E-Paper
Advertisement

Vivo X200 Pro: 16GB ర్యామ్, డైమెన్సిటీ 9400 చిప్‌సెట్‌తో వివో కొత్త ఫోన్.. తగ్గేదే లే!

Vivo X200 Pro: 16GB ర్యామ్, డైమెన్సిటీ 9400 చిప్‌సెట్‌తో వివో కొత్త ఫోన్.. తగ్గేదే లే!
Advertisement

Vivo X200 Pro Launch Date: వివో కంపెనీ దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దుమ్ము దులిపేస్తుంది. వరుస పెట్టి ఫోన్లను విడుదల చేసి ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వివో కంపెనీ సామాన్యుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. అతి తక్కువ ధరలో ఫోన్లను లాంచ్ చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. వివో ఫోన్ కొనేవారు ఎక్కువగా కెమెరా క్వాలిటీని దృష్టిలో పెట్టుకుని కొనుక్కుంటారు. తక్కువ ధర ఫోన్‌ నుంచి ప్రీమియం ధర ఫోన్‌ వరకు ప్రతీ సిగ్మెంట్ మొబైల్ ప్రియులను ఆకట్టుకుంటుంది.

ఇప్పటికే ఎన్నో సిరీస్‌లలో కొత్త కొత్త మోడళ్లను తీసుకొచ్చిన వివో త్వరలో మరో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. Vivo త్వరలో తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ Vivo X200ని విడుదల చేయడానికి రెడీగా ఉంది. ఈ సిరీస్‌ను కంపెనీ వచ్చే నెల అంటే అక్టోబర్ 14న లాంచ్ చేయనుంది. ఈ నేపథ్యంలో ఫోన్ ప్రారంభానికి ముందు సిరీస్‌లోని హై ఎండ్ వేరియంట్ Vivo X200 Pro తాజాగా ముఖ్యమైన గీక్‌బెంచ్‌లో సర్టిఫికేషన్‌లో కనిపించింది. అంతేకాకుండా ఇది చైనా 3C సర్టిఫికేషన్‌లో కూడా దర్శనమిచ్చింది. దీంతో దాని స్పెసిఫికేషన్లు బయటకొచ్చాయి. ఇప్పుడు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

Advertisement

Vivo X200 సిరీస్‌లోని Vivo X200 Pro స్మార్ట్‌ఫోన్ వచ్చే నెల 14న చైనాలో విడుదల కానుంది. లాంచ్‌కు ముందు ఫోన్ చైనా 3C సర్టిఫికేషన్‌లో గుర్తించబడింది. అందులో సిరీస్‌లోని మూడు ఫోన్‌ల మోడల్ నంబర్‌లు కనిపించాయి. అవి V2419A, V2405A, V2415A మోడల్ నంబర్‌లు ఉన్నాయి. మూడింటిలోనూ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందుబాటులో ఉంది. కాగా ఈ మూడు మోడల్ నంబర్‌లలో V2405A సిరీస్ అనేది బేస్ మోడల్ అని చెప్పబడింది. అదే సమయంలో V2419Aని Vivo X200 Pro అని తెలుస్తోంది. Vivo X200 Pro ఫోన్ గీక్‌బెంచ్‌లో కూడా కనిపించింది. ఇక్కడ ఫోన్ దాని ప్రాసెసర్, RAM గురించి తెలిసింది.

Also Read: 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌, 50MP కెమెరాతో సామ్‌సంగ్ కొత్త ఫోన్.. ఇక చెడుగుడే!

Advertisement

దాని ప్రకారం.. ముందుగా దీని ప్రాసెసర్ విషయానికొస్తే.. MediaTek డైమెన్సిటీ 9400 చిప్‌సెట్‌ను ఇందులో చూడవచ్చు. దీనితో కంపెనీ 16GB వరకు RAM అందించే అవకాశం ఉందని చెప్పబడింది. దీంతోపాటు ఫోన్ ఇతర ర్యామ్ వేరియంట్‌లను కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అలాగే ఇందులో కంపెనీ శక్తివంతమైన ఆక్టాకోర్ చిప్‌సెట్‌ను ఉపయోగిస్తుందని తెలుస్తుంది.

ఇక వీటి స్కోర్‌ల విషయానికొస్తే.. Vivo X200 Pro ఫోన్ గీక్‌బెంచ్‌లోని సింగిల్ కోర్ టెస్ట్‌లో 1531 పాయింట్లు సాధించగా, మల్టీకోర్ టెస్ట్‌లో 6168 పాయింట్లు సాధించింది. అయినప్పటికీ ఈ స్కోర్లు సరైనవిగా తీసుకోబడవు. ఎందుకంటే ఈ స్కోర్లు Vivo దాని పాత మోడళ్లలో ఉపయోగించిన డైమెన్సిటీ 9300 చిప్‌సెట్ కంటే తక్కువగా ఉన్నాయి. అందువల్ల దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే అని అంటున్నారు.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×