E-Paper
Advertisement

Prithviraj Sukumaran: రాజులా ఉండే వాడిని.. ఇప్పుడు బానిస అయ్యాను: స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్

Prithviraj Sukumaran: రాజులా ఉండే వాడిని.. ఇప్పుడు బానిస అయ్యాను: స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్
Advertisement
TheGoatLife
TheGoatLife

Prithviraj Sukumaran: మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. మలయాళంతో పాటు తెలుగులోనూ పలు సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. తన నటనతో తెలుగులోనూ ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకున్నాడు.

ఇటీవలే టాలీవుడ్ స్టార్ హీరోకి ఫ్రెండ్ రోల్‌లో నటించి అదరగొట్టాడు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించి మెప్పించాడు. ఇందులో ప్రభాస్‌కు స్నేహితుడి పాత్రలో నటించి దుమ్ము దులిపేశాడు.

Advertisement

ఈ చిత్రంతో పృథ్వీరాజ్‌కు తెలుగులో మరింత క్రేజ్ దక్కింది. అయితే ఈ చిత్రం తర్వాత ఇప్పుడు మరొక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘ది గోట్ లైఫ్’ తెలుగులో ఆడుజీవితం అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు.

Also Read: ఈ రోజు టీవీల్లో సందడే సందడి.. స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రసారం..

Advertisement

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో పృథ్వీరాజ్ డిఫరెంట్ లుక్‌లో కనిపించి అదరగొట్టేశాడు. ముఖ్యంగా ట్రైలర్‌లో చూసుకుంటే మూడు పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఈ చిత్రానికి బ్లెస్సీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ మార్చి 28న మలయాళం, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. కాగా తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రబ్యూషన్ సంస్థ విడుదల చేస్తోంది. ఈ తరుణంలో రిలీజ్‌కు ముందుకు ఓ వేడుకను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు.

ఈ వేడుకలో హీరో పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మూవీని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించారని అన్నారు. ఈ చిత్రాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ చాలా ఎమోషనల్ అవుతారు అని తెలిపాడు.

Also Read: సుహాస్ కొత్త మూవీ ‘శ్రీ‌రంగనీతులు’ నుంచి లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల

దాదాపు 2008లో అనుకున్న ఈ చిత్రాన్ని 2024లో విడుదల చేస్తున్నామని.. ఈ ఒక్క సినిమా కోసం 16 ఏళ్లు ప్రయాణం చేశామంటే మాటలు కాదని అన్నారు. అయితే ఈ మూవీ కోసం మొదటిగా బరువు పెరిగానని.. ఆ తర్వాత ఏకంగా 31 కిలోలు తగ్గాల్సి వచ్చిందని అన్నాడు.

అంతేకాకుండా సలార్ మూవీలో వరదరాజ మన్నార్‌గా ‘కింగ్’ లా నటించాను.. అయితే ఇప్పుడు ది గోట్ లైఫ్ మూవీలో బానిసగా నటించాను అని తెలిపాడు. ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా జరిగిన కథ.

అయితే తన కెరీర్‌లో ఎంతో ముఖ్యమైన ఈ సినిమా వల్ల మెగాస్టార్ చిరంజీవితో రెండు సార్లు కలిసి పనిచేసే అవకాశాన్ని కోల్పోయానని అన్నాడు. ఫ్యూచర్‌లో ఆయనతో పనిచేసే అవకాశం వస్తే తప్పకుండా పనిచేస్తానని తెలిపాడు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×