E-Paper
Advertisement

Telangana Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025.. నేటి షెడ్యూల్ ఇదే..

Telangana Global Summit: తెలంగాణ రైజింగ్  గ్లోబల్ సమ్మిట్ 2025.. నేటి షెడ్యూల్ ఇదే..
Advertisement

Telangana Global Summit: రెండు రోజుల పాటు జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ఈరోజు (డిసెంబర్​ 8) మధ్యాహ్నం 1.30కు ప్రారంభమవుతుంది. సీఎం రేవంత్​ రెడ్డి మధ్యాహ్నం 12.30కు ఫ్యూచర్​ సిటీకి చేరుకుంటారు. ముందుగా గ్లోబల్ సమ్మిట్​ వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు. సమ్మిట్ అధికారిక ఆరంభ కార్యక్రమం 1:30 PMకు ప్రారంభమవుతుంది. ఈ వేడుకకు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజా ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన విజయాలు, తెలంగాణ అభివృద్ధి గమ్యం, భవిష్యత్ పరిశ్రమల దిశగా తీసుకుపోతున్న ప్రణాళికలను వివరించనున్నారు.

ప్రపంచ ఆర్థిక సదస్సును తలపించేలా తెలంగాణ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలు దాదాపు 3 వేల మంది ఇందులో పాల్గొంటున్నారు. ప్రారంభోత్సవ వేడుకల అనంతరం ముఖ్యమంత్రి వివిధ రంగాలకు చెందిన ప్రతినిధుల బృందంతో విడివిడిగా సమావేశమవుతారు. దేశ విదేశాల నుంచి వచ్చిన వివిధ రంగాల ప్రతినిధులు, దిగ్గజ కంపెనీల ప్రతినిధులను ఈ సందర్భంగా సీఎం కలుసుకుంటారు. ప్రతి 15 నిమిషాలకో వన్ టు వన్​ రౌండ్​ టేబుల్​ మీటింగ్‌ లో ముఖ్యమంత్రి పాల్గొంటారు.

Advertisement

మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు దాదాపు 15 సమావేశాల్లో సీఎం పాల్గొంటారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత శ్రీ కైలాష్ సత్యార్థి, రిపబ్లిక్​ ఆఫ్​ కొరియా ప్రతినిధులు, ట్రంప్ మీడియా ప్రతినిధులు, అమెజాన్. ఐకియా ప్రతినిధులు, టెక్స్​టైల్​, ఫర్నిచర్ తయారీ MSME, ఎలక్ట్రానిక్స్, మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ ​ రంగ ప్రతినిధులు, SIDBI, వరల్డ్ బ్యాంక్, వెస్ట్రన్ యూనియన్ ప్రతినిధులతో ఈ రౌండ్​ టేబుల్​ సమావేశాలు ఏర్పాటు చేశారు.

ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో పేరొందిన కంపెనీల ప్రతినిధులు, యూనివర్సిటీ ఆఫ్ లండన్‌ ప్రతినిధులు, వంతార, VinGroup ప్రతినిధులు, వివిధ దేశాల నుంచి వచ్చిన రాయబారులు, ఇతర అంతర్జాతీయ ప్రతినిధులతో సమావేశమవుతారు. రాత్రి 7 గంటలకు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రి పాల్గొంటారు.

Advertisement

80 ఎకరాల్లో 8 జోన్లు, 33 క్లస్టర్లుగా ఏర్పాట్లు పూర్తికాగా 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు రానున్నారు. అత్యధికంగా అమెరికా నుంచి 54 మంది హాజరుకానున్నారు. ఇవాళ, రేపు 27 అంశాలపై చర్చలు జరగనున్నాయి. 1000 కెమరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం 1500 మంది పోలీసులు విధుల్లో పాల్గొనున్నారు.

రాష్ట్ర భవిష్యత్తు సరికొత్తగా ఆవిష్కరించే దిశగా.. 2047 నాటికి తెలంగాణను త్రీ ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన విజన్ డాక్యుమెంట్‌ను ఈ వేదికపై సీఎం ఆవిష్కరించనున్నారు.

ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేస్తున్న దిగ్గజ పారిశ్రమాక వేత్తలు, ఆర్ధిక నిపుణులు , నోబల్ గ్రహీతలకు ఆతిధ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ ముస్తాబయింది. ప్రభుత్వం భారీ స్థాయిలో మౌళిక సదుపాయాలు కల్పించింది. ఇక ఈ వేదిక వద్ద అత్యాధునిక హంగులతో తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ అతిధులకు ఏమాత్రం లోటు రాకుండా వారికి ఫైస్టార్ హోటల్ అనుభూతి అందించేలా ప్రత్యేకంగా మోస్ట్ ఇంపార్టెంట్ పర్శన్ జోన్‌ను రూపొందించారు.

గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో సీఎం రేవంత్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మొత్తం నాలుగు ప్రధాన హాల్‌లలో 27 అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఇక సదస్సుకు హాజరయ్యే అతిధులను ఆకట్టుకునేలా ఆకర్షణీయమైన డిజిటల్ టన్నెల్‌ను ఏర్పాటు చేశారు ప్రముఖుల రాకకోసం మూడుహెలిపాడ్‌లతో పాటు, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నారు. గిన్నీస్ వరల్డ్ రికార్డును లక్ష్యంగా చేసుకుని భారీ డ్రోన్‌షో ఈ సమ్మిట్‌లో ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు.

తొలి రోజున 12 అంశాలపై ఈ చర్చా వేదికలు ఏర్పాటు చేశారు. వివిధ రంగాలు.. విభిన్న అంశాలపై ఇందులో చర్చిస్తారు. సంబంధిత శాఖల మంత్రుల సారధ్యంలో ఆయా రంగాల నిపుణులు, మేధావులు ఈ చర్చల్లో పాల్గొంటారు.

తొలి రోజున జరిగే ప్యానెల్​ డిస్కషన్లు.

3 గంటల నుండి 4 గంటల వరకు మొదటి సెషన్​

హాల్ 1:
The Just Transition into 2047 – Powering Telangana’s Future – తెలంగాణ భవిష్యత్తు ఇంధనం.. గ్రీన్ ఎనర్జీ దిశలో ముందడుగు

హాల్ 2:
Green Mobility 2047 – Zero Emission Vehicles ఎలక్ట్రిక్ వాహనాలు, నాన్-ఎమిషన్ టెక్నాలజీ

హాల్ 3:
Tech Telangana 2047 – Semiconductors & Frontier Technologies
సాంకేతిక రంగంలో సెమీ కండక్టర్, ఫ్రంటియర్ టెక్నాలజీ అవకాశాలు

హాల్ 4:
Telangana as a Global Education Hub
విద్యా రంగంలో తెలంగాణను గ్లోబల్ సెంటర్‌గా తీర్చిదిద్దే వ్యూహం

4:15 నుంచి 5:15 వరకు రెండో సెషన్

హాల్ 1:
Telangana Flying High – The Rise of Aerospace & Defence – ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణ వృద్ధిపై చర్చ.

హాల్ 2:
Talent Mobility (TOMCOM & MEA) – అంతర్జాతీయ అవకాశాలు, నైపుణ్య మార్పిడి విధానాలపై చర్చ.

హాల్ 3:
A Healthy Telangana for Prosperous Telangana” – ఆరోగ్యరంగం అభివృద్ధి దిశగా చర్చ.

హాల్ 4:
Korea (4:10–4:50 PM),
Australia (4:50–5:30 PM) ఆ రెండు దేశాలతో వివిధ రంగాల్లో సాంకేతిక, నైపుణ్యాల సహకారం, పెట్టుబడి భాగస్వామ్యంపై చర్చలు

5:30 నుంచి 6:30 వరకు మూడో సెషన్​

హాల్ 1:
Telangana Partnering with ASEAN Tigers – ఆసియా దేశాలతో ఆర్థిక భాగస్వామ్యంపై చర్చ.

హాల్ 2:
Gig Economy – Rise of Fluid Careers
గిగ్ వర్కర్స్, డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఉద్యోగాల భవిష్యత్తుపై చర్చ.

హాల్ 3:
The RARE Strategy – Increasing Farmers Income through Value Chains
రైతుల ఆదాయం పెంపొందించే వ్యూహాలపై చర్చ.

హాల్ 4:
Canada Session,
Fostering Entrepreneurship in Women – రెండు సెషన్లు.. కెనడాతో వివిధ రంగాల్లో సహకార భాగస్వామ్యాలు,

పారిశ్రామికవేత్తలుగా మహిళల సాధికారత.

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×