మద్యం’ అంటూ క్యాప్షన్ రాశారు. మరో పోస్టర్‌లో.. ‘మేనేజ్‌మెంట్ కోటా.. లిక్కర్‌లో వాటా..’, ఇంకో పోస్టర్లో ‘తెలంగాణ తల దించుకునేలా చేసినవ్..’ అంటూ కవితను కార్నర్ చేస్తూ సిటీలోని అనేక బస్‌స్టాపుల్లో ఓవర్ నైట్ పొలిటికల్ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్ వార్‌పై పబ్లిక్‌ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

Related News

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

Big Stories

Advertisement
×