E-Paper
Advertisement

Aadhaar New Rules: ఇకపై ఆధార్ కొత్త రూల్స్.. జెరాక్స్‌కు ఫుల్‌స్టాప్, అంతా ఆ స్టయిల్‌లో

Aadhaar New Rules: ఇకపై ఆధార్ కొత్త రూల్స్.. జెరాక్స్‌కు ఫుల్‌స్టాప్, అంతా ఆ స్టయిల్‌లో
Advertisement

Aadhaar New Rules: ఆధార్ పేరు చెప్పగానే చాలామంది ఇప్పటికీ చాలామంది వణుకుతుంటారు. ప్రభుత్వం ఆఫీసులకు వెళ్లిన ప్రతీసారి సామాన్యుడు, ఆధార్ పట్టుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు జెరాక్స్ అడుగుతారేమోనని టెన్షన్ వారిని అనుక్షణం వెంటాడుతోంది. ఇకపై జెరాక్స్ వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పెట్టబోతోంది ఆధార్ ప్రాధికార సంస్థ ఉడాయ్.

Advertisement

ఆధార్‌లో కొత్త మార్పులు

Advertisement

సైబర్ మోసాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో వారిని అరికట్టేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయినా సరే సామాన్యులు వాటి బారినపడి డబ్బులు పొగొట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆధార్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఆధార్ యాక్ట్ ప్రకారం.. సంబంధిత వ్యక్తి అనుమతి లేకుండా ఆధార్ జెరాక్స్‌ని సేకరించడం చట్టవిరుద్ధం.

ఇప్పుడు ఇంకా గట్టిగా అమలు చేసేందుకు సిద్ధమైంది. పూర్తిగా డిజిటల్ వెరిఫికేషన్‌కు మార్చేందుకు సిద్ధమైంది. UIDAI కొత్తగా తెచ్చిన పద్దతుల్లో రెండు రకాల వెరిఫికేషన్ ఉన్నాయి. ఆధార్ కార్డులోని QR కోడ్ స్కాన్ ఇప్పటికే ఉంది. త్వరలో రెండు అత్యాధునిక ఫీచర్స్ రాబోతున్నాయి.

జెరాక్సులతో పని ఉండదు, అంతా డిజిటల్ స్టయిల్‌లో

మొబైల్ యాప్ ద్వారా రియల్-టైమ్ ధృవీకరణ ఒకటి, OTPతో వెరిఫై అయితేచాలు, కస్టమర్ పేరు, ఫొటో, అడ్రస్ సంస్థకు కనిపిస్తాయి. ఆ డేటా ఎక్కడా సేవ్ కాదు, సర్వర్‌లో ఉండదు. డేటా లీక్ అసాధ్యమని నిపుణులు. ఈ విషయాన్ని UIDAI సీఈఓ భువనేశ్ కుమార్ స్వయంగా వెల్లడించారు. అది అమలైతే పేపర్ ఆధారిత ఆధార్ జెరాక్స్‌లకు ఫుల్‌స్టాప్ పడడం ఖాయం.

ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్‌గా డిజిటల్‌ పద్దతిలో జరగాల్సిందే. కొత్త యాప్‌లో ఇవేకాకుండా చాలా సౌకర్యాలున్నాయి. ప్రతి లావాదేవీకి సెంట్రల్ సర్వర్‌కు కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. యాప్-టు-యాప్ ప్రామాణీకరణకు మద్దతు ఇచ్చే కొత్త అప్లికేషన్‌ను బీటా-టెస్టింగ్ చేస్తోంది.

ALSO READ: ఇండిగో రీఫండ్ రూ.610 కోట్లు, కేంద్రం ప్రకటన

ఎయిర్‌పోర్ట్ చెక్-ఇన్, సిమ్ కార్డు తీసుకున్నా కేవలం స్కాన్ లేదా ఓటీపీతో పనైపోతుంది.హోటల్ రూమ్ బుక్ చేసినా ఇదే పద్దతి కొనసాగనుంది. ఈ యాప్ రాబోయే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టానికి మద్దతు ఇస్తుంది. ఇలా చేస్తే పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్‌కు అనుగుణంగా ఉంటుందని UIDAI అధికారుల మాట.

మరో 18 నెలల్లో కొత్త చట్టం అమల్లోకి వస్తే పర్సనల్ డేటా సెక్యూరిటీ కొత్త స్థాయికి చేరుకుంటుందని చెబుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే రానున్న రోజుల్లో మీ డేటా ఎవరి వద్ద ఉండదన్నమాట. దీనివల్ల ఆధార్ డేటాబేస్‌ సర్వర్‌లలో అంతరాయాల వల్ల కలిగే సవాళ్లను కూడా పరిష్కరిస్తుందని భావిస్తున్నారు.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×