BigTV English

Rajasingh is next Telangana President?: ఆర్ఎస్ఎస్ సూచన, రాజాసింగ్‌కే తెలంగాణ పగ్గాలు?

Rajasingh is next Telangana President?: ఆర్ఎస్ఎస్ సూచన, రాజాసింగ్‌కే తెలంగాణ పగ్గాలు?

Rajasingh is next TG President(Political news in telangana): తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు? పార్టీలో ఉన్నవారికే ఛాన్స్ ఇస్తారా? వలస వచ్చిన నేతలకు ఇస్తారా? కొత్త అధ్యక్షుడు ఎంపికలో బీజేపీ ఎందుకు తాత్సారం చేస్తోంది? బీజేపీకి ఆర్ఎస్ఎస్ చేసిన సూచనలు ఏంటి? ఆ లెక్కన రాజాసింగ్‌కు ఛాన్స్ ఉంటుందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.


తెలంగాణ ఈసారి బీజేపీ పగ్గాలు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కంటిన్యూ చేస్తారనే వాదనలు తెరపైకి వస్తున్నా యి. ఈ పదవి కోసం నలుగురు ఎంపీలు పోటీపడుతున్నారు. రఘునందర్, ఈటెల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్ రేసులో ఉన్నారు. ఎవరికి పదవి అప్పగించాలన్న దానిపై కమలనాధుల్లో ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. బలమైన నేత కోసం ఎదురుచూస్తున్నారు.

వలస వచ్చిన నేతలకు కీలక పదవులు ఇవ్వవద్దని బీజేపీలోకి ఓ వర్గం భావిస్తోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. రీసెంట్‌గా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు పైచిలుకు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసింది. కాకపోతే 230 స్థానాల వద్ద ఆగిపోయింది. బీజేపీ వ్యవహారశైలిని కొందరు ఆర్ఎస్ఎస్ నేతలు తప్పుబట్టారు. పార్టీని నమ్ముకున్నవారికి కాకుండా, వలస వచ్చిన నేతలకు ఛాన్స్ ఇవ్వడమే దీనికి కారణమని తమ అభిప్రాయాన్ని బయటపెట్టారు. అందుకే ఈసారి బీజేపీ సీట్లు తగ్గాయని కుండబద్దలు కొట్టేశారు.


ఈ క్రమంలో బీజేపీకి వెన్నంటే ఉన్న రాజాసింగ్‌కు అధ్యక్ష పదవి ఇస్తే ఎలా ఉంటుందని మంతనాలు సాగిస్తోంది బీజేపీ హైకమాండ్. తొలుత రాజాసింగ్‌కు ఛాన్స్ ఇవ్వాలన్నది ఆ పార్టీ అంతర్గత సమాచారం. ఎన్నికలకు ముందు సీనియర్‌కు పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని అంచనా వేస్తోంది.

ALSO READ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు.. రూ. 300 కోట్ల అక్రమాలు జరిగాయంటూ ప్రకటన

ఈ క్రమంలో తెలంగాణ కొత్త అధ్యక్షుడిగా దేశం, ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని నియమిస్తే బాగుంటుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మనసులోని మాట బయటపెట్టారు. పార్టీలో అందరి అభిప్రాయాలు తీసుకున్నాక ఎంపిక చేయాలని తెలిపారు. మరి ఈ లెక్కన తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×