E-Paper
Advertisement

Ravibabu : ఆ మూడు అంటే నాన్నకు ఎంతో ఇష్టం: రవిబాబు..

Ravibabu : ఆ మూడు అంటే నాన్నకు ఎంతో ఇష్టం: రవిబాబు..
Advertisement

Ravibabu : తన తండ్రి ప్రశాంతంగా కన్నుమూశారని నటుడు చలపతిరావు కుమారుడు రవిబాబు ప్రకటించారు. తన తండ్రి వ్యక్తిత్వం గురించి సినీ ఇండస్ట్రీలో చాలా మంది గొప్పగా చెబుతుంటే ఆనందంగా ఉండేదన్నారు. ఆయనకు ఎన్టీఆర్‌, మంచి భోజనం, జోక్స్‌ అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. ఎన్టీఆర్‌తో సినిమాల్లో కలిసి నటించే అదృష్టం తన తండ్రికి దక్కిందన్నారు.

సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ నాన్నను ‘బాబాయ్’ అని ముద్దుగా పిలుచుకుంటారని రవిబాబు గుర్తు చేశారు. అందరితో సరదాగా ఉండేవారని చెప్పారు. జోక్స్‌ వేస్తూ మాట్లాడేవారని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అందుకేనేమో సరదాగా ఎలాంటి నొప్పిలేకుండా ప్రశాంతంగా వెళ్లిపోయారని వివరించారు.తన తండ్రి శనివారం రాత్రి భోజనం చేసేవరకు బాగానే ఉన్నారని, చికెన్‌ బిర్యానీ, చికెన్‌ కూర తిని..ఆ ప్లేట్‌ అలా ఇచ్చి..వెనక్కి వాలిపోయారని రవిబాబు వివరించారు.

Advertisement

అనారోగ్యంతో కొంతకాలంగా నటనకు దూరంగా ఉన్న సీనియర్‌ నటుడు చలపతిరావు.. గుండెపోటుతో మరణించారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన కుమారుడు రవిబాబు ప్రకటించారు. ఆదివారమే అంత్యక్రియలు చేద్దామనుకున్నామని కానీ తన అక్కలు ఇద్దరూ అమెరికాలో ఉన్నారని తెలిపారు. వాళ్లు మంగళవారం రాత్రికి వస్తారని.. అప్పటివరకు మహాప్రస్థానంలో ఫ్రీజర్ లో చలపతిరావు పార్థీవదేవాహాన్ని ఉంచుతామని చెప్పారు.

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×