E-Paper
Advertisement

Mahesh Kumar Goud: సెంటిమెంట్ కుర్చీ.. కథ పెద్దదే!

Mahesh Kumar Goud: సెంటిమెంట్ కుర్చీ.. కథ పెద్దదే!
Advertisement

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. మరికొద్ది గంటల్లో జరగనున్న ఆ కార్యక్రమానికి గాంధీభవన్ సుందరంగా ముస్తాబైంది. ఆయన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ముఖ్యనేతలతో పాటు ఢిల్లీ పెద్దలు హాజరుకానున్నారు. పార్టీ పెద్దలు పలువురు హాజరు కానుండటంతో గాంధీ భవన్ లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

అవన్నీ రోటీన్‌గా జరిగేవే అయినా ఒక కుర్చీ గురించి హస్తం పార్టీ లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. గాంధీ భవన్‌లో ఉన్న ఓ కుర్చీ కి పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కు వీడదీయలేని బంధం ఉందంట. మహేష్ గౌడ్ ఎక్కడ ఉంటే అక్కడ ఆ కుర్చీ ఉండాలట. కుర్చీ వచ్చిన నాటి నుంచి మహేష్ గౌడ్‌కు అన్ని కలసి వచ్చాయని ఆయన సన్నిహితులు అంటున్నారు. దాంతో ఇంతకీ ఆ కుర్చీ కథేంటో తెలుసుకోవాలని ఆందరూ ఆరా తీస్తున్నారు.

Also Read: రేవంత్ రెడ్డి… నీకు దమ్మంటే ఆ నిర్ణయం తీసుకో : కేటీఆర్

Advertisement

మహేష్ గౌడ్ ఎన్ఎస్‌యూఐ నుంచి పార్టీలో ఉన్నప్పటికీ ఆ కుర్చీ వచ్చిన తర్వాతే అన్ని కలసి వస్తున్నాయట. ఏ రోజైతే తన ఇంటికి ఆ కుర్చీ వచ్చిందో అనాటి నుంచి రాజకీయాల్లో అన్ని కలసి వచ్చాయని మహేష్ గౌడ్ చెపుతుంటారు. తన ఇంట్లోకి ఆ కుర్చీ రాగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ వచ్చిందని సన్నితులతో చెప్తుంటారంట. దాంతో గాంధీ భవన్‌లోని తన ఛాంబర్ లో ఇంటి దగ్గర ఉన్న కుర్చీ తెప్పించుకుని ఇన్ని రోజులు దాంట్లోనే కూర్చున్నారు. ఇప్పుడు పీసీసీ పదవి రావడం తో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏ కుర్చీ లో అయితే కూర్చున్నారో అదే కూర్చిని తన కొత్త చాంభర్‌కు మార్పించుకున్నారు.

మహేష్ గౌడ్ కుర్చీ సెంటిమెంట్ ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారట. యనకేంటి కుర్చీ సెంటిమెంట్ అని చర్చించుకుంటున్నారు. తే ఏవరు ఏమనుకుంటే ఏంటి. తనకు అదృష్టం తెచ్చిన కూర్చీని సెంటిమెంట్‌గా ఫాలో అవ్వడానికి ఫిక్స్ అయ్యారాయన. ఎవరి నమ్మకాలు వారివి మరి

Related News

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!

భవిష్యత్‌లో తెలంగాణకు బీసీయే సీఎం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

ఎల్-నినోతో ఎండిపోతున్న పంటలు.. గద్వాల జిల్లా మదనపల్లిలో కన్నీటి దృశ్యం!

తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం.. రాపిడో డ్రైవర్ మృతి..!

మందు బాబులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్!

వరుణయాగాలు చేసి ప్రజలను వదిలేసారా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!

Big Stories

Advertisement
×