BigTV English

Chalapathirao : చలపతిరావు జీవితంలో చేదు జ్ఞాపకాలు.. ధైర్యంగా ముందడుగు..

Chalapathirao : చలపతిరావు జీవితంలో చేదు జ్ఞాపకాలు.. ధైర్యంగా ముందడుగు..

Chalapathirao : టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఐదున్నర దశాబ్దాల సినీప్రస్థానంలో నటుడిగా వెండితెరపై తనదైన ముద్ర వేశారు. అదే సమయంలో జీవితంలో అనేక కష్టాలను ఆయనను వెంటాడాయి. అయినా సరే ధైర్యంగా ముందుకు సాగారు. చలపతిరావు పూర్తి పేరు తమ్మారెడ్డి చలపతిరావు. కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని బలిపర్రులో 1944 మే 8న జన్మించారు. చలపతిరావు తండ్రిపేరు మణియ్య. తల్లి పేరు వియ్యమ్మ.


సినీ కెరీర్
22 ఏళ్లకే 1966లో సీనిరంగంలోకి అడుగుపెట్టారు. సూపర్‌స్టార్ కృష్ణ సూపర్‌హిట్ చిత్రం గూఢచారి 116.. చలపతిరావు మొదటి సినిమా. ఆ తర్వాత 1967లో సాక్షి చిత్రంలో ఓ పాత్ర పోషించారు. ఆ తర్వాత రెండేళ్లు అవకాశాలు రాలేదు. మళ్లీ 1969లో బుద్ధిమంతుడు సినిమాలో అవకాశం దక్కింది. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. వరుస చిత్రాలు చేస్తూ దూసుకుపోయారు. విలనిజంలో విలక్షణ శైలితో ఆకట్టుకున్నారు. డైలాగ్ లేకుండా చూపుతోనే భయపెట్టేవారు. ఈ శైలే ఆయనకు ఎన్నో అవకాశాలు తెచ్చిపెట్టింది. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేసినా ఆ తర్వాత పూర్తి స్థాయి విలన్ గా మెప్పించారు. చాలా సినిమాల్లో ప్రధాన ప్రతినాయకుడిగా పాత్రలు చేశారు.

కాలంతో మార్పు..
విలన్‌గానే కాకుండా అన్ని రకాల పాత్రల్లో చలపతిరావు ప్రేక్షకులను మెప్పించారు. కెరీర్ ప్రారంభం నుంచి చాలా కాలం విలన్ పాత్రల్లో కనిపించిన చలపతిరావు 90వ దశకంలో రూటు మార్చారు. హీరోకి తండ్రి పాత్రను చేయగలనని నిరూపించారు. నిన్నేపెళ్లాడతా చిత్రంలో నాగార్జునకు తండ్రిగా నటించడం ఆయన కెరీర్‌ను మలుపుతిప్పింది. అప్పటి నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక అవకాశాలను దక్కించుకున్నారు. ఇలా రెండో ఇన్నింగ్స్ ను సుధీర్ఘకాలం కొనసాగించారు.


నిర్మాతగా
చలపతిరావు ఏడు సినిమాలకు నిర్మాతగాను వ్యవహరించారు. కలియుగ కృష్ణుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్ల పంట, ప్రెసిడెంటుగారి అల్లుడు, అర్ధరాత్రి హత్యలు, రక్తం చిందిన రాత్రి చిత్రాలు ఆయన నిర్మించారు.

తల్లి, తండ్రి తానై…
చలపతిరావు భార్యపేరు ఇందుమతి. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబాన్ని ఒప్పించారు. వీరికి ముగ్గురు సంతానం. అయితే ఈ జంటను చూసి విధికి కన్ను కుట్టింది. ముగ్గురు పిల్లలు పుట్టిన కొన్నేళ్లకే చలపతిరావు సతీమణి ఇందుమతి అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. చెన్నైలో ఉన్న సమయంలో ఇంట్లోనే ఈ ప్రమాదం జరిగింది. వేకువజామున మంచినీళ్లు పట్టేందుకు వెళ్లిన ఇందుమతి చీరకు నిప్పంటుకుంది. ఆ తర్వాత ఆస్పత్రిలో 3రోజులు మృత్యువుతో పోరాడి ఇందుమతి ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అప్పటికి కొడుకు రవిబాబు వయస్సు ఏడేళ్లు మాత్రమే.

