BigTV English

Praneet Rao Case: SIB ప్రణీత్ రావు కేసు.. మాజీ పోలీస్ అధికారుల ఇళ్లలో సోదాలు

Praneet Rao Case: SIB ప్రణీత్ రావు కేసు.. మాజీ పోలీస్ అధికారుల ఇళ్లలో సోదాలు

Praneet Rao Case


Praneet Rao Case Latest News: మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కస్టడీ నేటితో ముగియనుండటంతో పోలీసులు దూకుడు పెంచారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఏకకాలంలో 10 చోట్ల తనిఖీలు నిర్వహించారు. ఇప్పటికే ప్రభాకర్ రావు ఆదేశాలతోనే హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేశానని ప్రణీత్ రావు స్టేట్ మెంట్లో వెల్లడించారు.

దీంతో ఆయన ఇంట్లో సోదాలు జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు.. ఆయనకు సహకరించిన పోలీసు అధికారుల ఇళ్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్ లోని ఐ న్యూస్ ఓనర్ శ్రవణ్ కుమార్ రావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆయన ఇంట్లో 2 ల్యాప్ టాప్ లు, 4 ట్యాబ్ లు, 5 పెన్ డ్రైవ్ లు, ఒక హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నారు.


Also Read: తలకు తుపాకీ గురి, పీకపై కత్తి.. దుండగులను ఎదుర్కొన్న శివంగులు

ప్రణీత్ రావు, శ్రవణ్ రావు మధ్య జరిగిన వాట్సాప్ ఛాట్ ను రీట్రీవ్ చేశారు పోలీసులు. ఇప్పటికే మాజీ ఎస్పీ భుజంగరావు, SIB డీఎస్పీ తిరుపతి ఇళ్లలో సోదాలు చేసి కీలక ఆధారాలు సేకరించారు. అటు హైదరాబాద్ మాజీ టస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇంట్లోనూ తనిఖీలు చేశారు. కొన్ని హార్డ్ డిస్క్ లను నాగోల్ మూసీ బ్రిడ్జి కింద పడేసినట్లు పోలీసులు గుర్తించారు.

Tags

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×