BigTV English

Gold: తులం బంగారం రూ.60వేలు?.. ఈ వారమే రేట్ పీక్స్‌కు…?

Gold: తులం బంగారం రూ.60వేలు?.. ఈ వారమే రేట్ పీక్స్‌కు…?

Gold: తులం బంగారం ఎంత? 50వేల పైనే అని అంతా చెబుతారు. 58,420 అని అవగాహన ఉన్నవాళ్లు అంటారు. అదే ఆర్నమెంట్ గోల్డ్ అయితే 53,550. ఇది తెలుగు రాష్ట్రాల్లోని ప్రైజ్. స్టేట్‌ని బట్టి రేటు వేరీ అవుతుంది.


ఈవారం వరుసగా పెరుగుతూ వస్తోంది బంగారం ధర. ఒకరోజు వెయ్యికి పైగా పెరిగింది. శుక్రవారం మరో వెయ్యి పెరిగింది. శనివారం ఓ 250 పెరిగింది. ఇలా పెరుగుతూనే పోతోంది గోల్డ్ రేట్. ఒక్క మార్చి నెలలోనే రూ.3,628 ఇంక్రీజ్ అయింది. అంటే, సుమారు 6.51 శాతం పెరుగుదల.

పెరగడమేనా? ఎప్పుడు తగ్గుతుంది? అంటే ఇప్పట్లో తగ్గే ఛాన్సే లేదంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ముందుముందు మరింత పెరుగుతుందని చెబుతున్నారు. త్వరలోనే తులం బంగారం ధర 60వేలకు చేరుతుందని అంటున్నారు. త్వరలోనే అంటే వచ్చే నెలలోనో, ఆపై నెలలోనో కాదు. నెక్ట్స్ వీకే గోల్డ్ రేట్ 60వేల మార్క్ క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.


అసలే పెళ్లిళ్ల సీజన్. ఈ టైమ్‌లో గోల్డ్ రేట్ పెరిగితే బడ్జెట్ గుల్లే. మ్యారేజ్ డిమాండ్ వల్లే బంగారం ధర పెరిగిందని అనుకుంటారు కొందరు. కానీ కాదు. బంగారం ధరకు.. మన దగ్గర జరిగే పెళ్లిళ్లకు పెద్దగా సంబంధం ఏమీ ఉండదు. గోల్డ్ రేట్ డిసైడ్ చేసేది అంతర్జాతీయ బులియన్ మార్కెట్లే.

అమెరికాకు జలుబు చేస్తే.. ప్రపంచానికి తుమ్ములు వస్తాయనేది ఓ కామెడీ కొటేషన్. చాలా సందర్భాల్లో అది నిజమే. బంగారం విషయంలోనూ అదే జరుగుతోంది. అమెరికా, యూరప్‌లో బ్యాంకులు పతనమవుతున్నాయి. బ్యాంకింగ్ క్రైసిస్ వల్ల పెట్టుబడిదారులు.. స్టాక్ మార్కెట్ల నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్ విత్‌డ్రా చేస్తున్నారు. ఆ డబ్బును ఏళ్లుగా సురక్షితమైన పెట్టుబడి మార్గంగా ఉన్న.. బంగారంపై పెడుతున్నారు. అందుకే, గోల్డ్ రేట్ పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే 8 శాతం రాబడి ఇచ్చింది గోల్డ్.

ఇక, వచ్చే వారం యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ఉంది. బ్యాంకింగ్ క్రైసిస్ వల్ల ఫెడ్ మానిటరీ పాలసీ కాస్త సాఫ్ట్‌గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. రేట్స్ హైక్ విషయంలో ఫెడ్ అంత దూకుడుగా వెళ్లకపోవచ్చు. ఇదికూడా గోల్డ్ రేట్స్ పెరుగుదలకు అనుకూలాంశం. అందుకే, నెక్ట్స్ వీకే గోల్డ్ రేట్ 60వేల మార్క్‌ను టచ్ చేస్తుందని అంటున్నారు.

ధర పెరిగిందని బంగారం కొనేందుకు ఆగుతుంటే.. ముందుముందు మరింత ధర పెట్టాల్సి రావొచ్చు. అందుకే ఎప్పటి రేటు అప్పుడే. ఎప్పటి అవసరం అప్పుడే. కాకపోతే, ఇప్పుడు పెళ్లిళ్లు పెట్టుకున్న వారి జేబుకు చిల్లే.

Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×