భార్య చనిపోయిన తర్వాత చలపతిరావును మళ్లీ పెళ్లి చేసుకోవాలని కుటుంబసభ్యులు ఎంత ఒత్తిడి చేసినా ఆయన మాత్రం ఒప్పుకోలేదు. రవిబాబు కూడా తండ్రికి మళ్లీ పెళ్లి చేయాలని చాలా ప్రయత్నాలు చేశారట. చలపతిరావు ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే పిల్లల బాధ్యత తీసుకున్నారు. వారిని ఉన్నత చదువులు చదివించారు. కుమారుడు రవిబాబు టాలీవుడ్‌లో నటుడిగా కెరీర్ ను ప్రారంభించి దర్శకుడిగా రాణిస్తున్నారు. ఇద్దరు కుమార్తెలు అమెరికాలో స్థిరపడ్డారు. ఇలా నటుడిగా కొనసాగుతూనే కుటుంబాన్ని చక్కదిద్దారు చలపతిరావు. పిల్లలకు తల్లి,తండ్రి తానే అయి ముందుండి నడిపించారు. తల్లిలేని లోటు తీర్చారు. పిల్లలకు బంగారు భవిష్యత్తును ఇచ్చారు.

సిల్లీ ఫెలోస్‌ సినిమా షూటింగ్‌ సమయంలో చలపతిరావు ప్రమాదానికి గురయ్యారు. దాదాపు 8 నెలలపాటు చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. ఆ సమయంలో కంటిచూపు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇలా జీవితంలో కష్టాలు ఎదురైనా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందడుగు వేశారు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చారు. తాను సంతోషంగా జీవితాన్ని గడిపారు. ఎలాంటి వివాదాల జోలికి పోకుండా అందరితోనూ కలిసిమెలిగారు.

అందరికీ బాబాయ్
విభిన్న పాత్రలతో తనదైన ముద్ర వేసిన చలపతిరావుకు సినీ పరిశ్రమలో చాలా మంచి పేరుంది. అందరూ ఆయనను బాబాయ్‌ అని అప్యాయంగా పిలిచేవారు. అందరికీ తలలో నాలుకలాగా ఉండేవారు. అందుకే మూడు తరాల హీరోలతో కలిసి నటించే అరుదైన అవకాశం ఆయనకు దక్కింది.

Related News

Solar Village: సీఎం ఊరుకు సౌర సొబగులు.. దేశంలోనే రెండో సోలార్ విద్యుత్ గ్రామంగా కొండారెడ్డిపల్లి

MLC Kavitha VS Harish Rao: సిద్దిపేట నుంచి కవిత పోటీ?

Local Body Elections: ముదురుతున్న స్థానిక ఎన్నికల రగడ.. ఎన్నికలు జరుగుతాయా? లేదా?

Kandi Srinivasa Reddy: కంది శ్రీనివాస్ రెడ్డికి.. కాంగ్రెస్ బిగ్ షాక్!

Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ రచ్చ.. అసలేం జరిగిందంటే!

Musi River Floods: మూసీ ఉగ్రరూపం.. హైడ్రా ఆన్ యాక్షన్..

Kadapa TDP Internal Issue: కడపలో గ్రూపు రాజకీయాలు.. ఈ వ్యవహారం వెనుక ఉన్నదెవరు?

YCP Digital Book: ఒక్కొక్కరికి ఇక సినిమానే..! డిజిటల్ బుక్‌పై టీడీపీ రియాక్షన్ ఏంటి?

Big Stories

×